పాలపర్తి డేవిడ్ రాజు

పాలపర్తి డేవిడ్ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఆంద్రప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

పాలపర్తి డేవిడ్ రాజు

పదవీ కాలం
2014. – 2019
ముందు ఆదిమూలపు సురేష్
తరువాత ఆదిమూలపు సురేష్
నియోజకవర్గం ఎర్రగొండపాలెం
పదవీ కాలం
1999 – 2004
ముందు తవనం చెంచయ్య
తరువాత దారా సాంబయ్య
నియోజకవర్గం సంతనూతలపాడు

వ్యక్తిగత వివరాలు

జననం (1958-05-07)1958 మే 7
మట్టిగుంట గ్రామం, నాగులుప్పలపాడు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 2024 ఆగస్టు 25(2024-08-25) (వయసు 66)
హైదరాబాద్ , తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు జార్జ్
నివాసం దేవుడిచెరువు
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

పాలపర్తి డేవిడ్ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, మట్టిగుంట గ్రామంలో 1958 మే 7న జన్మించాడు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎల్ఎల్‌బి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

పాలపర్తి డేవిడ్ రాజు 1987లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీటీసీగా, ఆ తరువాత జడ్పీటీసీగా ఎన్నికై 1995లో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 1999లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గుర్రాల వెంకట శేషుపై గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దారా సాంబయ్య చేతిలో, 2009లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ చేతిలో ఓడిపోయి అనంతరం 2010లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

పాలపర్తి డేవిడ్ రాజు 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా ఎర్రగొండపాలెం నుండి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీలో చేరాడు. అనంతరం టీడీపీలో తనకు గౌరవం దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరిగి వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోయినా ఆ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేశాడు.

పాలపర్తి డేవిడ్ రాజు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‍లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2024 ఆగస్టు 26న మరణించాడు.[1][2][3]

మూలాలు

మార్చు
  1. 10TV Telugu (26 August 2024). "మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కన్నుమూత.. రాజకీయ ప్రస్థానం మొదలైందిలా..! | Former mla palaparthi david raju passes away" (in telugu). Retrieved 27 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Andhrajyothy (25 August 2024). "మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత." Retrieved 17 October 2024.
  3. "Former Yerragondapalem MLA David Raju Passes Away" (in ఇంగ్లీష్). 27 August 2024. Retrieved 17 October 2024.