పొద్దుటూరి గంగారెడ్డి
పొద్దుటూరి గంగారెడ్డి ( 1933 జూన్ 7 - 2008 జనవరి 03) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, భారత మాజీ పార్లమెంటు సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున[1][2][3] ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగవ, ఐదవ లోక్‌సభల్లో ప్రాతినిధ్యం వహించాడు.[4]
పొద్దుటూరి గంగారెడ్డి | |||
| |||
పార్లమెంట్ సభ్యుడు, 5వ లోక్‌సభ
| |||
పదవీ కాలం మార్చి 1971 – జనవరి 1977 | |||
ముందు | పొద్దుటూరి గంగారెడ్డి | ||
---|---|---|---|
తరువాత | గడ్డం నర్సింహారెడ్డి | ||
నియోజకవర్గం | ఆదిలాబాదు | ||
పార్లమెంట్ సభ్యుడు, 4వ లోక్‌సభ
| |||
పదవీ కాలం మార్చి 1967 – డిసెంబరు 1970 | |||
ముందు | జి. నారాయణరెడ్డి | ||
తరువాత | పొద్దుటూరి గంగారెడ్డి | ||
నియోజకవర్గం | ఆదిలాబాదు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తోరత్, నిజామాబాదు, (తెలంగాణ) | 1933 జూన్ 7||
మరణం | 2008 జనవరి 3 | (వయసు 74)||
జాతీయత | India | ||
రాజకీయ పార్టీ | కాంగ్రేసు | ||
తల్లిదండ్రులు | పొద్దుటూరి రాజారెడ్డి (తండ్రి) | ||
జీవిత భాగస్వామి | సుశీలాదేవి | ||
సంతానం | ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు | ||
నివాసం | ఆదిలాబాదు & కొత్త ఢిల్లీ | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా విశ్వవిద్యాలయం | ||
వృత్తి | వ్యవసాయం & రాజకీయ నాయకుడు |
జననం, విద్య
మార్చుగంగారెడ్డి 1933, జూన్ 7న రాజారెడ్డి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, తోరత్ గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ, ఎల్.ఎల్.బి. చదివాడు. కొంతకాలం వ్యవసాయదారుడిగా పనిచేశాడు.[5]
వ్యక్తిగత జీవితం
మార్చుగంగారెడ్డికి సుశీలాదేవితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
రాజకీయ జీవితం
మార్చుగంగారెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు (1967-1970, 1971-1977) ఎంపీగా గెలుపొందాడు. ఆదిలాబాద్ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశాడు.[5][6][7]
క్రమసంఖ్య | ప్రారంభం | వరకు | స్థానం | మెజారిటీ |
---|---|---|---|---|
01 | 1967 | 1970 | సభ్యుడు, 04వ లోక్‌సభ | |
02 | 1971 | 1977 | సభ్యుడు, 05వ లోక్‌సభ | 14,950 |
మరణం
మార్చుగంగారెడ్డి 2008, జనవరి 3న మరణించాడు.[8]
మూలాలు
మార్చు- ↑ "Member Profile". www.loksabhaph.nic.in. Lok Sabha website. Archived from the original on 2014-02-02. Retrieved 1 January 2014.
- ↑ "Election Results 1967" (PDF). Election Commission of India. Retrieved 1 January 2014.
- ↑ "Election Results 1971" (PDF). Election Commission of India. Retrieved 1 January 2014.
- ↑ ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 April 2020. Retrieved 18 April 2020.
- ↑ 5.0 5.1 "Member Profile". Lok Sabha website. Archived from the original on 2 February 2014. Retrieved 21 January 2014.
- ↑ "Election Results 1967" (PDF). Election Commission of India. Retrieved 21 January 2014.
- ↑ "Election Results 1971" (PDF). Election Commission of India. Retrieved 21 January 2014.
- ↑ "Former Nizamabad MP Keshpally Gangareddy passes away". Archived from the original on 2017-04-12. Retrieved 2021-11-21.