పాక్యోంగ్ జిల్లా

సిక్కిం రాష్ట్రంలోని ఒక జిల్లా

పాక్యోంగ్ జిల్లా, భారతదేశం, సిక్కిం రాష్ట్రంలోని ఒక జిల్లా. ఈ జిల్లా పరిపాలన పాక్యోంగ్ పట్టణం నుండి నిర్వహించబడుతుంది.[3] ఈ జిల్లా 2021లో పూర్వ తూర్పు సిక్కిం జిల్లా లోని పాక్యోంగ్ ఉప విభాగం, రంగ్‌పో ఉప విభాగం, రోంగ్లీ ఉప విభాగాల నుండి ఏర్పడింది.[4]పూర్వ జిల్లా లోని మిగిలిన గాంగ్‌టక్ ఉప విభాగానికి గాంగ్‌టక్ జిల్లాగా పేరు పెట్టారు. ఇది ఇప్పుడు వాయువ్యంలో పాక్యోంగ్ జిల్లాకు సరిహద్దుగా కలిగి ఉంది. అదనంగా జిల్లా ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ లోని కాలింపాంగ్ జిల్లా, భూటాన్, చైనా, సిక్కింలోని నాంచి జిల్లాలతో సరిహద్దులుగా ఉంది. పాక్యోంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం పాక్యోంగ్ పట్టణంలో ఉంది.

Pakyong District
Mt. Kangchenjunga view from Thambi View Point, Dzuluk, Pakyong District Sikkim.
Mt. Kangchenjunga view from Thambi View Point, Dzuluk, Pakyong District Sikkim.
పటం
Pakyong district
Location in Sikkim
Coordinates: 27°23′N 88°59′E / 27.383°N 88.983°E / 27.383; 88.983
Country India
HeadquartersPakyong
Government
 • District magistrateMr. Tashi Chopel[1] [2]
 • Lok Sabha constituenciesSikkim Constituency
 • Vidhan Sabha constituencies
విస్తీర్ణం
 • Total404 కి.మీ2 (156 చ. మై)
Elevation
1,120 మీ (3,670 అ.)
జనాభా
 (2011)
 • Total74,583
 • జనసాంద్రత180/కి.మీ2 (480/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-SK
Vehicle registrationSK-07
Major Highways
Longest Bridge
Largest Stadium
Largest Wildlife Sanctuary

గణాంకాలు

మార్చు
 
నాథంగ్ లోయ, పాక్యోంగ్ జిల్లా, సిక్కిం

పాక్యోంగ్ జిల్లా మొత్తం వైశాల్యం 404 చ.కి.మీ. (156 చ.మైళ్లు) విస్తీర్ణం కలిగిఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా మొత్తం 74,583.[5]

రవాణా

మార్చు

రోడ్డు మార్గాలు

మార్చు
 
జాతీయ రహదారి 717B (భారతదేశం) జులుక్, పాక్యోంగ్ జిల్లా సిక్కిం వద్ద మారుతోంది.

పాక్యోంగ్ జిల్లాలోని ప్రధాన రహదారులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • జాతీయ రహదారి 10 సిలిగురి నుండి గ్యాంగ్‌టక్‌ను కలుపుతుంది, ఇది పాక్యోంగ్ జిల్లాలో రంగ్‌పో నుండి సింగ్‌తామ్ వరకు మజితార్ మీదుగా వెళుతుంది
  • జాతీయ రహదారి-717A బాగ్రాకోట్ నుండి గ్యాంగ్‌టక్‌ను కలుపుతుంది. ఇది పాక్యోంగ్ జిల్లాలో రేషి, రెనోక్ నుండి రోరాతంగ్, పాక్యోంగ్ మీదుగా రాణిపూల్ సమీపంలో సెటిపూల్ వరకు ఉంది. [6]
  • జాతీయ రహదారి-717 బి రెనోక్, మెన్లా, షెరాతాంగ్ జులుక్, రోంగ్లీ మీదుగా చాలావరకు కలిపే రహదారి పాక్యోంగ్ జిల్లాలోనే ఉంది. [7]
  • అటల్ సేతు వంతెన, సిక్కిం పొడవైన రహదారి వంతెన పాక్యోంగ్ జిల్లాను పశ్చిమబెంగాల్‌ లోని కాలింపాంగ్ జిల్లాతో కలుపుతూ పాక్యోంగ్ జిల్లాలో ఉంది.

రైల్వే

మార్చు

నిర్మాణంలో ఉన్న సివోక్-రాంగ్పోరైలు మార్గం పాక్యోంగ్ జిల్లాలో రంగ్పో పట్టణంతో ముగుస్తుంది. దీనిని తర్వాత గ్యాంగ్‌టక్‌కు పొడిగించాలనే ప్రణాళిక ఉంది.

వాయుమార్గాలు

మార్చు

పాక్యోంగ్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం సిక్కిం లోని ఏకైక విమానాశ్రయం.

శాసనసభ నియోజకవర్గాలు

మార్చు
 
గ్నాతంగ్ కృష్ణ మందిర్ పాక్యోంగ్ జిల్లా సిక్కిం

పాక్యోంగ్ జిల్లా పరిధిలోకి వచ్చేశాసనసభ నియోజకవర్గాలు ఈ క్రిందివిధంగా ఉన్నాయి.

  • రెనాక్ శాసనసభ నియోజకవర్గం
  • చుజాచెన్ శాసనసభ నియోజకవర్గం
  • పశ్చిమ పెండాం శాసనసభ నియోజకవర్గం
  • గ్నాతంగ్-మచోంగ్ శాసనసభ నియోజకవర్గం
  • నామ్‌చాయ్‌బాంగ్ శాసనసభ నియోజకవర్గం

ముఖ్యమైన పట్టణాలు, నగరాలు

మార్చు
 
జులుక్, పాక్యోంగ్ జిల్లా, సిక్కింలోని ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం

జిల్లాలోని ప్రధాన పట్టణాలు, నగరాలు

  • పాక్యోంగ్
  • రంగపో
  • రోరతంగ్
  • రెనోక్
  • రోంగ్లీ
  • మజితార్
  • కుమ్రెక్

వన్యప్రాణుల అభయారణ్యాలు

మార్చు
 
పంగోలాఖా వన్యప్రాణుల అభయారణ్యం, పాక్యోంగ్ జిల్లా, సిక్కింలోని విభిన్న వృక్షజాలం

పంగోలాఖా వన్యప్రాణుల అభయారణ్యం పాక్యోంగ్ జిల్లాలో ఉంది. ఇది ఉత్తర బెంగాల్‌, కాలింపాంగ్ జిల్లాలోనినియోరా వ్యాలీ జాతీయ ఉద్యానవనం అరిటార్ ముల్ఖర్కా రాచెలా ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం ద్వారా అనుసంధానించబడింది. సుమిన్ రిజర్వ్ ఫారెస్ట్, సరంసా గార్డెన్, పాక్యోంగ్ జిల్లాలో ఉన్నాయి. ఇది వివిధ రకాల పూలమొక్కలు, జంతుజాలంతో సమృద్ధిగా నిండి ఉంది.

పాక్యోంగ్ జిల్లాలో వివిధ రకాల మొక్కలు, వన్యప్రాణులు కనిపిస్తాయి. ముఖ్యమైన రెడ్ పాండా రాష్ట్ర జంతువు, బ్లడ్ నెమలి, రాష్ట్ర పక్షి డెండ్రోబియం, నోబిల్ రాష్ట్ర పుష్పం, రాష్ట్ర చెట్టు రోడోడెండ్రాన్ పాక్యోంగ్ జిల్లా లోని వన్యప్రాణుల అభయారణ్యంలో కనిపిస్తాయి.

ఇతర ముఖ్యమైన అడవి జంతువులలో మంచు చిరుత, హిమాలయ నల్ల ఎలుగుబంటి, మేఘావృతమైన చిరుతపులి,[8] పెద్ద భారతీయ సివెట్ మొదలైనవి ఉన్నాయి. అటవీ శాఖ, సిక్కిం ప్రభుత్వం 2019 జనవరిలో పాక్యోంగ్ జిల్లా లోని పంగోలాఖా వన్యప్రాణుల అభయారణ్యంలో రాయల్ బెంగాల్ టైగర్ ఉనికిని నిర్ధారించింది [9]

నదులు, సరస్సులు

మార్చు

నదులు

మార్చు
  • రాష్ట్రంలోని అతిపెద్ద తీస్తానది పాక్యోంగ్ జిల్లాలో సింగ్టామ్ నుండి రంగ్పో వరకు ప్రవహిస్తుంది.
  • సిక్కింలోని మూడవ అతి పెద్ద నది రంగ్‌పో నది పాక్యోంగ్ జిల్లాలోని రోంగ్లీ ఉప విభాగం లోని లేక్ మెన్‌మెచో నుండి ఉద్భవించింది. రంగ్‌పో పట్టణంలో తీస్తా నదిని కలవడానికి ముందు పాక్యోంగ్ ఉప విభాగం, రోంగ్లీ ఉప విభాగం గ్రామాలు, పట్టణాల గుండా ప్రవహిస్తుంది.
  • జల్ధకా నది పాక్యోంగ్ జిల్లా లోని జులుక్ దగ్గర ఉద్భవించి భూటాన్, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు ప్రవహిస్తుంది.
  • పాక్యోంగ్ జిల్లా లోని ఇతర ప్రధాన నదులు రిచు ఖోలా, రోంగ్లీ ఖోలా, పచే ఖోలా, రేషి ఖోలా మొదలైనవి.

సరస్సులు

మార్చు

జిల్లాలోని ముఖ్యమైన సరస్సులు:

  • లంపోఖరి, అరిటార్
  • గ్నాథంగ్ హార్ట్ లేక్
  • రోలెప్ క్రింద రంగ్పో ఆనకట్ట సరస్సు.

క్రీడలు

మార్చు

పాక్యోంగ్ జిల్లా లోని రంగ్పో వద్ద ఉన్న మైనింగ్ క్రికెట్ స్టేడియం మొత్తం సిక్కిం లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియం సిక్కిం క్రికెట్ అసోసియేషన్‌ నిర్వహణలో ఉంది. రంజీ ట్రోఫీ, సికె నాయుడు ట్రోఫీ, కూచ్ బెహార్ ట్రోఫీ, విజయ్ మర్చంట్ ట్రోఫీ మొదలైన ముఖ్యమైన క్రికెట్ టోర్నమెంట్‌లను నిర్వహిస్తుంది. ఇది సిక్కిం క్రికెట్ జట్టు సొంత మైదానం.[10] [11] పాక్యోంగ్ జిల్లా లోని ఇతర ప్రధాన క్రీడా మైదానాలు సెయింట్ జేవియర్స్ ఫుట్‌బాల్ గ్రౌండ్ - పాక్యోంగ్, రోంగ్లీ మేళా గ్రౌండ్, రెనోక్ ఎస్.ఎస్.ఎస్ గ్రౌండ్, చుజాచెన్ ఎస్.ఎస్.ఎస్ గ్రౌండ్, సెంట్రల్ పెండమ్ ఎస్.ఎస్.ఎస్ గ్రౌండ్ మొదలైనవి.

చదువు

మార్చు

పాక్యోంగ్ జిల్లాలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి.వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఈ క్రిందివిధంగా ఉన్నాయి:

విజయాలు

మార్చు
  • 2020లో భారత ప్రభుత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం, సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాలోని పాక్యోంగ్ పోలీస్ స్టేషన్ దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పది పోలీసు స్టేషన్‌లలో ఏడవ స్థానంలో ఉంది [12]
  • వివంత సిక్కిం, పాక్యోంగ్ జిల్లాలోని ఫైవ్ స్టార్ హోటల్ హిక్సా ఉత్తమ హోటల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. [13]
  • జెట్‌సెన్ డోనా లామా, సిక్కింలోని పాక్యోంగ్‌కు చెందిన 9 ఏళ్ల బాలిక 2022 జనవరి 22న జీ టీవీలో ప్రసారమైన 'సా రే గమా పా లిటిల్ ఛాంప్స్' అనే సింగింగ్ రియాలిటీ షోను గెలుచుకుంది [14] [15]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "सिक्किम सरकार ने नवनिर्मित सोरेंग और पाकयोंग जिलों के लिए दो नए जिला आयुक्तों के नामों की घोषणा की". dailynews360.patrika.com. Archived from the original on 2023-08-12. Retrieved 2023-08-12.
  2. "District Collectors". sikkim.gov.in.
  3. "3 sub-divisions of East Sikkim to form Sikkim's newest district Pakyong -Eastmojo". eastmojo.com (in ఇంగ్లీష్).
  4. "Sikkim's New District To Become a Transportation Hub". northeasttoday.in (in ఇంగ్లీష్).
  5. "3 sub-divisions of East Sikkim to form Sikkim's newest district Pakyong -Eastmojo". eastmojo.com (in ఇంగ్లీష్).
  6. "Doklam effect: Sikkim to get new all-weather highway". newindianexpress.com (in ఇంగ్లీష్).
  7. "NHIDCL floats tender for road works in Sikkim". constructionweekonline.in.
  8. Indian Ministry of Forests and Environment. "Protected areas: Sikkim". Archived from the original on 23 August 2011. Retrieved 25 September 2011.
  9. Singh, Shiv Sahay (9 January 2019). "Caught on camera: Sikkim's Royal Bengal Tiger". The Hindu.
  10. "For first time Sikkim to host Ranji Trophy matches, Himalayan state allotted three fixtures". nenow.in.
  11. "Sikkim to host 3 Ranji Trophy matches for the first time". currentaffairs.adda247.com.
  12. "Pakyong Police Station comes 7th in top performing police stations of India". thenortheasttoday.com. 3 December 2020.[permanent dead link]
  13. "Vivanta Sikkim wins HICSA best hotel of the year award". www.eastmojo.com.
  14. "Jetsen Dona Lama Shines on Sa Re Ga Ma Pa Little Champs". indiatodayne.in.
  15. "Jetshen Dohna Lama is the winner of Sa Re Ga Ma Pa Li'l Champs season 9". indiatodayne.in.

వెలుపలి లంకెలు

మార్చు