ఆంధ్రప్రదేశ్ జిల్లాలు
ఆంధ్రప్రదేశ్ జిల్లాలు 26. లోకసభ నియోజకవర్గం ప్రాంతం ఒకే జిల్లాప్రాతిపదికన గతంలో గల 13 జిల్లాలను, జిల్లాల పునర్య్వస్థీకరణతో 26 జిల్లాలుగా చేసారు.[1]అయితే జనసాంద్రత తక్కువగా వుండే షెడ్యూల్ తెగల అరకు లోకసభ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. (OSM గతిశీల పటం.)
చరిత్రసవరించు
1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు 13 జిల్లాలుండేవి. 1956లో తెలంగాణాతో కలిసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 21 జిల్లాలుండేవి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విభజన తర్వాత మరలా 13 జిల్లాల రాష్ట్రమైంది. ఇవి 670 మండలాలు, 50 రెవిన్యూడివిజన్లుగా విభజించబడినవి. 2022 లో ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ వలన 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను (అరకు లోకసభ నియోజక వర్గాన్ని రెండు జిల్లాలుగా, మిగతా లోకసభ నియోజకవర్గాలను స్వల్ప మార్పులతో) జిల్లాలుగా ఏర్పాటుచేయుటకు, ప్రభుత్వం 2022 జనవరి 26 న అభ్యంతరాలు స్వీకరించుటకు ప్రాథమిక నోటిఫికేషన్‌లు విడుదల చేసింది.[2] 2022 ఏప్రిల్ 3న జిల్లాల పునర్య్వస్థీకరణతో కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌లు జారీ చేసింది.[3] దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారింది.[4] మండలాలను 670 నుండి 679 కి రెవెన్యూ డివిజన్లను 50 నుంచి 72కు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్లు విడుదలచేసింది.[5] తరువాత కొత్తపేట రెవెన్యూ డివిజన్, పులివెందుల రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటయినాయి.[6] ఇంకా రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారిక గెజెట్ 5 ఆగష్టు 2022 న ప్రకటించారు.[7]
జిల్లాల గణాంకాలుసవరించు
2022 పునర్య్వస్థీకరణ, తదనంతర సవరణల ప్రకారం రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు గణాంకాలు.[8]
- జిల్లాల సంఖ్య: 26 (మరిన్ని వివరాలకు ఆంధ్రప్రదేశ్_జిల్లాలు#జిల్లాల_గణాంకాలు చూడండి.)
- మొత్తం మండలాలు: 679
2022 పునర్య్వస్థీకరణలో గతంలో ఉన్న మండలాలకు జరిగిన మార్పులు
- గుంటూరు మండలం -> గుంటూరు తూర్పు మండలం, గుంటూరు పశ్చిమ మండలం (2)
- కర్నూలు మండలం -> కర్నూలు పట్టణ, కర్నూలు గ్రామీణ మండలం (2)
- విజయవాడ పట్టణ మండలం -> విజయవాడ మధ్య మండలం, విజయవాడ ఉత్తర మండలం, విజయవాడ తూర్పు మండలం, విజయవాడ పశ్చిమ మండలం (4)
- నెల్లూరు మండలం -> నెల్లూరు పట్టణ మండలం , నెల్లూరు గ్రామీణ మండలం (2)
- విశాఖపట్నం పట్టణ మండలం + విశాఖపట్నం గ్రామీణ మండలం -> సీతమ్మధార మండలం, గోపాలపట్నం మండలం, ములగాడ మండలం, మహారాణిపేట మండలం (4)
వివరణ:2022 పునర్య్వస్థీకరణలో గతంలో ఉన్న 670 మండలాలలో విశాఖపట్నం పట్టణ మండలం, విజయవాడ పట్టణ మండలం, గుంటూరు మండలం, నెల్లూరు మండలం, కర్నూలు మండలం ఈ 5 మండలాలు రద్దై, వాటిస్థానంలో పైన వివరించిన ప్రకారం 14 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వాటితో రాష్ట్రం లోని మండలాలసంఖ్య 679కి చేరుకుంది.
- రెవెన్యూ డివిజన్లు: 75 (మరిన్ని వివరాలకు ప్రధాన వ్యాసం: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా చూడండి)
- రద్దుఅయిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు
- రెవెన్యూ డివిజన్లు - 1 (వర్గం:చారిత్రాత్మక రెవెన్యూ డివిజన్లు)
- మండలాలు - 5 (వర్గం:ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేసిన మండలాలు)
వివరాలు పట్టికసవరించు
ఆంధ్రప్రదేశ్సవరించు
జిల్లా | ప్రధాన
కార్యాలయం |
రెవిన్యూ డివిజన్లు | మండలాలు
సంఖ్య ( 2022 లో ) |
వైశాల్యం
(కి.మీ2) |
జనాభా
(2011 ) లక్షలలో [9] |
జనసాంద్రత
(/కి.మీ2) |
---|---|---|---|---|---|---|
అనకాపల్లి | అనకాపల్లి | 2 | 24 | 4,292 | 17.270 | 402 |
అనంతపురం | అనంతపురం | 3 | 31 | 10,205 | 22.411 | 220 |
అన్నమయ్య | రాయచోటి | 3 | 30 | 7,954 | 16.973 | 213 |
అల్లూరి సీతారామరాజు | పాడేరు | 2 | 22 | 12,251 | 9.54 | 78 |
ఎన్టీఆర్ | విజయవాడ | 3 | 20 | 3,316 | 22.19 | 669 |
ఏలూరు | ఏలూరు | 3 | 28 | 6,679 | 20.717 | 310 |
కర్నూలు | కర్నూలు | 3 | 26 | 7,980 | 22.717 | 285 |
కాకినాడ | కాకినాడ | 2 | 21 | 3,019 | 20.923 | 693 |
కృష్ణా | మచిలీపట్నం | 4 | 25 | 3,775 | 17.35 | 460 |
గుంటూరు | గుంటూరు | 2 | 18 | 2,443 | 20.91 | 856 |
చిత్తూరు | చిత్తూరు | 4 | 31 | 6,855 | 18.730 | 273 |
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ | అమలాపురం | 3 | 22 | 2,083 | 17.191 | 825 |
తిరుపతి | తిరుపతి | 4 | 34 | 8,231 | 21.970 | 267 |
తూర్పు గోదావరి | రాజమహేంద్రవరం | 2 | 19 | 2,561 | 18.323 | 715 |
నంద్యాల | నంద్యాల | 3 | 29 | 9,682 | 17.818 | 184 |
పల్నాడు | నరసరావుపేట | 3 | 28 | 7,298 | 20.42 | 280 |
పశ్చిమ గోదావరి | భీమవరం | 2 | 19 | 2,178 | 17.80 | 817 |
పార్వతీపురం మన్యం | పార్వతీపురం | 2 | 15 | 3,659 | 9.253 | 253 |
ప్రకాశం | ఒంగోలు | 3 | 38 | 14,322 | 22.88 | 160 |
బాపట్ల | బాపట్ల | 3 | 25 | 3,829 | 15.87 | 414 |
విజయనగరం | విజయనగరం | 3 | 27 | 4,122 | 19.308 | 468 |
విశాఖపట్నం | విశాఖపట్నం | 2 | 11 | 1,048 | 19.595 | 1870 |
వైఎస్ఆర్ | కడప | 4 | 36 | 11,228 | 20.607 | 184 |
శ్రీకాకుళం | శ్రీకాకుళం | 3 | 30 | 4,591 | 21.914 | 477 |
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు | నెల్లూరు | 4 | 38 | 10,441 | 24.697 | 237 |
శ్రీ సత్యసాయి | పుట్టపర్తి | 3 | 32 | 8,925 | 18.400 | 206 |
మూలాలుసవరించు
- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
- ↑ "New Districts: ఇక 26 జిల్లాలు". EENADU. Retrieved 2022-01-26.
- ↑ "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2022-04-23. Retrieved 2022-04-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "New Districts In AP: ఏపీలో కొత్త జిల్లాలివే.. గెజిట్ విడుదల". ETV Bharat News. Retrieved 2022-04-03.
- ↑ "26 జిల్లాల పాలన". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ "పులివెందుల వాసులకు గుడ్ న్యూస్.. ఇక అధికారికంగా... జగన్ సర్కారు ఉత్తర్వులు". సమయం. 2022-06-29. Retrieved 2022-06-30.
- ↑ "జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, నెరవేరిన కల!". Samayam Telugu. Retrieved 2022-08-15.
- ↑ "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ "Population of AP districts(2011)" (PDF). ap.gov.in. p. 14. Archived from the original (pdf) on 2013-05-16. Retrieved 25 May 2014.
జిల్లా విశేషాలుసవరించు
- అతి పెద్ద జిల్లా: ప్రకాశం జిల్లా
- అతి చిన్న జిల్లా: విశాఖపట్నం జిల్లా
- అతి తక్కువ మండలాలు గల జిల్లా: విశాఖపట్నం జిల్లా
- అతి ఎక్కువ మండలాలు గల జిల్లాలు: ప్రకాశం జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
- 2011 నాటి గణాంకాల ప్రకారం అత్యల్ప జనసాంద్రత గల జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లా
- 2011 నాటి గణాంకాల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల జిల్లా: విశాఖపట్నం జిల్లా
- 2011 నాటి గణాంకాల ప్రకారం పూర్తి పట్టణ జిల్లా: విశాఖపట్నం జిల్లా
- 2011 నాటి గణాంకాల ప్రకారం పూర్తి గ్రామీణ జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లా
ప్రాతిపదికకు మినహాయింపులుసవరించు
లోకసభ నియోజకవర్గాన్నిప్రాతిపదికగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అరకు లోకసభ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా మార్చారు. ప్రజల అభ్యర్ధనల మేరకు, మిగతా చోట్ల 12 అసెంబ్లీ నియోజకవర్గాలను లోకసభనియోజకవర్గం ప్రధానంగా గల జిల్లాలో కాక, ఇతర జిల్లాలలో వుంచారు.[1][2]
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "AP New Districts: కొత్త కళ.. గడప వద్దకే పాలన". 2022-04-05. Retrieved 2022-04-22.
- ↑ "Andhra news:అందుబాటులో జిల్లా కేంద్రం". ఈనాడు. 2022-04-04. Retrieved 2022-04-04.