పిడమర్తి రవి
పిడమర్తి రవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) తొలి చైర్మన్‌గా పని చేశాడు.
పిడమర్తి రవి | |||
| |||
మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 2020 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | బీఆర్ఎస్ | ||
జీవిత భాగస్వామి | కవిత | ||
నివాసం | హైదరాబాద్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జననం, విద్యాభాస్యం
మార్చుపిడమర్తి రవి మహబూబాబాద్ జిల్లా గార్ల లో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు.[1]
రాజకీయ జీవితం
మార్చుపిడమర్తి రవి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో క్రీయాశీలకంగా పాల్గొన్నాడు. ఆయన టీఎస్‌జేఏసీ రాష్ట్ర ఛైర్మన్‌గా పని చేశాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. సత్తుపల్లి లో ఓటమి అనంతరం ఆయనను 4 డిసెంబర్ 2014న తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) తొలి చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]ఆయన 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసిన సండ్ర వెంకటవీరయ్య చేతిలో 19002 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[3]
పిడమర్తి రవి 2023 జులై 1న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి[4] ఖమ్మంలో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో జులై 2న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5]
మూలాలు
మార్చు- ↑ BBC News తెలుగు (3 December 2018). "ఆర్ట్స్ కాలేజ్ టూ అసెంబ్లీ - కీలక నేతలపై పోటీ చేస్తున్న ఓయూ విద్యార్థులు ఎవరు?". BBC News తెలుగు. Archived from the original on 27 July 2021. Retrieved 27 July 2021.
- ↑ Sakshi (4 December 2014). "తొలి చాన్స్". Archived from the original on 27 July 2021. Retrieved 27 July 2021.
- ↑ News18 (2018). "Sathupalli Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 27 July 2021. Retrieved 27 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Zee News Telugu (1 July 2023). "బీఆర్‌ఎస్‌కు ఝలక్.. కాంగ్రెస్ గూటికి మరో సీనియర్ నేత". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.
- ↑ A. B. P. Desam (2 July 2023). "కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.