ఆదిమూలపు సురేష్

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు

ఆదిమూలపు సురేష్ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు. పూర్వం దక్షిణ మధ్య రైల్వేలో ఐ.ఆర్.ఏ.ఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆంధ్ర ప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా నియమితులయ్యారు

ఆదిమూలపు సురేష్
ఆదిమూలపు సురేష్


పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
పదవీ కాలం
11 ఏప్రిల్ 2022 – ప్రస్తుతం

విద్యాశాఖ మంత్రి
పదవీ కాలం
8 జూన్ 2019 – 10 ఏప్రిల్ 2022
తరువాత బొత్స సత్యనారాయణ

పదవీ కాలం
2014 – 2019
ముందు బి.ఎన్. విజయ కుమార్
తరువాత టీజేఆర్ సుధాకర్ బాబు
నియోజకవర్గం సంతనూతలపాడు

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
2019-2024
నియోజకవర్గం ఎర్రగొండపాలెం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి టి.హెచ్. విజయ లక్ష్మి
సంతానం శ్రిష్టి,[1] విశాల్‌
వృత్తి రాజకీయం

కుటుంబం

మార్చు

వీరు ప్రకాశం జిల్లా లోని మార్కాపురం అనే పట్టణంలో జన్మించాడు. వీరి తండ్రి ఆదిమూలపు శామ్యూల్ జార్జ్, తల్లి ఆదిమూలపు తేరిసమ్మ. వీరు ప్రస్తుతం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు.[2]

రాజకీయ ప్రస్థానం

మార్చు

వీరు మొట్టమొదటి సారిగా 2009 వ సంవత్సరం ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నిక అయినారు. అప్పుడు వీరు భారత జాతీయ కాంగ్రెస్ నుండి గెలుపొందాడు. వై.యస్. రాజశేఖరరెడ్డి గారి మరణాంతరం, 2014 వ సంవత్సరం గాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరుపున సంతనూతలపాడు నియోజకవర్గం నుండి, 2019 లో ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడుగా ఎన్నిక అయ్యాడు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్నాడు[3][4][5] ఆయన 2022 ఏప్రిల్ 11న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మున్సిపల్‌ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[6]

మూలాలు

మార్చు
  1. Sakshi (27 December 2021). "ఆదిమూలపు సురేష్‌ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌". Archived from the original on 27 December 2021. Retrieved 27 December 2021.
  2. Sakshi (18 March 2019). "ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలు". Archived from the original on 16 September 2021. Retrieved 17 September 2021.
  3. Mana Telangana (8 June 2019). "కొలువుదీరిన ఎపి కొత్త మంత్రులు..." Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  4. The Hans India, Sambasiva Rao (8 June 2019). "AP new Cabinet Ministers portfolios". www.thehansindia.com. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  5. TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.