పొట్టేలు
పొట్టేలు అంటే మగ గొర్రె .ఏట, పొట్లి అనికూడా ఆంటారు. మాంసాలలో లేతపొట్టేలు మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది. గొర్రెలు నాలుగు కాళ్ళు కలిగిన క్షీరదాలు (పాలిచ్చే జంతువులు). వీటిని చాలా దేశాల్లో జీవనాధారం (బతుకు తెరువు) కోసం పెంచుతారు. వీటి ద్వారా లభించే ఉన్ని, మాంసం మొదలైన ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. ఆస్ట్రేలియా దేశం గొర్రె మాంసానికి, ఉన్నికి ప్రసిద్ధి. మన దేశంలో యాదవులు (గొల్లలు) కులవృత్తిగా వీటిని పెంచుతారు.ఇవి క్షీరదాలు. వీటిని పల్లెల్లో ఎక్కువగా పెంచుతారు. వీటిని మాంసం కొరకు ఎక్కువగా పెంచుతారు. వీటి నుండి అరుదుగా పాలు కూడా తీస్తారు. వీటిలో కిన్ని ఉన్ని గొఱ్ఱె లుంటాయి. వీటిని ఉన్ని కొరకు పెంచుతారు. ఈ ఉన్నితో కంబళ్ళు నేస్తారు. మగ గొఱ్ఱెను పొట్టేలు అంటారు. దీనికి కొమ్ములుంటాయి. ఆడ గొఱ్ఱెలకు కొమ్ములుండవు. కాని అరుదుగా కొన్ని గొఱ్ఱెలకు కొమ్ములుంటాయి. అలాంటి ఒక గొఱ్ఱెను చిత్రంలో చూడ వచ్చు. వీటిని గొల్లలు ఎక్కువగా పెంచుతారు.
పొట్టేలు | |
---|---|
![]() | |
యు.ఎస్.ప్రయోగ కేంద్రంలో గొర్రెల గుంపు | |
పెంపుడు జంతువులు
| |
Scientific classification | |
Kingdom: | Animalia
|
Phylum: | |
Class: | Mammalia
|
Order: | |
Family: | Bovidae
|
Subfamily: | |
Genus: | |
Species: | O. aries
|
Binomial name | |
Ovis aries |
బలి పశువుసవరించు
ఆహారం కోసము మరియు మొక్కుల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల పొట్టేళ్లు బలి అవుతున్నాయి. సహజంగా కోడి,మేక,గొర్రె,పొట్టెల్లను అమ్మవారి గుడి ముందు మొక్కు తీర్చుకోవటానికి బలి ఇస్తారు.
సంకరజాతి పొట్టేళ్లుసవరించు
ప్రపంచం లోనే మొదటిసారిగా డాలీ అనే పొట్టేలను జన్యు పరివర్తన పద్ధతిద్వారా శాస్త్రవేత్తలు సృష్టించారు. డాలి అనే పేరు గల గొర్రె పిల్లను, క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా పెద్ద గొఱ్ఱె నుంచి తీసిన జీవకణం ద్వారా 5 జూలై 1996 నాడు పుట్టించారు.
పొట్టేలు మాంసంతో చేసే వంటకాలుసవరించు
- మటన్ బిరియానీ
- దమ్ బిరిమానీ
- కబాబ్స్ (అచ్చ తెలుగులో వట్టి చియ్యలు అని కూడా అంటారు)
- మటన్ మొగలాయి
- పత్థర్ కా గోష్త్
గొఱ్ఱెలకు సంబందించిన సామెతలుసవరించు
- గొల్ల వాడు గొఱ్ఱెపిల్లను సంకలో పెట్టుకొని ఊరంతా వెతికాడట
- వాడి దంతా గొఱ్ఱె దాటు వ్వవహారం
- కర్ర లేని వాడిని గొఱ్ఱె అయినా కరుస్తుంది.
- గొఱ్ఱె తోక బిత్తెడే
- జీత బత్యం లేకుండా ..... తోడేలు గొఱ్ఱెలను కాస్తా నన్నదట.
- గొఱ్ఱెల గోత్రాలు గొల్ల వాని కెరుక.
- గొఱ్ఱె కసాయి వాడినే నమ్ముతుంది.
ఇవి కూడా చూడండిసవరించు
- పొట్టేలు పున్నమ్మ, తెలుగు సినిమా
చిత్రమాలికసవరించు
యితర లింకులుసవరించు
Wikispecies has information related to: Ovis aries |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో sheepచూడండి. |
Wikimedia Commons has media related to Ovis aries. |
Wikimedia Commons has media related to Sheep. |
- American Sheep Industry
- Sheep Industry (Queensland)
- Canadian Sheep Federation
- National Sheep Association (UK)
- New Zealand Sheepbreeders Association
- Sheep magazine, all articles available free online
- View the sheep genome in Ensembl