పులిపాక వెంకటప్పయ్య

పులిపాక వెంకటప్పయ్య ప్రముఖ రంగస్థల నటులు.

పులిపాక వెంకటప్పయ్య

జననం మార్చు

వెంకటప్పయ్య 1907లో చేబ్రోలు మండలం, వేటపాలెం గ్రామంలో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం మార్చు

వెంకటప్పయ్య మేనమామ రంగస్థల నటులు. తన మేనమామ ప్రోత్సాహంతో వెంకటప్పయ్య చిన్నతనంలోనే రంగస్థల ప్రవేశం చేశారు. ఉపాధ్యాయులుగా పనిచేస్తూనే, నాటకాలలో పాల్గొన్నారు. తన నటనకు ప్రేక్షకులనుండి ప్రశంసలు రావడంతో, ఉద్యోగం వదిలి నాటకరంగానికి వచ్చారు.

ముందుతరం నటులైన జొన్నవిత్తుల శేషగిరి, కపిలవాయి రామనాథశాస్త్రి, యడవల్లి సూర్యనారాయణ, దైతా గోపాలం, కన్నాంబ, రామతిలకం మొదలైన ప్రఖ్యాత నటులతో కలిసి నటించారు. 1948లో తెనాలి లోని అబ్బూరి వారి నాటక సమాజంలో చేరారు. అబ్బూరి వరప్రసాదరావు కృష్ణుడిగా, వెంకటప్పయ్య కర్ణుడిగా నటించిన నాటకాలు ప్రేక్షకాదరణ పొందాయి. గ్రామఫోన్ కంపెనీవారు వీరిద్దరి కర్ణ సందేశం ఘట్టాన్ని రికార్డు చేశారు. కొంతకాలం బేతా వెంకట్రావు తో కలిసి రామాంజనేయ యుద్ధం నాటకంలో శ్రీరాముడు పాత్ర పోషించాడు. ఒకానొక దశలో నాటక కాంట్రాక్టర్లకు వెంకటప్పయ్య డేట్స్ దొరికేవికావు. వీరి గానం చాలా మధురంగా ఉండేది. ఆ మధుర గానంతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసేవారనడంలో ఆశ్చర్యంలేదు.

నటించిన నాటకాలు - పాత్రలు మార్చు

  • కర్ణ సందేశం - కర్ణుడు
  • రామాంజనేయ యుద్ధం - శ్రీరాముడు

ఇవే కాకుండా చాలా నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు.

బిరుదులు మార్చు

  • గానకోకిల
  • గాన సరస్వతి
  • విలేజ్ కింగ్

మూలాలు మార్చు

  • పులిపాక వెంకటప్పయ్య, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 260.