పెద్దలు మారాలి

పెద్దలు మారాలి 1974, మార్చి 28న విడుదలైన తెలుగు సినిమా.

పెద్దలు మారాలి
(1974 తెలుగు సినిమా)
Peddalu marali.jpg
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాణం వీరమాచనేని సరోజిని
తారాగణం కృష్ణ,
జమున
నిర్మాణ సంస్థ పాంచజన్య ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలకు బి.గోపాలం సంగీతం సమకూర్చాడు.[1]

పాట రచయిత గాయకులు
మాబాబు చిరునవ్వు నవ్వాలి మాయింట చిరుజల్లు కురవాలి ఆరుద్ర పి.సుశీల
మమ్మీ టెల్‌మీ టెల్‌మీ డాడీ ఏడీ ఏడీ సినారె కళ్యాణి, రమ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఏమని వ్రాయను ఏమని వ్రాయను ప్రతి పలుకూ విరహగీతమై సినారె ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
కన్నీటిలో రగిలింది జ్వాల ఆరుద్ర ఘంటసాల
భయం భయంగా ఉందమ్మా ఆరుద్ర పి.సుశీల
మాయదారి లోకంతీరు ఓరయ్యో చూడు ఆరుద్ర ఎల్.ఆర్.ఈశ్వరి
అతడే నా జతగాడు కళలు మాయని నెలరేడు సినారె సుశీల

కథసవరించు

స్వయంకృతాపరాధం వల్ల మనోవ్యధకు లోనైన మూడు కుటుంబాల కథ పెద్దలు మారాలి. పిల్లల పెంపకం భాద్యతాయుతమైన విషయమని తెలియజేసే ప్రయోజనాత్మక చిత్రం ఇది. క్రమశిక్షణ పేరుతో రాచిరంపాన పెట్టి చివరకు తన కొడుకు అకాల మృత్యువుకు కారణమౌతాడు నరసింహం అనే చదువుకున్న వ్యక్తి. అతి గారాబంగా పెంచి కొడుకును అప్రయోజకుడిగా, మొండివాడిగా చేసి, విదేశాల నుండి వచ్చిన భర్తపై మోజుతో కొడుకును నిర్లక్ష్యం చేస్తే ఆ పసిమనసు తల్లిదండ్రుల గురించి ఏమని ఆలోచిస్తుందో తెలియని అమాయకురాలు రాధ. సంతానాన్ని కని గాలికి వదిలేసి కొడుకు చంద్రం దొంగగా మారినా పట్టించుకోని వ్యక్తి సంతానం. ఈ ముగ్గురు ఇంకా ఇలాంటి వారికి మార్గం చూపించే ఒక ఆదర్శమహిళ, ఒక త్యాగమూర్తి కథ ఈ సినిమా[1].

మూలాలుసవరించు

  1. 1.0 1.1 పి.సి.ఆర్. పెద్దలు మారాలి పాటల పుస్తకం. p. 8. Retrieved 16 August 2020.

బయటిలింకులుసవరించు