పైలాపచ్చీసు
పైలాపచ్చీసు 1989 లో వచ్చిన తెలుగు కామెడీ చిత్రం, ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో రామోజీ రావు నిర్మించగా, మౌళి దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రమ్య కృష్ణ నటించారు. నరేంద్రనాథ్ సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.[2]
పైలా పచ్చీసు (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మౌళి |
---|---|
నిర్మాణం | రామోజీరావు |
కథ | మౌళి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
సంభాషణలు | ఆకెళ్ళ |
ఛాయాగ్రహణం | కె. రవీంద్ర బాబు |
కూర్పు | గౌతం రాజు |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
భాష | తెలుగు |
కథ
మార్చునలుగురు కొంటె విద్యార్థులు, శరణ్య (రమ్య కృష్ణ), అశోక్ (అశోక్), రంగా (మాస్టర్ చక్రీ), పద్మ (డిస్కో శాంతి) కళాశాలలో రచ్చ చేస్తూంటారు. కొత్తగా నియమితుడైన లెక్చరర్ సురేష్ (రాజేంద్ర ప్రసాద్) వారిని గట్టిగా ఎదుర్కుంటూంటాడు. అతన్ని వదిలించుకోవడానికి, అతను శరణ్యను వేధించడానికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేసి అతణ్ణి బయటికి పంపించేస్తారు. ఆ తరువాత, శరణ్య తన ముఠాతో పాటు తన సోదరి శాంతి (రాజ్యలక్ష్మి) పెళ్ళికి వెళుతుంది, అక్కడ ఆమె తండ్రి ఆనందరావు (రావి కొండలరావు) ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు తెలిసి ఆమె షాకవుతుంది. దాని వెనుక ఉన్న కారణాన్ని విచారించగా, శాంతి కోటీశ్వరుడైన చక్రవర్తి (గిరి బాబు) కుమారుడు రాజా (సుధాకర్) ను ప్రేమించిందని, వారి పెళ్ళి సమయంలో చక్రవర్తి శాంతిపై అపవాదు సృష్టించి ఆమెపై నింద వేస్తాడు. శరణ్య తన సోదరి అమాయకత్వాన్ని నిరూపించి ఆమెకూ రాజాకూ పెళ్ళి చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. ఈ సమయంలో సురేష్ ఆమె కుటుంబానికి చేదోడుగా నిలుస్తాడు.
ఇక్కడ సురేష్, శరణ్య ఒకరినొకరు ప్రేమించడం ప్రారంభిస్తారు. అదే సమయంలో సురే, చక్రవర్తి గతం గురించి వివరిస్తూ, అతను అనుభవిస్తున్న ఆస్తి అతడి సోదరి అనసూయమ్మ (ప్రమీల) దనీ, అతను ఆమె భర్తనూ, కుమార్తె రాణినీ, సురేష్ తండ్రి సత్య మూర్తినీ (మళ్ళీ రాజేంద్ర ప్రసాద్) హత్య చేసాడనీ చెబుతాడు. కానీ అనసుయమ్మ తన కుమార్తె ఇంకా బతికే ఉందనే అభిప్రాయంలో ఉంది. ఆమె రాక కోసం సూస్తూ ఉంటుంది. అదే సమయంలో, సురేష్, ఇతర సభ్యులు శరణ్యను రాణిగా పరిచయం చేసి మారువేషంలో అనసూయమ్మ ఇంట్లోకి ప్రవేశిస్తారు. మిగతా కథలో వారంతా చక్రవర్తిని ఆటపట్టించి అతనికి పాఠం నేర్పిస్తారు.
నటీనటులు
మార్చు- సురేష్ సత్యమూర్తిగా రాజేంద్ర ప్రసాద్ (ద్విపాత్ర)
- రమ్య కృష్ణ
- గిరి బాబు
- బేతా సుధాకర్
- ఆనంద్ బాబు
- బ్రహ్మానందం
- తనికెళ్ళ భరణి
- మౌళి
- రావి కొండలరావు
- శంకర్ మెల్కోటే
- అనంత్
- పొట్టి ప్రసాద్
- చిడతల అప్పారావు
- ముక్కు రాజు
- జెన్నీ
- డిస్కో శాంతి
- డబ్బింగ్ జానకి
- మాయ
- వై.విజయ
పాటలు
మార్చునరేంద్రనాథ్ పేరుతో రమేష్ వినాయకం సంగీతం సమకూర్చాడు. సాహిత్యం వేటూరి సుందరరామ మూర్తి అందించాడు. LEO ఆడియో కంపెనీ సంగీతాన్ని విడుదల చేసింది.
ఎస్. | పాట | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | "పోంగే యవ్వనం" | ఎస్పీ బాలూ, చిత్ర | 4:30 |
2 | "నా చైత్ర గీతమే" | ఎస్పీ బాలు | 3:13 |
3 | "ఐ వాంట్ యు డాన్స్ విత్ మీ" | ఎస్పీ బాలూ, చిత్ర | 3:22 |
4 | "ఉడుకు ఉడుకు ధుడుకు కుర్రవాడ" | ఎస్.జానకి | 4:39 |
5 | "పట్టు పట్టు మళ్ళీ పట్టు" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:13 |
6 | "టీనేజ్ టీం మాది" | మనో, ఎస్.జానకి | 4:29 |
మూలాలు
మార్చు- ↑ "Paila Pacheesu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-11. Retrieved 2020-08-05.
- ↑ "Paila Pacheesu (Review)". Telugu Cinema Prapamcham.