కవి సిద్ధార్థ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, రాజకీయ నాయకుడు. ఆయన రచయితగా పలు తెలుగు చలనచిత్రాలకు పనిచేశాడు. చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ లో రాష్ట్ర కమిటీ సభ్యునిగా, సాంస్కృతిక కమిటీ చైర్మన్ గా పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ కి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు.

కవి సిద్ధార్థ
కవి సిద్దార్థ
జననం1961 సెప్టెంబర్ 19
ఇతర పేర్లుబొమ్మగౌని సిద్దార్థ
వృత్తికవి, రచయిత
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, రచయిత
తల్లిదండ్రులు
  • బొమ్మగౌని శ్రీనివాస్‌ గౌడ్ (తండ్రి)
  • సుశీల (తల్లి)

జననం, విద్యాభాస్యం మార్చు

కవి సిద్ధార్థ 1961లో యాదాద్రి భువనగిరి జిల్లా (నల్గొండ జిల్లా) బీబీనగర్ మండలంలోని చినరావలపల్లిలో బొమ్మగౌని శ్రీనివాస్‌, సుశీల దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాదు మదర్సా ఆలియా ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు, ఇంటర్మీడియట్‌ అబిడ్స్‌లోని ఆలియా కాలేజీ లో పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డబుల్‌ పీజీ పూర్తిచేశాడు. హిందూస్థానీ సంగీతంలో డిప్లొమో చేసి, సితార నేర్చుకున్నాడు.

పురస్కారాలు మార్చు

మే 2న తెలంగాణ సాహిత్య అకాడమి ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా పురస్కారాలను ప్రకటించారు. ఈ పురస్కారాలలో 2019 సంవత్సరానికి కవిత్వ విభాగంలో సిద్ధార్థ రచించిన ‘బొమ్మల బాయి’ కి ఆయన పురస్కారాన్ని అందుకున్నాడు.[1][2]

సినిమాలు మార్చు

మాటలు మార్చు

కథ మార్చు

గుణ సుందరి కథ(2023)

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. ఆంధ్రజ్యోతి, తెలంగాణా తాజావార్తలు (30 April 2019). "'బొమ్మలబాయి, మట్టిమనిషి'కి రాష్ట్ర సాహిత్య అకాడమీ". www.andhrajyothy.com. Archived from the original on 12 September 2019. Retrieved 12 September 2019.
  2. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (3 May 2019). "సాహిత్యంపై గౌరవం పెంచేందుకే పురస్కారాలు". ntnews.com. Archived from the original on 12 September 2019. Retrieved 12 September 2019.