పురాణం సతీశ్ కుమార్
పురాణం సతీశ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, తెలంగాణ శాసనమండలి సభ్యుడు. ఆయన 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1]ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[2]
పురాణం సతీశ్ కుమార్ | |||
ఎమ్మెల్సీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 5 జనవరి 2016 నుండి 4 జనవరి 2022 | |||
నియోజకవర్గం | ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 9 నవంబర్ 1964 కోటపల్లి గ్రామం, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | పురాణం శ్యామసుందర్ రావు, శోభ | ||
జీవిత భాగస్వామి | సునంద | ||
సంతానం | సాయిరామ్ కౌశిక్, సాయిరామ్ కుశాల్ | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మతం | హిందూ |
జననం, విద్యాభాస్యం
మార్చుపురాణం సతీశ్ తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా , కోటపల్లి గ్రామంలో 1964, నవంబరు 9న పురాణం శ్యామసుందర్ రావు, శోభ దంపతులకు జన్మించాడు. ఆయన ఆదిలాబాద్ లోని సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 1984లో పాలిటెక్నిక్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుపురాణం సతీష్ 1987లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఆయన 1995లో ఎంపీటీసీగా, 1997లో టీడీపీ జిల్లా కార్యదర్శిగా, 1998లో చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, టీడీపీలో ఆదిలాబాద్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. పురాణం సతీష్ తెలంగాణ ఉద్యమ సమయంలో 2008, ఫిబ్రవరి 7న తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, 2010 నుంచి ఆదిలాబాద్ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[3][4][5]
పురాణం సతీష్ 2024 మార్చి 30న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[6]
మూలాలు
మార్చు- ↑ 10TV (19 August 2020). "ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఎవరిదో.. మళ్లీ ఆయనదేనా?". 10TV (in telugu). Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ Sakshi (24 October 2016). "రాజధానిలో బ్రాహ్మణ సదనం". Sakshi. Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.
- ↑ Mana Telangana (3 February 2019). "ఆదివాసి జిల్లాలో మోడల్ డిగ్రీ కళాశాల శుభ సూచకం". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.
- ↑ Namasthe Telangana (24 July 2021). "గిఫ్ట్ ఏ స్మైల్: వృద్ధ దంపతులకు ఇళ్లు కట్టించిన ఎమ్మెల్సీ పురాణం". Archived from the original on 24 July 2021. Retrieved 24 July 2021.
- ↑ V6 Velugu (30 March 2024). "కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్". Archived from the original on 30 March 2024. Retrieved 30 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)