పెద్దపల్లి (తెల్కపల్లి మండలం)

నాగర్‌కర్నూల్ జిల్లా, తెల్కపల్లి మండలం లోని గ్రామం

పెద్దపల్లి,తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెల్కపల్లి మండలంలోని గ్రామం.[1]

పెద్దపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
పెద్దపల్లి is located in తెలంగాణ
పెద్దపల్లి
పెద్దపల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°25′35″N 78°27′09″E / 16.4265198°N 78.4524591°E / 16.4265198; 78.4524591
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్
మండలం తెల్కపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,990
 - పురుషుల సంఖ్య 2,062
 - స్త్రీల సంఖ్య 1,928
 - గృహాల సంఖ్య 803
పిన్ కోడ్

ఇది మండల కేంద్రమైన తెల్కపల్లి నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వనపర్తి నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 803 ఇళ్లతో, 3990 జనాభాతో 2163 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2062, ఆడవారి సంఖ్య 1928. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1016 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 41. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 575692.[3] పిన్ కోడ్: 509385.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి తెల్కపల్లిలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల తెల్కపల్లిలోను, ఇంజనీరింగ్ కళాశాల నాగర్‌కర్నూల్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల మహబూబ్ నగర్లోను, పాలీటెక్నిక్‌ వనపర్తిలోను, మేనేజిమెంటు కళాశాల నాగర్‌కర్నూల్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నాగర్‌కర్నూల్లోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు మహబూబ్ నగర్లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

పెద్దపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

పెద్దపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. మొబైల్ ఫోన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

పెద్దపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 79 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 40 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 40 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 187 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 241 హెక్టార్లు
  • బంజరు భూమి: 80 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1494 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1520 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 54 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

పెద్దపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 54 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

పెద్దపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, జొన్న, వేరుశనగ

గ్రామ నిర్మాణం - సన్యాసుల పాత్ర

మార్చు

పూర్వం శ్రీశైలం నుండి ఈ దారిలో ఉత్తరాదికి వెళ్తున్న ముగ్గురు సన్యాసులు ఈ ప్రాంతంలో విడిదిచేశారు. వారు దేవేంద్రపురి, ఉపేంద్రపురి, నరేంద్రపురి. వీరిలో దేవేంద్రపురికి దేవుడు కలలో కనిపించి ఒక బావిలో తాను ఉండినట్లు, తనను వెలికి తీసి ప్రతిష్ఠించమని ఆదేశించాడట. ఆ ప్రకారమే దేవేంద్రపురి దేవుడిని వెలికితిసి ప్రతిష్ఠించాడు. ఆ తరువాత ఉపేంద్రపురి గ్రామ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తే, నరేంద్రపురి చెరువు నిర్మాణానికి పూనుకున్నాడట. నాడు నిర్మించిన ఈ చెరువు ద్వారా నేడు 230 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. వర్షాకాలంలో నీటితో నిండినప్పుడు చెరువు చూపరులను ఆకట్టుకుంటుంది. సర్వసంగ పరిత్యాగులైన ఈ ముగ్గురి వలన గ్రామం ఎంతో కీర్తిగడించిందని చెబుతారు. వీరు తమ జీవయాత్రను కూడా ఇక్కడే ముగించారని, వారి సమాధులు కూడా గ్రామంలోనే ఉన్నాయని తెలుస్తుంది.

శ్రీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం

మార్చు

దేవేంద్రపురి సన్యాసి నిర్మించిన గుడే శ్రీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం. నీటిలో దొరికిన స్వామి కాబట్టే ఈ స్వామికి బుగ్గస్వామి అని పేరు. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం తెల్కపల్లి మండలంలోనే అతి ప్రాచీనమైనది. పెద్దపల్లి గ్రామం గురించి, ఈ గుడి గురించి పాలమూరు ప్రముఖ కవి, పండితులు కపిలవాయి లింగమూర్తి తాను రచించిన చక్రతీర్థ మహత్య్మంలో ప్రస్తావించాడు. ఈ గుడికి 64 ఎకరాల మాన్యం ఉంది. ఈ గుడి నిర్మాణానికి కావలసిన స్థలాన్ని కాకతీయుల సామంతులైన గోన వంశస్థుడైన గోన మల్లారెడ్డి ఇచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది[4]. ప్రతి సంవత్సరం స్వామి పేరిట జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఈ స్వామిపై గ్రామానికి చెందిన శేషాచారి అను పూజారి భజన గీతాలు రాసి ప్రచురించాడు. బుగ్గ స్వామి ఆలయంతో పాటు గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం, పెరుమాళ్ళ ఆలయం ఉన్నాయి. అవి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి.

పూర్వం దేవేంద్రపురి, ఉపేంద్రపురి, నరేంద్రపురి అనే ముగ్గురు సన్యాసులు సంచారవశాన ఈ ప్రాంతానికి వచ్చి నేటి వెంకటేశ్వరాలయముండే బండపై ఓ రాత్రి నిదురించారు. అప్పుడక్కడ నేలలో ఉన్న స్వామి దేవేంద్రపురికి స్వప్నంలో కనిపించి, తనను అక్కడ ప్రతిష్ఠించిమని ఆజ్ఞాపించాడు. అది విని దేవేంద్రపురి మేలుకొని స్వప్నప్రకారానికి అద్భుతపడి తెల్లవారిన పిమ్మట కొందరు కూలీలను తీసుకువచ్చి కలలో స్వామి కనిపించిన ప్రదేశం త్రవ్వించగా, నేలలో వెంకటేశ్వరుని ఓశిలామూర్తి బయలుపడింది. అంతేకాక స్వామితోపాటక్కడ బుగ్గకూడా పైకి తేలింది. దాన్ని చూచి లోకులా దేవుని బుగ్గస్వామి అని పిలిచేవారు. ఉపేంద్రపురి స్వామి విగ్రహాన్ని బయటకు తీసి, రాత్రి తాము, నిద్రించిన బండపై నాటురాయితో ఓ ఆలయం కట్టించి అందులో ప్రతిష్ఠించాడు. అతడాస్వామి నెప్పుడు ప్రతిష్ఠించాడో తెలియదు కాని ఆలయం నుందు ఉన్న బండపై "వర్తమాన వ్యావహారిక రౌద్రినామ సంవత్సర ఆషాడ శుక (బుధవారం) నాడు తెలకవలె నరసం భట్టుకు జిల్లెళ్ళరెడ్డి దేశాయి వ్రాయించిన దాన పత్రిక కలదు". బుగ్గ వెంకటాద్రికి తూర్పు దిక్కున కమ్మరి నాగోజు కుంటలో పొలముకట్ట మొదలుకొని కందకం లోనిది అంతా వెంకటపతికి నిత్య నైవేద్యాలకి ఇస్తిమి. ఆ క్షేత్రం ఆచంద్ర తారార్కం, పుత్రపారంపర్యం అనుభవించేది. ఇది దేవేంద్రపురి ఇప్పించినది-జిల్లెళ్ళ రెడ్డి వ్రాలు. అని ఓ శాసనం చెక్కబడి ఉంది. దానిలో కుండలీకరణంలో ఉన్న అక్షరాలు స్పష్టంగా లేవు. ఆలయం ఈ శాసనానికి అనతి పూర్వంలోనే కట్టించబడి వుండొచ్చు. దీని సమీపంలో వెలసిన శాసనాలీ ప్రాంతంలో లేవు కాబట్టి దీని కాలనిర్ణయం కష్టం బహుశః ఇది గోల్కొండ నవాబునాటిదై సా.శ. 1561 ప్రాంతమ్లో వేయించి ఉండవచ్చును. ఈ శాసనంలో ఉన్న దేవేంద్రపురిను గురించి తప్ప తక్కినవారి వివరాలేవీ తెలియరావు. దేవేంద్రపురి శిష్యుడైన ఉపేంద్రపురి ఆలయంముందు సదాసేవ అన్నపేరుతో మరో చిన్న శాసనం చెక్కించాడు. ఈ శాసనం మొదటి శాసనం తరువాత 24ఏండ్లకు పుట్టింది. ఈ శాసనంలో విశ్వనాధుడు పేర్కొనబడ్డాడు. ఇక్కడ వెంకటపతి ప్రతిష్ఠతో పాటు లింగ ప్రతిష్ఠ కూడా ఉంది. ఇది ఇతడు చేసాడు.దీన్ని గురుంచి ఒక కథ ప్రాచుర్యమ్లో ఉంది. ఇది పార్ధివలింగం. వెంకటేశ్వరుడు లచించిన చోటు బుగ్గ పడగా దాన్ని బావి త్రవ్వుతుండగా ఈ లింగం దొరికింది. మొదటినాడు బావి త్రవ్వే వారికి నేలలో దొరకగా వారేదో గుండ్రాయి అనుకొని మట్టితో పాటు ఒడ్డున వేసివేశారు. మరునాడు వచ్చి త్రవ్వుతుంటే కొంత సేపయిన తరువాత అదే లింగం వారికి మళ్ళీ దొరికింది. అయినప్పటికీ వారు దానిపై శ్రద్ధ పెట్టక మళ్ళీ ఒడ్డున వేసి వేశారు. వారు మూడోనాడు వచ్చి త్రవ్వుతుండగా కొంతసేపటికా లింగం మళ్ళీ దొరికింది. అప్పుడు వారు దానికాశ్చర్యపడి ఆ సంగతి ఉపేంద్రపురితో చెప్పారు. అంత ఆయన అది విని ఆ స్వామిని వెంకటేశ్వరుని కుత్తరంగా కొంత దూరంలో స్థాపించాడు కాని గుడిగాని ఏమి కట్టలేదు. దేవేంద్రపురి దేవుని ప్రతిష్ఠించిన తరువాత ఉపేంద్రపురి అక్కడేఉండి ఈ ఊరిని స్థాపించాడు. అతడాఊరిని స్థాపించిన పిమ్మట నరేంద్రపురి ఆ ఊరికోసం ఓ చెరువు వేయించాడు. నేడా చెరువుంది.

ఈ విధంగా ముగ్గురు సన్యాసులు ఇక్కడ స్వామిని, గ్రామాన్ని, తటాకాన్ని ప్రతిష్ఠించారు. నేడు వారి సమాధులు కూడా గ్రామం వెలుపల ఒకే వరుసలో ఒకదాని ప్రక్కన ఒకటి ఉన్నాయి.

పెద్దపల్లెలోని బుగ్గస్వామికి పూర్వం కపిలవాయి వంశానికి చెందిన విశ్వబ్రాహ్మణులు పూజారులుగా ఉండేవారు. వారు రామానుజుల మతానికి చెందినవారు. కొంతకాలానికా వంశంలో బుగ్గయ్య అనే వ్యక్తి ఉదయించి, బుగ్గస్వామి ఆలయాభివృద్ధికి మిక్కిలి పాటుపడినాడు.స్వామివారికి ఉత్సవ విగ్రహాలు చేయించాడు, ఏటేటా ఉత్సవాలు ఏర్పాటు చేసి రథోత్సవం నడిపించాడు. కాని ఆయన తరువాత ఆ వంశీయులెవ్వరికీ మళ్ళీ ఆలయాన్ని గురుంచి పట్టలేదు.బుగ్గయ్య వంశంలో మరికొంతకాలానికి పెద్దగుట్టయ్య, చిన్నగుట్టయ్య అనే సోదరులు మరికొంత కృషి చేసి, పెద్ద గుట్టయ అచిరకాలానికే మరణించగా, చిన్న గుట్టయ్య శ్రీరంగం వెళ్ళిపోయాడు. గుట్టయ్య తరువాత స్వామి నిత్యార్చనలకి విఘాతం కలిగింది. అందువల్ల అప్పటి దొరగారు గుట్టయ్యకి రెండు మూడు పర్యాయాలు ఉత్తరాలు వ్రాసి, వచ్చి అర్చకత్వం స్వీకరించవలసినదిగా కోరాడు కాని ఆయన అంగీకరించలేదు. అప్పుడు దొరగారు గ్రామపురోహితుని ఏర్పాటుచేసారు. అంత ఆయన కొంతకాలానికి గతించాడు. అంత ఆయన వేంగీపుర తిరువెంగళాచార్యుని పిలిపించి ఆలయాన్ని శాశ్వతంగా ఆయనకప్ప గించారు. బుగ్గయ్య తరువాత ఈ ఆలయం అభివృద్ధిలో పాటుపడ్డవారు ఈ దొరగారు. ఆయన పత్ని వెంకటజానకమ్మ గారు, వెండితో మైమరపు కిరీటాలు స్వామికి చేయించారు. సా.శ. 1966 ప్రాంతంలో ఈ ఆలయంలో దొంగలు పడి కొన్ని ఉత్సవ విగ్రహాలు, మరికొంత ఆభరణాలు దొంగలించ బడ్డాయి.

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 102

వెలుపలి లింకులు

మార్చు