పి.రమేష్ నారాయణ అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సాహితీకారుడు.ఆయన ఇండియన్ బయోఫిజికల్ సొసైటీలో శాశ్వత సభ్యులు.[1]

జీవితం, విద్యాభ్యాసం

మార్చు

ఇతడు 1947వ సంవత్సరంలో అనంతపురం పట్టణంలో జన్మించాడు. పి.ఎల్ నారాయణరావు ఇతని తండ్రి. ఇరవయ్యవ శతాబ్దం తొలిదశకాల్లో రాయలసీమలో ప్రముఖ ప్రచురణకర్త, అనంతపురం జిల్లాలో తొలి ప్రచురణకర్త అయిన 'ఆత్మారాం అండ్ కో' వ్యవస్థాపకుడు వి.ఆత్మారామప్ప ఇతని తాతగారు. ఇతని బాల్యంలో విద్యాభ్యాసం అనంతపురం పట్టణంలోనే గడిచింది. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1963-1966లో బి.ఎస్.సి, తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1966-1968లో ఎం.ఎస్.సి చదివాడు. 1985లో అన్నామలై విశ్వవిద్యాలయం నుండి బి.యిడి., 1987లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రంలో పి.హెచ్.డి, 2004లో అన్నామలై విశ్వవిద్యాలయం నుండి ఎం.యిడి. డిగ్రీలు పొందాడు.

ఉద్యోగపర్వం

మార్చు

ఇతడు ఉపాధ్యాయ వృత్తిపైన కల మమకారంతో 1968లో అనంతపురం సాయిబాబా నేషనల్ జూనియర్ కాలేజీలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అదే విద్యాసంస్థలో 37 సంవత్సరలు పనిచేసి 2005లో పదవీ విరమణ గావించాడు. 1989 నుండి 2005 వరకు పదిహేడు సంవత్సరాలకు పైగా ప్రధానాచార్యుడిగా జూనియర్ కళాశాల, ఉన్నతపాఠశాల బాధ్యతలు సంయుక్తంగా, సమర్థవంతంగా నిర్వహించాడు.[2] పదవీ విరమణ అనంతరం అనంతపురంలోని లిటిల్‌ఫ్లవర్ మహిళా బి.యిడి. కళాశాలలో నాలుగు సంవత్సరాలు, సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ బి.యిడి విభాగంలో 4 సంవత్సరాలు అధ్యాపకుడిగా సేవలను అందించాడు. ఇతడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా, పరిపాలనా దక్షుడిగా పలువురి ప్రశంసలను పొందాడు.

సామాజిక సేవ

మార్చు

ఇతడు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనా ప్రవృత్తి రీత్యా సాహితీప్రియుడు, సామాజిక కార్యకర్త,

సాహిత్య సేవ

మార్చు

రచనలు

మార్చు

తెలుగు

మార్చు

సాహిత్యరచనలు

మార్చు
  1. గిరిజన సంస్కృతి - సాహిత్యము
  2. చేనేత వెతలు
  3. ఎర్రని ఆకాశం (ప్రాక్పశ్చిమ సాహిత్య ప్రపంచంలో వేశ్యాప్రసక్తి)
  4. నా ఆలోచనాలోచనంలో ఆశావాది
  5. రాధేయ జీవితం - కవిత్యము
  6. ప్రగతి శిఖరం
  7. జూపల్లి జీవనరేఖలు
  8. అనంత సాహిత్యము - ఆధునిక కవిత్వము
  9. నాగసూరి హరివిల్లు
  10. నాగసూరి పుస్తకకరచాలనం
  11. మహాకవి డాక్టరు ఉమర్ అలీషా సాహిత్యం

ఆధ్యాత్మిక గ్రంథాలు

మార్చు
  1. శ్రీ అక్కదేవర్లపాట
  2. శ్రీ అక్కమ్మగార్ల చరిత్ర
  3. శ్రీ సాయిపాదుకాస్తవము
  4. సర్పారాధన వైశిష్ట్యము
  5. శ్రీ రాజులు గుడులు కథ
  6. ఆర్షధర్మవైభవం
  7. పెనుగొండ బాబయ్యస్వామి
  8. అమీన్‌పీర్ దర్గా ఆధ్యాత్మిక తేజము

ఆంగ్లము

మార్చు
  1. Some Aspects of Thermal Adaptation of Freshwater Field Crab (Thesis)
  2. Reflections on Human Nature[3]
  3. On Cultivation and Weavers Woes (Two long poems)
  4. Two Avadhootas (Two profiles)
  5. Quinoa - The Cindrella Crop
  6. Sri Vali Swamy

ఆంగ్లానువాదాలు

మార్చు
  1. The Harvest (మూలం: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి - పొలి)
  2. Weavers and Looms (రాధేయ-మగ్గం బతుకు)
  3. He is to be Conquered (అడపా రామకృష్ణ - వాడిని జయించాలి)
  4. The Indian Muslim (షేక్ కరీముల్లా - సాయిబు)
  5. The Global Feat (కెంగార మోహన్ - ప్రపంచీకరణ)
  6. Sun in the Dark (కెరె జగదీశ్ - రాత్రి సూర్యుడు)
  7. The Ploughed Look
  8. "Avva" - The Mother
  9. The Wax Dolls
  10. The Walking Cloud
  11. Moments Myself Caught
  12. The Drum Beat
  13. The Green Living Sea in My Land
  14. Chenetha Kavitha
  15. The Self - Enlightened
  16. The Churning
  17. The Cane Sugar

మూలాలు

మార్చు
  1. "Life Members". Archived from the original on 2016-03-15. Retrieved 2015-08-26.
  2. INDIAN BIOPHYSICAL SOCIETY
  3. అమెజాన్‌లో ఇ-బుక్

ఇతర లింకులు

మార్చు