పెన్మత్స సురేష్ బాబు

(పెన్మత్స సురేష్‌ బాబు నుండి దారిమార్పు చెందింది)

పెనుమత్స వీర వెంకట సూర్యనారాయణరాజు(సురేష్‌ బాబు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా పని చేస్తున్నాడు.

పెనుమత్స సురేష్‌ బాబు

శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020 నుండి ప్రస్తుతం
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 06 జులై 1966
విజయనగరం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి పెనుమత్స రోజా రాణి
నివాసం మొయిదవిజయరాం పురం గ్రామం, నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లా
వృత్తి రాజకీయ నాయకుడు, డాక్టర్

జననం, విద్యాభాస్యం

మార్చు

పెన్మత్స సురేష్‌ బాబు 6 జులై 1966లో విశాఖపట్నంలో జన్మించాడు. ఆయన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు. సురేష్‌ బాబు బీడీఎస్‌(డెంటల్‌) పూర్తి చేశాడు. ఆయన 2009 ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ డెంటల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ పని చేశాడు. అతను ఇండియన్‌ డెంటిస్ట్స్‌ అధ్యక్షుడిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

పెన్మత్స సురేష్‌ బాబు తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన మొదటిసారి విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం, మొయిద గ్రామ ఎంపీటీసీగా గెలిచాడు. ఆయన 2014 ఎన్నికల్లో నెల్లిమర్ల నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పతివాడ నారాయణస్వామి నాయుడు చేతిలో 6973 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.ఆయన తరువాత వైఎస్సార్‌సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్తగా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గా వివిధ హోదాల్లో పని చేశాడు. సురేష్ బాబు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల టికెట్ దక్కలేదు, ఆయనను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కి 2020లో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యే కోటా స్థానానికి 12 ఆగష్టు 2020న ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశాడు.[1]

సురేష్‌ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 13 ఆగష్టు 2020న నామినేషన్‌ దాఖలు చేశాడు.[2] ఈ స్థానానికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో సురేష్‌ బాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు 17 ఆగష్టు 2020న రిటర్నింగ్ అధికారి ప్రకటించాడు.[3]పెనుమత్స సూర్యనారాయణ రాజు 6 అక్టోబర్ 2020న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[4]

మూలాలు

మార్చు
  1. Sakshi (12 August 2020). "విధేయతకు పట్టం". Sakshi. Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  2. TV9 Telugu (13 August 2020). "ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్ బాబు నామినేషన్‌ - penumatsa suresh babu". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (17 August 2020). "ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్‌ బాబు ఏకగ్రీవం". Sakshi. Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.
  4. News18 Telugu (6 October 2020). "'ఇలా ప్రమాణస్వీకారం.. అలా ఇండియా రికార్డు కొట్టిన వైసీపీ మహిళా ఎమ్మెల్సీ'". Archived from the original on 9 July 2021. Retrieved 9 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)