పేట్ బషీరాబాద్
పేట్ బషీరాబాద్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కుత్బల్లాపూర్ శివారు ప్రాంతం.[1] ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోకి వస్తుంది.[2]
పేట్ బషీరాబాద్ | |
---|---|
సమీప ప్రాంతం | |
Coordinates: 17°31′18″N 78°29′00″E / 17.521741°N 78.483421°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
టెలిఫోన్ కోడ్ | 040 |
Vehicle registration | టిఎస్-26 X XXXX |
చరిత్ర
మార్చుసికందర్ జా మీర్ అక్బర్ ఆలీఖాన్ అసఫ్ జా III రెండవ కుమారుడైన 3వ నిజాం మీర్ బషీరుద్దీన్ ఆలీఖాన్ (సంసం ఉద్ దౌలా) పేరును ఈ ప్రాంతాలనికి పెట్టారు. ఇక్కడికి సమీపంలో జీడీమెట్ల, కుత్బుల్లాపూర్, నందనగర్, గాజులరామారం, సూరారం, రామరాజు నగర్, భెల్ కాలనీ, గ్రీన్ కౌంటీ కాలనీ, మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పేట్ బషీరాబాద్ మీదుగా కోఠి, మేడ్చల్, ఎన్జీవోస్ కాలనీ, అఫ్జల్‌గంజ్, మెహదీపట్నం, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వంటి ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[3] ఇక్కడికి సమీపంలో బొల్లారం బజార్ రైల్వే స్టేషను, ఆల్వాల్ రైల్వే స్టేషను ఉన్నాయి.
పాఠశాలలు
మార్చుఇక్కడ సెయింట్ ఆన్స్ హైస్కూల్, షేర్వుడ్ హైస్కూల్ ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Pet Basheerabad Locality". www.onefivenine.com. Retrieved 2021-02-02.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2021-02-02.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-02.