పద్మల్ పురి కాకో పుణ్యక్షేత్రం
పద్మల్ పురి కాకో పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు గ్రామ సమీపంలో పవిత్ర గోదావరి నది[1] తీరంలో కొలువైన ఆదివాసీ గొండు గిరిజనుల చారిత్రకమైన పుణ్య క్షేత్రం.[2] [3][4].
పద్మల్ పురి కాకో పుణ్యక్షేత్రం గుడిరేవు | |
---|---|
పేరు | |
ఇతర పేర్లు: | అమ్మెరు దేవత |
ప్రధాన పేరు : | పద్మల్ పురి కాకో దేవస్థానం గుడిరేవు |
దేవనాగరి : | पद्मल पुरि काको |
మరాఠీ: | पद्मल पुरि काको |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | మంచిర్యాల జిల్లా,మండలం దండేపల్లి |
ప్రదేశం: | గుడిరేవు గ్రామం గోదావరి నది ఒడ్డున |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | పద్మల్ పురి కాకో |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | పునర్నిర్మాణం 09 ఎప్రిల్ 2017 |
ఆలయ చరిత్ర
మార్చుపద్మల్ పురి కాకో ఆలయం గోండు రాజుల కాలంలో నిర్మించబడిన పురాతన ఆలయం. ఇచట ఆదివాసీలు ప్రతి ఏటా ఆశ్వయజ,కార్తీక మాసంలో గూడిరేవు సమీపంలో గోదావరి నది ఒడ్డున కోలువైన పద్మల్ పూరి కాకో ఆలయానికి వేళ్ళి అమ్మోరు ను దర్శిసించు కుంటారు. ఈ ఆలయం గోదావరి వరద తాకిడికి పూర్తిగా శిథిలమైంది. ఆలయం శిథిలమైనప్పటి నుండి ఆదివాసీలు ఓ చెట్టుకింద దేవతను నెలకొల్పినారు.కాకో దర్శనానికి వేళ్ళినప్పుడు గోదావరి నదిలో స్నానాలు చేసి గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేసినాంతరం తమ ఆరాధ్యదైవం అయిన పద్మల్ పురి కాకో,ఎత్మాసూర్ దేవతలకు గంగాజలంతో అభిషేకం చేసి నైవేద్యాలు సమర్పించి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు.
ఆలయ నిర్మాణం
మార్చుపద్మల్ పురి కాకో ఆలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయశాఖ వారు నిధులు కేటాయించారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కామన్ గుడ్ ఫండ్ కింద రూ, 30 లక్షలు విడుదల చేయడంతో ఆలయ కమిటీ వారు కొత్త ఆలయాన్ని నిర్మించుకున్నారు.
ఆలయ విశిష్టతలు
మార్చుపద్మల్ పూరి కాకో ఆలయాన్ని సందర్శిస్తే కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం అదివాసుల్లో ఉంది. ఉత్సవాలకు ఒక రోజు ముందుగానే వచ్చి గోదావరి నది జలాలతో అమ్మ వారికి అభిషేకం చేస్తారు.
ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ,పాడి పంటలు పెంపొందుతాయని విశ్వాసం.
దండారి ఉత్సవాలు
మార్చుప్రతి సంవత్సరం ఆదివాసులు దసరా,దీపావళి,పండఒకుగను పురష్కరించుకోని పద్మల్ పురి కాకో ఆలయం వద్ద దండారి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు[5]. ఈ వేడుకలకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర ,ఛత్తీస్ గఢ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కాకో అమ్మవారిని దర్శించుకోని సంబురాలలో పాల్గొంటారు[6]. ఆలయ కమిటి వారి ఆధ్వర్యంలో దండారి ఉత్సవాలు,పుష్యమాసంలో పెర్సపేన్ ఉత్సవాలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ వేడుకలను తీలకించడానికి పరిసర గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.అమ్మ వారిని నిష్టతో కొలుస్తారు.కోళ్ళు, మేకలు,బలి ఇచ్చి భోజనాలు చేస్తారు.ఈ ఉత్సవాల సందర్భంగా వారు గుస్సాడి నృత్యాలు చేస్తారు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆదివాసీల గోదారమ్మ | Adivasi godavari river | Sakshi". www.sakshi.com. Retrieved 2024-10-15.
- ↑ Velugu, V6 (2023-11-11). "కోకో అమ్మవారికి ప్రత్యేక పూజలు". V6 Velugu. Retrieved 2024-10-14.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "పద్మల్ పురి కాకోబాయి – సారంగ". magazine.saarangabooks.com. Retrieved 2024-10-14.
- ↑ "Mancherial: గోదావరి తీరంలో గోండుల పుణ్యస్థలి.. దక్షిణ భారత దేశంలోనే ఏకైక ఆదివాసీ శక్తి పీఠం". News18 తెలుగు. 2022-10-22. Retrieved 2024-10-15.
- ↑ ABN (2024-10-15). "గిరిజన గూడేల్లో గుస్సాడీ సందడి". Andhrajyothy Telugu News. Retrieved 2024-10-16.
- ↑ "అడవి తల్లి ఒడిలో..దండారి సంబరం." Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-02. Retrieved 2024-10-15.