పాపాఘ్ని పెన్నా నదికి ఉపనది. పాపాఘ్ని నది కర్ణాటక రాష్ట్రం, చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని సిడ్లఘట్ట గ్రామం వద్ద పుట్టి, చిత్తూరు జిల్లా ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. పాలకొండ శ్రేణుల గుండా ప్రవహించి, వైఎస్ఆర్ జిల్లా మైదానపు ప్రాంతంలోకి పారుతుంది. పాపాఘ్ని వైఎస్ఆర్ జిల్లాలోని కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. పాపాఘ్ని ఉపనదుల్లో మొగమేరు చెప్పుకోదగినవి. మొత్తం 205 కిలోమీటర్ల పొడవున్న పాపాఘ్ని నది యొక్క మొత్తం పారుదల ప్రాంతం 7,423 చ.కి.మీలు. ఇది మొత్తం పెన్నా నది పారుదల ప్రాంతంలో 14.14%. పాపాఘ్ని నది యొక్క పారుదల ప్రాంతం చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నా, ప్రధాన భాగం చిత్తూరు జిల్లాలోని పశ్చిమభాగంలోని కొండప్రాంతంలో ఉంది. వైఎస్ఆర్ జిల్లాలో ప్రవహించే పాపాఘ్ని పై గాలివీడు మండలం, వెలిగల్లు గ్రామం వద్ద మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

పాపాఘ్ని మఠంసవరించు

పాపాఘ్ని నదీ తీర ప్రాంతంలో చిక్‌బళ్లాపూర్ వద్ద అత్యంత పురాతనమైన పాపాఘ్ని మఠం ఉంది.

 
Shri Kashi Vishweshwara swamy, Papagni mutt, chiballapur, Karnataka
 
Shri Shree Matha parvathi devi, Papagni mutt, chiballapur, Karnataka

గండి క్షేత్రంసవరించు

వైఎస్ఆర్ జిల్లాలో ఈ నదీతీరంలోనే రాయచోటి-వేంపల్లి మార్గమధ్యంలో పవిత్ర గండి క్షేత్రం వెలసింది. పాపఘ్నీ నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి "గండి" అని పేరు వచ్చింది.

"https://te.wikipedia.org/w/index.php?title=పాపాఘ్ని&oldid=2750821" నుండి వెలికితీశారు