వెలుగునీడలు (1961 సినిమా)
అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన వెలుగు-నీడలు ఒక మంచి సాంఘిక చిత్రం. ప్రతి మనిషి జీవితంలో వెలుగు నీడలు వుంటాయని, వాటిని దీరోదాత్తంగా ఎదుర్కొనాలని హితవు చెప్పే ఈ చిత్రం ప్రతి సన్నివేశాన్ని రసవత్తరంగా తీర్చిదిద్దారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు.
వెలుగునీడలు (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
నిర్మాణం | డి.మధుసూదనరావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి, జగ్గయ్య, ఎస్.వి.రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి వెంకటరామయ్య, సూర్యకాంతం, గిరిజ, రాజసులోచన, పద్మనాభం, పేకేటి శివరామ్, ఇ.వి.సరోజ, పెండ్యాల నాగేశ్వరరావు |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది సత్యం |
సంభాషణలు | ఆచార్య ఆత్రేయ |
ఛాయాగ్రహణం | పి.ఎన్.సెల్వరాజ్ |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ పిక్చర్స్ |
విడుదల తేదీ | జనవరి 7, 1961 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సంక్షిప్త చిత్రకథ
మార్చురావు బహదూర్ వెంకట రామయ్య (యస్.వి.రంగారావు), భార్య కనకదుర్గమ్మ (సూర్యకాంతం) దంపతులకు సంతానంలేని కారణంగా సుగుణ (సావిత్రి)ని పెంచుకుంటారు. తరువాత వారికి సంతానయోగం కలిగి వరలక్ష్మి (గిరిజ) పుడుతుంది. సుగుణపై వెగటు పుడుతుంది. దీనిని గ్రహించిన వెంకట రామయ్య సుగుణ బాధ్యతల్ని గుమస్తా వెంగళప్పకు అప్పచెబుతాడు.
డాక్టరు చదువుతున్న సుగుణకు కవితలు రాసే రవి (నాగేశ్వరరావు)తో పరిచయమవుతుంది. అది ప్రేమకు దారితీస్తుంది. విదేశాల నుంచి వచ్చిన రఘు (జగ్గయ్య) సుగుణ అంటే అభిమానం చూపిస్తాడు. రవికి క్షయవ్యాధి వస్తుంది. తన పరిస్థితి తెలిసిన రవి సుగుణను వప్పించి రఘుతో పెళ్ళి జరిపిస్తాడు.
విధి వంచితుడైన రఘు ప్రమాదంలో మరణిస్తాడు. రవి మదనపల్లి శానిటోరియంలో వుండి ఆరోగ్యవంతుడవుతాడు. సుగుణ కోరిక మేరకు వరలక్ష్మిని పెళ్ళి చేసుకుంటాడు. రావుబహదూర్ వెంకటరామయ్య స్వాతంత్రం వచ్చినా పూర్వం నాటి బ్రిటీష్ రాజభక్తి మాత్రం వదలరు. తాను బ్రిటీష్ కాలంలో ప్రారంభించిన రాజసేవ పత్రిక అదే పేరుతో, అదే ధోరణితో నడపడమే కాక జార్జిప్రెస్ అన్న ప్రెస్ పేరునూ అలాగే కొనసాగిస్తారు. రాజసేవ పత్రికను నడిపించమన్న మావగారి కోరిక మీద దాని యాజమాన్యం స్వీకరించి నడిపిస్తాడు రవి. రాజసేవ పత్రికను నవజ్యోతిగా మార్చి, దాన్ని లాభాల బాట పట్టిస్తారు. అయితే తన అభ్యుదయ భావాలతో పత్రిక లాభాల్లో వాటా ఇవ్వాలని హామీ ఇవ్వగా, అప్పటికే ఆ లాభాలన్నిటినీ కుటుంబంలోని వారు ఖర్చుచేసేయడంతో హతాశుడవుతాడు. గతంలో రవి, సుగుణ ప్రేమించుకున్న విషయం తెలుసుకున్న వరలక్ష్మి భర్తను అనుమానిస్తుంది. చివరకు నిజం తెలుసుకొని పశ్చాత్తాప పడుతుంది.
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఓ రంగయో పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో | శ్రీ శ్రీ | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల పి.సుశీల |
కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు | శ్రీశ్రీ | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల |
పాడవోయి భారతీయుడా, ఆడిపాడవోయి విజయగీతికా నేడే స్వాతంత్ర్యదినం, వీరుల త్యాగఫలం |
శ్రీశ్రీ | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల పి.సుశీల |
హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందుజల్లి నవ్వసాగే ఎందుకో | శ్రీశ్రీ | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల పి.సుశీల |
చిట్టీపొట్టీ చిన్నారి పుట్టినరోజు, చేరి మనం ఆడేపాడే పండుగరోజు | శ్రీశ్రీ | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల, స్వర్ణలత |
చల్లని వెన్నెల సోనలు, తెల్లని మల్లెల మాలలు, మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు | శ్రీశ్రీ | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల, జిక్కి |
భలే భలే మంచి రోజులు లే ,ఘంటసాల , మాధవపెద్ది, బృందం, రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి
సరిగంచు చీరకట్టి ... నిలపర చిన్నోడు నీ సోకు,ఘంటసాల, సుశీల , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి
ఇతర విశేషాలు
మార్చు- పాడవోయి భారతీయుడా నృత్య గీతంలో రాజసులోచన అతిథిగా పాల్గొన్నారు.
- కలకానిది నిజమైనది రేడియో స్టేషను లో పాట రికార్డింగ్ సందర్భంగా ఆర్కెస్ట్రా కండక్టర్ గా పెండ్యాల నాగేశ్వరరావు కనిపిస్తారు.
మూలాలు
మార్చు- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007. కలకానిది విలువైనది పాట లిరిక్స్ విశ్లేషణ - కొన్ని అరుదైన , అపురూపమైన పాటల్ని లోతైన విశ్లేషణలతో ఈ వేదిక … పాటను యధాతధంగా కాదు అందులోని లోతైన అర్థాన్నీ , అంతరార్థాన్ని , అంతకన్నా మించి పాట లోలోతుల్లో కదలాడుతున్న, కవితాత్మక , తాత్విక రసగుళికల్ని, మీ హృదయంలోకి ఒంపుతుంది. పాట విశ్లేషణ కొరకు https://www.teluguoldsongs.net/2021/01/blog-post_4.html తెలుగు పాత పాటల విశ్లేషణ బ్లాగ్