పెదకొండూరు (దుగ్గిరాల)
పెదకొండూరు, గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన దుగ్గిరాల నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మంగళగిరి నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1361 ఇళ్లతో, 4505 జనాభాతో 1463 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2285, ఆడవారి సంఖ్య 2220. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1599 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 64. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590262[1].ఈ గ్రామం దుగ్గిరాల మండల కేంద్రానికి ఈశాన్యంగా ఉంది. ఈ గ్రామం కృష్ణానదీ తీర గ్రామం. ఇక్కడ కృషానది ఎక్కువ లోతులేకుండా ఎక్కువ లోతులేకుండా ప్రవహించుచున్నది. కనుక పుష్కరస్నానాలకు అనువుగా ఉండును.
పెదకొండూరు (దుగ్గిరాల) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°23′25.980″N 80°41′16.980″E / 16.39055000°N 80.68805000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | దుగ్గిరాల |
విస్తీర్ణం | 14.63 కి.మీ2 (5.65 చ. మై) |
జనాభా (2011) | 4,505 |
• జనసాంద్రత | 310/కి.మీ2 (800/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 2,285 |
• స్త్రీలు | 2,220 |
• లింగ నిష్పత్తి | 972 |
• నివాసాలు | 1,361 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 522305 |
2011 జనగణన కోడ్ | 590262 |
గ్రామ చరిత్ర
మార్చుఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
మార్చుతాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామం కృష్ణానదీతీరంలో ప్రాచీన ఆలయాలతో అలరారే గ్రామం. ఒకప్పుడు వేదపండితులు నడయాడిన భూమి. క్రీ.పూ.270 నుండి అనేకమంది రాజులు ఈ ఆలయాలను అభివృద్ధి చేసారు. నాల్గవ శతాబ్దంలో మొదలైన ఆలయ ప్రాభవం, యఙశ్రీ శాతకర్ణి, విష్ణుకుండినులు, అనందగోత్రీజ్జులు, రాజరాజనరేంద్రుడు, శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు మొదలగు రాజుల వరకు నడచింది.
సమీప గ్రామాలు
మార్చువల్లభాపురం 5 కి.మీ, చినపాలెం 6 కి.మీ, చిర్రావూరు 7 కి.మీ, రేవేంద్రపాడు 7 కి.మీ, మున్నంగి 8 కి.మీ.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి CHILUVURUలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల దుగ్గిరాలలోను, ఇంజనీరింగ్ కళాశాల చింతలపూడిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు తెనాలిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల దుగ్గిరాలలోను, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చుపెదకొండూరులో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుగ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
మార్చుగ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మార్చుగ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చుపెదకొండూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
మార్చుపెదకొండూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 554 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 908 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 908 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చుపెదకొండూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 560 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 348 హెక్టార్లు
ఊరచెరువు:- గ్రామంలో 3 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువులో గ్రామస్థులందరూ కలిసి, పూడిక తీయాలని సంకల్పించి, ఆ పూడిక మట్టిని ఒక ట్రాక్టరుకు రు. 400 కు విక్రయించగా, పొక్లెయిను ఖర్చులు పోగా 9 లక్షల ఆదాయం సమకూరినది. ఆ సొమ్ముతో గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన బకాయిలు తీర్చడమేగాక, వీధిదీపాలకు ఎల్.యి.డి. దీపాలను అమర్చి విద్యుత్తు బిల్లులు ఆదాచేసారు. గ్రామంలో 2015,జూన్-16వ తేదీ నుండి గ్రామ వీధులలో ఎల్.ఇ.డి.కాంతులీనుచున్నవి. ఈ సొమ్ముతో ఇంకా, చెరువులో పశువులు దిగేందుకు వీలుగా ఒక ర్యాంపు నిర్మించుచున్నారు. చెరువు ప్రక్కన ఒక బోరు వేయించి, వేసవిలో పశువులకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు.
ఉత్పత్తి
మార్చుపెదకొండూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మార్చుగ్రామ పంచాయతీ
మార్చుదర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వరస్వామివారి ఆలయం
మార్చుచోళులకాలంలో నిర్మించిన ఈ ఆలయానికి, 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రాచీనకాలంనాటి ఆలయం కావడంతో ఈ ఆలయానికి ప్రాశస్తం ఎక్కువ. కార్తీకమాసంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఉపవాసాలు ఉన్నవాళ్ళు, వ్రతాలు చేసేవాళ్ళు, ఇక్కడ ఉన్న ఉసిరిచెట్ల క్రింద దీక్షా కార్యక్రమాలు నిర్వహించుచుంటారు. ఈ గ్రామానికి చెందిన కీ.శే. మల్లెల వేణుగోపాలకృష్ణమూర్తి, కీ.శే. వరలక్ష్మి దంపతుల కుమారుడు, అమెరికాలో ఉంటున్న వెంకటరమణయోగి, తన తల్లిదండ్రుల ఙాపకార్ధం, ఈ పురాతన ఆలయాన్ని, 7 లక్షల రూపాయలకుపైగా వ్యయంతో పునర్నిర్మించి, అభివృద్ధిచేసారు. ముందుగా ముఖమండపం నిర్మించి, దానిపైన శాలాహారం నిర్మించారు. దీనిపై దక్షిణదిశలో, దక్షిణామూర్తి, అర్ధనారీశ్వరుడు, ధ్యానశివుడు విగ్రహాలను నెలకొల్పినారు. తూర్పున శివుడు, పార్వతి, వినాయకుని రూపాలు భక్తులను ఆశీర్వదించుచున్నట్లుగా ఏర్పాటుచేసారు. ఉత్తరంవైపు, నటరాజస్వామి, దుర్గాదేవి, పార్వతీదేవి, విగ్రవాలను ఏర్పాటుచేసారు. మరియొకవైపు నటరాజు విగ్రహం నాట్యం చేయున్నట్లుగా కనువిందు చేస్తోంది. పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని, 2017,ఆగస్టు-12వతేదీ శనివారంనాడు ప్రారంభించెదరు.
శ్రీ గంగా పార్వతీ సమేత ఆనందీశ్వరస్వామి ఆలయం
మార్చుశ్రీ కనకపుట్టలమ్మ తల్లి ఆలయం
మార్చుఈ ఆలయంలో కొలువైన అమ్మవారిని, ఎందరో భక్తుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు ఆరాధించెదరు. ఈ ఆలయంలో ఆరేళ్ళుగా దీక్షలు కొనసాగుచున్నవి. ఈ దీక్షలకు ఈ గ్రామస్తులే గాకుండా, గొడవర్రు, మంగళగిరి గ్రామాల నుండి గూడా భక్తులు వచ్చి దీక్షలు చేస్తారు. ఈ ఆలయంలో అమ్మవారి కొలువులు ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో (మే నెలలో) 50 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. 2014, జూన్-26, గురువారం నాడు, వారానికి ఒక అమ్మవారు చొప్పున, 50 రోజులపాటు, గ్రామదేవతల పేరిట నిర్వహించిన కొలువులు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని, వారికి విశిష్టపూజలు నిర్వహించారు. తప్పెట్లు, వాయిద్యాల నడుమ, ఇన్నాళ్ళు పూజలు చేసిన పంచమమాతలు, మద్ది రామమ్మ, మారెమ్మ, ముత్యాలమ్మ, మాహాలక్ష్మమ్మ, కొర్లపాటి అంకమ్మ, వినుకొండ వెంకాయమ్మ లను, జూన్-26, గురువారం నాడు, సాగనంపినారు. దీనికోసం ప్రత్యేకంగా కొర్ల (చెక్క) బండిని ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా అర్చకుల పవిత్ర వేదమంత్రాలతో పెదకొండూరు గ్రామం పునీతమైనది. 50 రోజులు నిర్వహించిన కొలువులతో గ్రామం ఆధ్యాత్మికాన్ని సంతరించుకున్నది. శ్రీ కనకపుట్టలమ్మ తల్లి కొలువులు, 2014,జూన్-28 నుండి ప్రారంభించారు. జూలై-6, ఆదివారం నాడు, ఆఖరుగా కనకపుట్టలమ్మకు నైవేద్యాలను సమర్పించటంతో కొలువులు సమాప్తమైనవి. ఆఖరిరోజున భక్తులకు భారీగా అన్నదానం చేసారు. ఎక్కడెక్కడో ఉన్న గ్రామస్తులంతా ఈ కార్యక్రమాలకు తరలి వచ్చారు. వారితో బంధువులు, సమీప గ్రామాల, మండలాల ప్రజలు ఈ వేడుకలలో భాగస్వాములైనారు.
శ్రీ శ్రీదేవీ, భూదేవీ సమేత జనార్ధన స్వామి ఆలయం
మార్చుఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2015,మార్చి-4వ తేదీ మంగళవారం నుండి 7వ తేదీశుక్రవారం వరకు నిర్వహించుచున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా 4వ తేదీ బుధవారంనాడు, స్వామివారి కళ్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ రామాలయం
మార్చుపెదకొండూరు గ్రామంలోని, ప్రాచీనకాలం నుండి ఉన్న ఈ ఆలయంలో, శ్రీరామనవమి పర్వదినం అనంతరం, మరుసటి రోజున రామాలయంలో, భక్తులకు భారీగా అన్నసంతర్పణ చేయటం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్నది. భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని, అనంతరం అన్నసంతర్పణలో పాల్గొంటారు.
శ్రీ రేణుకమ్మ ఆలయం
మార్చుఈ గ్రామం కట్టమీదకు రాగానే కనిపించే ముఖద్వారం (ఆర్చి) ఈ ఆలయాలకు విచ్చేసే భక్తులకు స్వాగతం పలుకుతుంది. అక్కడే శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ షిర్డీ సయిబాబా మొదలగు ఆలయాలు ఉన్నాయి. ఇన్ని ఆలయాలతో ఈ గ్రామం అధ్యాత్మిక శోభసంతరించుకున్నది. ఈ ఆలయాలకు నిత్యం, పూజలు జరుగుచున్నవి.
గ్రామంలోని ప్రధాన పంటలు
మార్చువరి, అపరలు, కాయగూరలు
గ్రామంలోని ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
మార్చు- పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
- ఉప్పలూరి లక్ష్మీనారాయణ: ఈ గ్రామానికి చెందిన వీరు 672 పద్యాలతో కూడిన పద్య షట్శతి గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథాన్ని, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ డి.విజయభాస్కర్, పెదకొండూరు గ్రామంలో, 2017,మార్చి-18న ఆవిష్కరించారు. వీరు ఇంతవరకు పలు శతకాలు రచించారు. తాజాగా గ్రామదేవత, మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషలపై ఈ గ్రంథాన్ని రచించారు. ఎంతో అర్ధవంతముగా ఉన్న ఈ పద్యాలలో వీరు పెదకొండూరు గ్రామదేవ కనకపుట్టలమ్మ అమ్మవారిని గురించి వివరించారు. ఈ ఆవిష్కరణ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని వీరిని అభినందించారు.
- పుచ్చా పూర్ణానందం - ప్రముఖ హాస్యరచయిత, రంగస్థల, సినీ నటుడు.
గ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామానికి చెందిన ఇండోనేషియాలో ఉంటున్న శ్రీ పట్టెల శివశంకర్, శ్రీ ఆళ్ళ కిరణ్ కుమార్ అను వీరిద్దరూ ప్రవాసాంధ్రులు. వీరు ఈ గ్రామాభివృద్ధికి చాలా చేయూత నిచ్చుచున్నారు. వీరిద్దరూ కలిసి మొత్తం కోటిన్నర రూపాయలు తమ గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టినారు.
గణాంకాలు
మార్చు2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,153. ఇందులో పురుషుల సంఖ్య 2,111, స్త్రీల సంఖ్య 2,042, గ్రామంలో నివాస గృహాలు 1,087 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,463హెక్టారులు.
మూలాలు
మార్చు- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.