పాల్గాట్ ఆర్.రఘు

పాల్గాట్ ఆర్.రఘు (1928 –2009) ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు, మార్దంగికుడు.

పాల్గాట్ ఆర్.రఘు
జననం
పాల్గాట్ రామస్వామి రఘు

(1928-01-09)1928 జనవరి 9
రంగూన్, బర్మా (ప్రస్తుతం యాంగోన్, మయన్మార్)
మరణం2009 జూన్ 2(2009-06-02) (వయసు 81)
వృత్తికర్ణాటక సంగీత విద్వాంసుడు, మృదంగ వాద్య కళాకారుడు
జీవిత భాగస్వామిస్వర్ణాంబాళ్
తల్లిదండ్రులుపాల్గాట్ రామస్వామి అయ్యర్, అనంతలక్ష్మి అమ్మాళ్

ఆరంభ జీవితం మార్చు

ఇతడు పాల్గాట్ రామస్వామి, అనంతలక్ష్మి దంపతులకు 1928, జనవరి 9వ తేదీన బర్మా దేశం, రంగూను పట్టణంలో జన్మించాడు.[1] ఇతడు బాల్యం నుండే మృదంగ పాఠాలను తిన్నియం వెంకట్రామ అయ్యర్, తిరుచ్చి రాఘవ అయ్యర్‌ల వద్ద అభ్యసించాడు. తరువాత ఇతడు పాల్గాట్ మణి అయ్యర్ వద్ద మృదంగ వాద్యంలో మెళకువలు నేర్చుకున్నాడు. తరువాతి కాలంలో ఇతడు తన గురువు పాల్గాట్ మణి అయ్యర్ మరదలు స్వర్ణాంబాళ్‌ను వివాహం చేసుకున్నాడు. ఇతడు గణితశాస్త్రంలో పట్టభద్రుడు.

విశేషాలు మార్చు

రఘు ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా, మలేసియా, సింగపూర్ దేశాలలో విస్తృతంగా పర్యటించి అనేక కచేరీలలో పాల్గొన్నాడు. ఇతడు సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్, వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా, సంతూర్ విద్వాంసుడు శివకుమార్ శర్మ, తబలా కళాకారుడు అల్లా రఖా వంటి హిందుస్తానీ సంగీత కళాకారులకు, రుద్రపట్నం బ్రదర్స్ వంటి కర్ణాటక సంగీత కళాకారులకు మృదంగ సహకారం అందించాడు. ఇతడు కనెక్టికట్‌లోని వెస్లియన్ యూనివర్సిటీ, శాన్‌డీగో స్టేట్ యూనివర్సిటీ, బర్క్‌లీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్ళాడు. ఇతడు అనేక మంది శిష్యులను మృదంగ విద్వాంసులుగా తయారు చేశాడు.

కర్ణాటక గాత్ర కళాకారుడు అభిషేక్ రఘురాం, మృదంగ కళాకారుడు అనంత ఆర్.కృష్ణన్‌లు ఇతని మనుమలు.

అవార్డులు మార్చు

మరణం మార్చు

ఇతడు తన 81వ యేట 2009, జూన్ 2వ తేదీన మరణించాడు.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 శంకరనారాయణ, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్ట్. p. 131. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2022. Retrieved 12 March 2021.
  2. Sangita Kalanidhi recipients list from The Music Academy (official site)

బయటి లింకులు మార్చు