పాడవోయి భారతీయుడా (పాట)
పాడవోయి భారతీయుడా అనే ఈ పాట 1961లో విడుదలైన వెలుగు నీడలు చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రచయిత శ్రీ శ్రీ, గానం ఘంటసాల, పి. సుశీల, మాధవపెద్ది సత్యం, వెంకటేశ్వరరావు, స్వర్ణలత. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, నటీనటులు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, గిరిజ, ఎస్.వి. రంగారావు, రేలంగి, సూర్యకాంతం. దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు,
పాట నేపథ్యం
మార్చుపాటలోని సాహిత్యం
మార్చుపాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ
పాడవోయి భారతీయుడా
నేడె స్వాతంత్ర్య దినం వీరుల త్యాగ ఫలం
నేడె స్వాతంత్ర్య దినం వీరుల త్యాగ ఫలం
నేడె నవోదయం నీదే ఆనందం ఓ..
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా ..
పాడవోయి భారతీయుడా
ఓ ఓ ఓ ఓ
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ
సంబర పడగానే సరిపోదోయి
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ
సంబర పడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొందీ
అదె విజయమనుకుంటె పొరపాటోయి ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా ఆ ఆ
ఆగకోయి భారతీయుడా
ఆకాశం అందుకొనే ధరలొక వైపు
అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు
ఆకాశం అందుకొనే ధరలొక వైపు
అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు
అవినీతి బంధుప్రీతి
చీకటి బజారూ
అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ
కాంచవోయి నేటి దుస్థితి
పదవీ వ్యామోహాలు కులమత భేదాలు
భాషా ద్వేషాలు చెలరేగె నేడు
పదవీ వ్యామోహాలు కులమత భేదాలు
భాషా ద్వేషాలు చెలరేగె నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే ఏ ఏ
ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనె వాడే
స్వార్ధమీ అనర్ధకారణం
అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్
స్వార్ధమీ అనర్ధకారణం
అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్
స్వార్ధమీ అనర్ధకారణం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే
లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులె శుభ సందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులె శుభ సందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులె శుభ సందేశం