ప్రణవ్ మోహన్ లాల్

ప్రణవ్ మోహన్ లాల్ భారతదేశం లోని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు,ఇతడు ప్రముఖ నటుడు మోహన్ లాల్ కుమారుడు, అతను చిన్న వయసు లోనే తన తండ్రి నటించిన చిత్రం ఒన్నామన్ (2002) లో చిన్న పాత్రతో నటన ప్రారంభించాడు , తర్వాత అదే సంవత్సరంలో పునర్జని అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు, దీని కోసం ఉత్తమ బాల కళాకారుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. . న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు.ఇతడు పాటలు రచించడమే కాకుండా చక్కగా పాడతాడు

ప్రణవ్ మోహన్ లాల్
జననం (1990-07-13) 1990 జూలై 13 (వయసు 34)
విద్యాసంస్థయూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్
వృత్తి
  • నటుడు
  • గాయకుడు
  • పాటల రచయిత
క్రియాశీల సంవత్సరాలు2002; 2009
2015–ప్రస్తుతం
తల్లిదండ్రులుమోహన్ లాల్
సుచిత్ర బాలాజి
పురస్కారాలుకేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్

ప్రణవ్ 2015 లో తన సినీ ప్రయాణాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభించి జీతూ జోసెఫ్ వద్ద రెండు సినిమాలకు పనిచేశాడు —పాపనాశం , జో సట్టి లైఫ్ . జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన 2018 చిత్రం ఆదిలో ప్రధాన పాత్రలో కనిపించాడు, ఆ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ పాత్ర కోసం అతను ఉత్తమ నూతన నటుడిగా సైమా అవార్డు గెలుచుకున్నాడు. "జిప్సీ ఉమెన్" సినిమాలో పాట రాయడం, పాడట ద్వారా గాయకుడు-పాటల రచయితగా కూడా ప్రవేశించాడు.

నేపథ్యం

మార్చు

ప్రణవ్ మోహన్ లాల్ జూలై 13 1990 వ సంవత్సరంలో [1]భారతదేశంలోని కేరళ రాష్ట్రం లో తిరువనంతపురంలో నటుడు మోహన్ లాల్ సుచిత్ర బాలాజీలకు జన్మించాడు. అతని తాత తమిళ సినీ నిర్మాత కె. బాలాజీ మామ సురేష్ బాలాజి కూడా నిర్మాత. ప్రణవ్ ప్రాథమిక విద్యా అంతా బోర్డింగ్ స్కూల్లో పూర్తి చేశాడు అది తమిళనాడులోని ఊటీలో ఉంది [2] తర్వాత ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. [3]

సినిమా కెరీర్

మార్చు

ప్రణవ్ మొదటిసారిగా మోహన్ లాల్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఒన్నమన్ లో చిన్న పాత్రలో కనిపించిన ప్రణవ్ 2002 లో మళ్ళీ తెరపైకి వచ్చాడు . ఇందులో అతను తన తండ్రి చిన్నతనంలో పాత్ర ఐనా రవిశంకర్ పాత్ర లో నటించాడు .ఆ నటనకు ఉత్తమ బాల నటుడు గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నాడు తర్వాత పై చదువు ల కోసం అమెరికా వెళ్ళడం వల్ల సినిమాలకు దూరం అయ్యాడు . [4] 2009 లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన సాగర్ అలియాస్ జాకీ రీలోడెడ్‌లో ఒక పాటలో అతిధి పాత్రలో కనిపించాడు

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర రిపరెన్సులు Ref.
2002 ఒన్నమన్ రవిశంకర్ బాల నటుడు [5]
2002 పునర్జని అప్పు బాల నటుడు - ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు [6]
2009 సాగర్ అలియాస్ జాకీ రీలోడెడ్ వీధిలో యువకుడు టీనేజ్ నటుడు - "సాగర్ అలియాస్ జాకీ" పాటలో అతిధి పాత్ర [7]
2018 ఆది ఆదిత్య "ఆది" మోహన్ తొలి సినిమా [8]
2019 ఆదిత్య "ఆది" మోహన్ అప్పు మలయాళం సినిమా [9]
2022 మరక్కార్: అరేబియా సముద్ర సింహం జూనియర్ కుంజలి మరక్కర్ ఐవి జూనియర్ కుంజలి మరక్కర్ ఐవి గా అతిధి పాత్రలో కనిపించింది [10]
2022 హృదయం | శైలి="నేపథ్యం: #డిడిఎఫ్; రంగు: నలుపు; వర్టికల్ అలైన్: మధ్య; టెక్స్ట్-అలైన్: సెంటర్; "క్లాస్="టేబుల్-నెం2 లేదు"| ప్రకటించాలి ఫిల్మింగ్ టి బి ఎ ఫిల్మింగ్ [11]

అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సినిమాలు

మార్చు
సంవత్సరం శీర్షిక గమనికలు రిపరెన్సులు
2015 పాపనాశం అసిస్టెంట్ డైరెక్టర్ ; తమిళ సినిమా [11]
2015 జోసుట్టి జీవితం అసిస్టెంట్ డైరెక్టర్ ; మలయాళ చిత్రం [12]

మూలాలు

మార్చు
  1. Chandran, Cynthia (5 July 2017). "Suspense, is thy name Pranav?". Deccan Chronicle. Archived from the original on 9 November 2017. Retrieved 15 July 2017.
  2. Mohanlal, Pranav (30 September 2016). "സ്കൂൾ കഴിഞ്ഞ് പ്രണവ് 'മുങ്ങിയത്' എങ്ങോട്ട്?". Mathrubhumi (in మలయాళం). Archived from the original on 16 February 2020. Retrieved 16 February 2020.
  3. V. P., Nicy (1 September 2014). "Pranav Mohanlal Turns Assistant Director in Kamal Haasan's 'Papanasam'". International Business Times. Archived from the original on 16 February 2020. Retrieved 16 February 2020.
  4. Warrier, Shobha (13 April 2002). "Introducing Mohanlal's son-Pranav". Rediff.com. Archived from the original on 15 February 2017. Retrieved 16 February 2020.
  5. Akhila Menon (14 April 2015). "Mohanlal And Pranav Mohanlal Back Together". Archived from the original on 4 February 2016. Retrieved 4 February 2016.
  6. Nayar, Parvathy S. (1 December 2012). "Is the stage set for Pranav Mohanlal's Mollywood entry?". The Times of India. Archived from the original on 12 March 2017. Retrieved 4 February 2016.
  7. Prakash, Asha (3 October 2013). "Pranav is not doing a Mani Ratnam film". The Times of India. Archived from the original on 12 March 2017. Retrieved 4 February 2016.
  8. HT Correspondent (5 July 2017). "Mohanlal son Pranav's debut film announced, to be called Aadi". Hindustan Times. Archived from the original on 11 July 2017. Retrieved 12 July 2017.
  9. "Pranav to star in Arun Gopi directorial". Deccan Chronicle. 4 March 2018. Archived from the original on 4 March 2018. Retrieved 4 March 2018.
  10. Onmanorama staff (25 June 2018). "Pranav to act in Kunjali Marakkar film". Malayala Manorama. Archived from the original on 16 February 2020. Retrieved 16 February 2020.
  11. DC Correspondent (2 September 2014). "Mohanlal's son Pranav turns Assistand Director in Papanasam". Deccan Chronicle. Archived from the original on 4 March 2016. Retrieved 4 February 2016.
  12. Soman, Deepa (18 February 2015). "Pranav is a role model: Jeethu Joseph". The Times of India. Archived from the original on 1 September 2015. Retrieved 4 February 2016.


బాహ్య లింకులు

మార్చు
  • Pranav Mohanlal on Facebook