పిండం (2023 సినిమా)
పిండం 2023లో విడుదలైన తెలుగు సినిమా. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి హారర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 30న టీజర్‌ను విడుదల చేసి[1], సినిమా డిసెంబర్ 15న విడుదలై[2], 2024 ఫిబ్రవరి 2న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
పిండం | |
---|---|
దర్శకత్వం | సాయికిరణ్ దైదా |
స్క్రీన్ ప్లే | సాయికిరణ్ దైదా |
కథ | సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ & టోబి ఒస్బోర్న్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సతీష్ మనోహరన్ |
కూర్పు | శిరీష్ ప్రసాద్ |
సంగీతం | కృష్ణ సౌరభ్ సూరంపల్లి |
నిర్మాణ సంస్థ | కళాహి మీడియా |
విడుదల తేదీs | 26 డిసెంబరు 2023(థియేటర్) 2 ఫిబ్రవరి 2024 ( ఆహా ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఆంథోని(శ్రీరామ్) రైస్ మిల్లులో అకౌంటెంట్ గా పని చేస్తూ భార్య మేరి (ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు (సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలో ఓ పురాతమైన ఇల్లు కొనుకొని ఉంటాడు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి ఊహించని సంఘటనలు ఎదురైతాయి. ఆంథోని చిన్న కూతురిలోకి ఓ ఆత్మ ఆవహిస్తుంది. కడుపుతో ఉన్న అతని భార్య హాస్పటల్‌లో చేరుతుంది. వారికి సాయం చేయడానికి అన్నమ్మ (ఈశ్వరీరావు) వస్తుంది. అయితే ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని తెలుసుకుంటారు. అసలు ఆత్మలు అక్కడ ఎందుకు ఉన్నాయి వారంతా ఎలా చనిపోయారు ? ఆంథోనీ ఫ్యామిలీని అన్నమ్మ (ఈశ్వరీరావ్) కాపాడిందా ? ఆ ఆత్మలు ఆంథోనీ ఫ్యామిలీని ఎందుకు ఆవహించాయి? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
మార్చు- శ్రీరామ్
- ఖుషి రవి[5]
- ఈశ్వరీరావు
- అవసరాల శ్రీనివాస్[6]
- రవివర్మ
- మాణిక్ రెడ్డి
- బేబీ చైత్ర
- బేబీ ఐషా
- విజయలక్ష్మి
- శ్రీలత
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్:కళాహి మీడియా
- నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి
- కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ & టోబి ఒస్బోర్న్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయికిరణ్ దైదా
- సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి
- సినిమాటోగ్రఫీ: సతీష్ మనోహరన్
- ఎడిటర్: శిరీష్ ప్రసాద్
- ఫైట్స్: జాషువా
- సహ నిర్మాత: ప్రభు రాజా
మూలాలు
మార్చు- ↑ Hindustantimes Telugu (30 October 2023). "భయపెడుతున్న పిండం టీజర్.. ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని విధంగా." Archived from the original on 18 November 2023. Retrieved 18 November 2023.
- ↑ "'పిండం' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?". 18 November 2023. Archived from the original on 18 November 2023. Retrieved 18 November 2023.
- ↑ Eenadu (26 January 2024). "ఓటీటీలో 'పిండం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
- ↑ A. B. P. Desam (16 December 2023). "'పిండం' రివ్యూ: శ్రీరామ్ & టీమ్ మరీ అంత భయపెట్టారా? సినిమా ఎలా ఉంది?". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
- ↑ Andhrajyothy (14 December 2023). "ఐకాన్ స్టార్, న్యాచురల్ స్టార్ అంటే ఇష్టం." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
- ↑ Andhrajyothy (14 December 2023). "కొంచెం భయపెడితే... చూస్తారు". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.