పద్మశ్రీ పిక్చర్స్
పద్మశ్రీ పిక్చర్స్ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి ప్రసిద్ధ దర్శకులు పి.పుల్లయ్య.[1] అతను తన కుమార్తె పేరు మీద ఉన్న పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించాడు. యన సతీమణి తెలుగు సినీనటి పి.శాంతకుమారి.

అతను ఈ బ్యానర్ మీద కొన్ని హిట్ సినిమాలను తెరక్కించారు. దీంతో ఆయనను పద్మశ్రీ పుల్లయ్య అని పరిశ్రమలో చాలా మంది పిలిచేవారు. దీంతో, ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వకపోయినా దర్శకుడు పుల్లయ్యగారు ఆ అవార్డు పొందారని నటుడు గుమ్మడి చమత్కరించేవారు. [2]
నిర్మించిన సినిమాలు
మార్చు- అందరూ బాగుండాలి (1976)
- ప్రజా నాయకుడు (1972)
- కొడుకు కోడలు (1972)
- అల్లుడే మేనల్లుడు (1970)
- వింత కాపురం (1968)
- ప్రాణమిత్రులు (1967)
- ప్రేమించి చూడు (1965)
- మురళీకృష్ణ (1964)
- సిరిసంపదలు (1962)
- శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
- జగన్నాటకం (1960)
మూలాలు
మార్చు- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2025-06-10.
- ↑ "ప్రభుత్వం ఇవ్వకపోయినా 'పద్మశ్రీ' పొందిన దర్శకుడు". indiaherald.com. Retrieved 2025-06-10.