పీర్జాదిగూడ
తెలంగాణ, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలం లోని జనగణన పట్టణం
(పీర్జాదగూడ నుండి దారిమార్పు చెందింది)
పీర్జాదిగూడ,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]ఇది పీర్జాదిగూడ నగరపాలక సంస్థ ముఖ్య పట్టణం.
పీర్జాదగూడ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°23′51″N 78°34′42″E / 17.3974°N 78.5783°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్‌గిరి |
మండలం | ఘటకేసర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 32,586 |
- పురుషుల సంఖ్య | 16,521 |
- స్త్రీల సంఖ్య | 16,065 |
- గృహాల సంఖ్య | 7,953 |
పిన్‌కోడ్ | 500098 |
ఎస్.టి.డి కోడ్ | 08720 |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 32,586 - పురుషుల సంఖ్య 16,521 - స్త్రీల సంఖ్య 16,065 - గృహాల సంఖ్య 7,953
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం. 12737, పురుషులు. 6544, స్త్రీలు 6193, గృహాలు. 2867 విస్తీర్ణము 89 హెక్టార్లు. భాష. తెలుగు.
దర్శనీయ స్థలాలు
మార్చుశ్రీ సాయిబాబా ఆలయం: ఉప్పల్ కి సమీపాన ఉన్న ఈ గ్రామంలో, దత్తాత్రేయ అవతార పురుషుడు శ్రీ సాయినాధుడు కొలువుదీరిన మందిరం ఉంది. సుందర పరిసరాలను ఆవిష్కరించే ఈ దివ్యాలయం, సాయిలీలా విశేషాలతో పునీతమైంది. వివిధ ఉపాలయాలతో చూపరులను ఆకట్టుకుంటున్న ఈ ఆలయశోభ వర్ణనాతీతం.
సదుపాయాలు
మార్చు- వైకుంఠధామం: మత సామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదాలు లేకుండా అన్ని మతాలవారికోసం పీర్జాదిగూడలో సమీకృత వైకుంఠధామం నిర్మించబడింది. రూ. 3 కోట్ల నిధులతో 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సమీకృత వైకుంఠధామంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంప్రదాయాలకు అనుకూలంగా సౌకర్యాలను కల్పించబడ్డాయి. ప్రత్యేక స్నానపు గదులు, వందల మంది కూర్చునేలా మోడ్రన్ గ్యాలరీలు, కర్మలు చేసుకునేందుకు ప్రత్యేక గదులు, ప్రత్యేక కుర్చీలు-అద్దాలతో క్షౌరశాల గది మొదలైనవి ఏర్పాటు చేయబడ్డాయి. రాష్ట్రంలోనే తొలి సమీకృత వైకుంఠధామంగా నిలిచిన ఈ వైకుంఠధామం 2022, ఫిబ్రవరి 2న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించాడు.[2]
- ఉచిత కోచింగ్ సెంటర్: పీర్జాదిగూడలో రెండువేల మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన కోచింగ్ సెంటర్‌ను 2022, మార్చి 14న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించాడు. కోచింగ్ సెంటర్‌లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ అంశాలలో 20 సంవత్సరాల అనుభవం ఉన్న అధ్యాపకులతో శిక్షణతోపాటు భోజనం, స్నాక్స్ సౌకర్యం, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందిస్తున్నారు. ఇందులో డిజిటల్ లైబ్రరీ, ప్రొజెక్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖామంత్రి సి.హెచ్. మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బోడుప్పల్ నగరపాలక సంస్థ మేయర్ బుచ్చిరెడ్డి, మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.[3]
- మోడ్రన్ టాయిలెట్లు: బహిరంగ మలమూత్ర విసర్జనకు స్వస్తి పలికేందుకు ప్రధాన అంతర్గత రోడ్లలో ప్రయాణికులకు, వాహనదారులకు, ఇతర ప్రాంతాల వారికి అందుబాటులో ఉండేలా పలు ప్రాంతాల్లో సుమారు 50 లక్షల రూపాయలతో 13 మోడ్రన్ టాయిలెట్లు ఏర్పాటుచేశారు.[4]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ telugu, NT News (2022-02-27). "సమీకృత వైకుంఠధామం". Namasthe Telangana. Archived from the original on 2022-02-28. Retrieved 2022-02-28.
- ↑ telugu, NT News (2022-03-14). "ఉచితంగా శిక్షణనిస్తున్నాం..పోటీ పరీక్షల్లో నెగ్గండి". Namasthe Telangana. Archived from the original on 2022-03-15. Retrieved 2022-03-15.
- ↑ telugu, NT News (2022-12-19). "మోడ్రన్ టాయిలెట్లు". www.ntnews.com. Archived from the original on 2022-12-20. Retrieved 2022-12-20.