మున్నంగి
మున్నంగి గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన కొల్లిపర నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తెనాలి నుండి 23 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1957 ఇళ్లతో, 6399 జనాభాతో 1350 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3166, ఆడవారి సంఖ్య 3233. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1962 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 265. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590274[1]. మున్నంగి కృష్ణా నది తీరాన ఉంది.
మున్నంగి | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°19′43″N 80°43′17″E / 16.32861°N 80.72139°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | కొల్లిపర |
విస్తీర్ణం | 13.5 కి.మీ2 (5.2 చ. మై) |
జనాభా (2011) | 6,399 |
• జనసాంద్రత | 470/కి.మీ2 (1,200/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 3,166 |
• స్త్రీలు | 3,233 |
• లింగ నిష్పత్తి | 1,021 |
• నివాసాలు | 1,957 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 522304 |
2011 జనగణన కోడ్ | 590274 |
గ్రామం పేరువెనుక చరిత్ర
మార్చుమునికోటిపురము అని ఈ గ్రామానికి పేరు రావడానికి కారణంగా ఈ కథను చెప్పుకుంటారు.
పూర్వం కోటి మంది మునులు కృష్ణా నది తీరాన ప్రాతఃకాలానికి ముందు తపస్సు చేస్తూ ఉండేవారు. జనసంచారం మొదలవక ముందే వారు అదృశ్యమయేవారు. ఒక రోజు కృష్ణా నదీ తీరాన గల పంట పొలాలలో (లంక) పనిచేస్తున్న ఒక రైతు చీకటి పడగా ఆ రేయి అక్కడే నిదురించెను. అర్దరాత్రి సమయములో మెలకువ వచ్చిన ఆ రైతుకు కోటి మంది మునులు కృష్ణా నదీ తీరాన తపస్సు చేస్తూ కనిపించారు. ఆశ్చర్యంతో వారి తపస్సును గమనిస్తున్న ఆ రైతును మునులలో ఒకరు "ఈ విషయాన్ని ఎవరికైనా తెలియపరచిన నీ తల వేయి ముక్కలవును"అని శపించెను. భయముతో ఆ రైతు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆ రైతు తన అవసాన దశలో ఈ సంగతిని తన బంధువులకు వెల్లడించగా, వెంటనే అతని తల వేయి వ్రక్కలయెను. ఆ తెల్లవారు ఝామున ప్రజలు కృష్ణా నదీ తీరానికి వెళ్ళి చూడగా మునులు అదృశ్యమై, ఆ రోజు నుండి వారు మరలా ఎవరికీ కనిపించలేదు. అలా ఈ ఊరికి "మునికోటిపురము" అనే నామం కాలక్రమేణా 'మున్నంగి'గా వ్యవహరించబడసాగెను.
సమీప గ్రామాలు
మార్చువల్లభాపురం 3 కి.మీ, కొల్లిపర 4 కి.మీ, దంతులూరు 4 కి.మీ, చివలూరు 5 కి.మీ, ఈమని 8 కి.మీ
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి కొల్లిపరలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కొల్లిపరలోను, ఇంజనీరింగ్ కళాశాల చింతలపూడిలోనూ ఉన్నాయి. సమీప మేనేజ్మెంట్ కళాశాల చింతలపూడిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్ కళాశాలలు లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కొల్లిపరలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు గుంటూరులోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చుమున్నంగిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుగ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
మార్చుగ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
మార్చుమురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చుమున్నంగిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
మార్చుమున్నంగిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 336 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1012 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 16 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 996 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చుమున్నంగిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 534 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 462 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చుమున్నంగిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మార్చుమౌలిక సదుపాయాలు
మార్చువైద్య సౌకర్యం
మార్చుప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం:- ఈ గ్రామం కొల్లిపర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉంది. ఈ కేంద్రానికి నూతన భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయాల విలువైన స్థలాన్ని, గ్రామానికి చెందిన శ్రీ ఆరిగ కోటిరెడ్డి విరాళంగా అందజేసినారు. ఈ స్థలంలో నిర్మించిన నూతన భవనాన్ని, 2015, డిసెంబరు-5న ప్రారంభించారు. దీనితో ఈ ఆసుపత్రిలో ఆధునిక సాంకేతిక సౌకర్యాలు అందుబాటులోనికి వచ్చినవి. 6 పడకలు, ఒక డాక్టర్, ఇద్దరు నర్సులతో ఈ ఆసుపత్రి నడచుచున్నది. [8]
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వేమూరి దీనమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుమున్నంగి గ్రామ కూడలిలో, 2014 ఏప్రిల్ 8న, మంగళవారం నాడు, శ్రీ రామభక్త హనుమంతుని విగ్రహాన్ని, మొదట గ్రామ వీధులలో ఊరేగించి, తరువాత ప్రతిష్ఠించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.[4]
శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం
మార్చు- మున్నంగి దేవాలయాలలో శివాలయము ప్రత్యేకమైనది. ఇది ఐదు గుళ్ళ సముదాయము. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దైవస్వరూపము (శ్రీగంగా పార్వతీ సమేత శ్రీసకల కోటేశ్వరస్వామి, శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశైలమల్లిఖార్జున స్వామి, శ్రీ బాలత్రిపుర సుందరీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ షట్‌కోణ బాలత్రిపురసుందరీ దేవి, అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి కలరు. ఈ ఐదు గుళ్ళకు ఒకే ద్వారముండుట ఈ గుడి ప్రత్యేకత. అందుకే ఈగుడిని "ఐదు దేవుళ్ళ గుడి"గా పిలుస్తారు.
- ఈ ఆలయం శిధిలమవటంతో, గ్రామస్థులు నూతన ఆలయం నిర్మించినారు. స్వామివారి విగ్రహాలను హంపీ నుండి తెచ్చారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015 జూన్ 3వ తేదీ బుధవారంనాడు ప్రారంభించినారు. 6వ తేదీ శనివారంనాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారికి అష్టోత్తర కలశ అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. 7వ తేదీ ఆదివారంనాడు, తొలిగా, యంత్రబింబ స్థాపన, జీవన్యాసం, కళాన్యాసం, మహాకుంభాభిషేకాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం, శ్రీ బాలాత్రిపురసుందరీదేవి, శివలింగం, ధ్వజస్థంభ ప్రతిష్ఠా కార్యక్రమం, భక్తుల జయజయధ్వానాలమధ్య, వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి శాంతికల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. [6]&[7]
గ్రామ ప్రముఖులు
మార్చు- విశ్వనాథ సత్యనారాయణ - మున్నంగి గ్రామ ప్రజలు ఆహ్వానించి సన్మానం జరిపారు. విశ్వనాథ వారు మున్నంగిలోని వేణుగోపాలస్వామి మీద "మున్నంగి వేణుగోపాలా!" అను మకుటముతో నొక శతకమును వ్రాసెను. అది మధ్యాక్కరలలో గలదు.
- ఈ గ్రామానికి చెందిన అరిగ కోటిరెడ్డి (70) దాతృత్వంలో నిండైన మనిషి, కర్షకుడు, అన్నదాతలకు ఉత్తమ సలహాదారు. వీరు విద్యుత్తు సబ్-స్టేషను ఏర్పాటుకు కావల్సిన 60 సెంట్ల భూమిని, తను కొనుగోలుచేసి, ప్రభుత్వానికి ఇచ్చారు. పాఠశాలలో గది నిర్మాణానికి, 4 బస్ షెల్టర్లకూ, విరాళం ఇచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి అవసరమైన 40 సెంట్ల స్థలాన్ని తన స్వంతనిదులతో కొనుగోలుచేసి ఇచ్చారు.
- అభివృద్ధిలో నేను సైతం అంటూ గ్రామానికి చెందిన బొంతు పిచ్చిరెడ్డి, విదేశాలలో ఉంటున్న కుమారుడు, కుమార్తెల ఆర్థిక సాయంతో గ్రామంలో గ్రంథాలయ నిర్మాణానికి 2.5 లక్షల రూపాయలు అందించాడు. 5 లక్షల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి దోహదపడ్డాడు.
గ్రామ విశేషాలు
మార్చు- మున్నంగి గ్రామం సర్వమతసమానమైనది. ఈ గ్రామంలో హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులు కలసిమెలసి నివసిస్తున్నారు. హిందూ దేవాలయములతో పాటుగా చర్చి, మసీదులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉర్దూ పాఠశాలకూడా ఉండుట దీనికి నిదర్శనం.
గణాంకాలు
మార్చు- 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం గ్రామ జనాభా మొత్తం 6597అందులో పురుషుల సంఖ్య: 3325, స్త్రీల సంఖ్య: 3272, అక్షరాస్యత: 69.35 శాతం, పురుషుల అక్షరాస్యత: 73.77 శాతం, స్త్రీల అక్షరాస్యత: 64.91 శాతం, నివాస గృహాలు 1984, విస్తీర్ణం 1350 హెక్టారులు
మూలాలు
మార్చు