ప్రత్యర్థి వారీగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రికార్డు

న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. టెస్టు, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే), T20I హోదాతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో పూర్తి సభ్యురాలు. [1] వారు 1930లో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఇంగ్లాండ్‌తో తమ మొదటి టెస్టు ఆడి, టెస్టు క్రికెట్ ఆడిన ఐదవ దేశంగా అవతరించారు. 1955-56 సీజనులో, 26 సంవత్సరాల తరువాత, ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో వెస్టిండీస్‌ను ఓడించినపుడు టెస్టుల్లో తొలి గెలుపు రూచి చూసారు. [2] వారు తమ మొదటి వన్‌డేని 1972-73 సీజన్‌లో పాకిస్తాన్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో ఆడారు. 2005లో మొదటి ట్వంటీ 20 ఇంటర్నేషనల్ ఆడిన అత్యంత పురాతన దేశం (ఆస్ట్రేలియాతో ఉమ్మడిగా).

టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ విజయ శాతం 23.83. 2021 ఆగస్టు నాటికి, న్యూజిలాండ్ 449 టెస్టు మ్యాచ్‌లు ఆడింది; అందులో 107 గెలిచింది, 175 ఓడిపోయింది, 167 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. [3]

అనేక టోర్నమెంట్‌ల సెమీ-ఫైనల్‌లకు చేరుకున్నందున, న్యూజిలాండ్ కూడా అత్యంత విజయవంతమైన వన్‌డే జట్టులో ఒకటి. 2021 ఆగస్టు నాటికి, వారు 775 వన్‌డే మ్యాచ్‌లు ఆడారు, అందులో 354 గెలిచారు, 374 ఓడిపోయారు; 7 మ్యాచ్‌లు టైగా ముగియగా, 40 మ్యాచ్‌ల్లో ఫలితం లేదు . [4] వారు 1975, 1979, 1992, 1999, 2007, 2011 సంవత్సరాల్లో క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆరు సార్లు సెమీ-ఫైనల్‌లకు చేరుకున్నారు. ప్రపంచ కప్‌లలో న్యూజిలాండ్ అత్యుత్తమ ప్రదర్శన 2015, 2019 లో రన్నరప్‌గా నిలిచింది. ICC ఛాంపియన్స్ ట్రోఫీలో, 2000 లో న్యూజిలాండ్ ఛాంపియన్‌గా నిలిచింది . వారు ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2009 లో రన్నరప్‌గా, ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2006 లో సెమీ-ఫైనలిస్టులుగా కూడా ఉన్నారు.


ట్వంటీ20 ఇంటర్నేషనల్స్‌లో న్యూజిలాండ్ మామూలు ప్రదర్శన కనబరిచింది. 2021 అక్టోబరు నాటికి న్యూజిలాండ్, 150 T20I మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 73 గెలిచింది, 65 ఓడిపోయింది, 8 మ్యాచ్‌లు టైగా ముగియగా, 4 మ్యాచ్‌లు ఫలితం ఇవ్వలేదు. వారి గెలుపు శాతం 52.73. [5] 6 ICC వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లలో, న్యూజిలాండ్ అత్యుత్తమ ప్రదర్శన 2007, 2016 లో సెమీ-ఫైనలిస్ట్‌లుగా ముగిసింది.

2021 ఆగస్టు నాటికి, న్యూజిలాండ్ టెస్టు క్రికెట్‌లో తొమ్మిది జట్లతో తలపడింది. వారు అత్యంత తరచుగా ఆడిన ప్రత్యర్థి ఇంగ్లాండ్. వారితో 107 మ్యాచ్‌లు ఆడింది. [6] అయితే, వారు శ్రీలంకపై అత్యధికంగా 16 విజయాలు నమోదు చేసుకున్నారు. కానీ వారి అత్యుత్తమ విజయాల శాతం మాత్రం బంగ్లాదేశ్‌పై 80%. వారు 15 టెస్టులు ఆడగా న్యూజీలాండ్ 12 గెలిచింది. [6] వన్‌డే మ్యాచ్‌లలో, న్యూజిలాండ్ 18 జట్లతో ఆడింది; వారు తమ ఖండంలోని ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో చాలా తరచుగా 137 మ్యాచ్‌లు ఆడి, 29.77 విజయ శాతం సాధించారు.[7] సాధారణ వన్‌డే దేశాలలో, న్యూజిలాండ్ 49 సందర్భాలలో శ్రీలంక, భారత్‌లను ఓడించింది. ఇది వన్‌డేలలో వారి అత్యుత్తమ రికార్డు. [7] టీ20లో 13 దేశాలతో పోటీ చేసింది. [8]

సూచిక

మార్చు
  • M – ఆడిన మ్యాచ్‌ల సంఖ్య
  • W – గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య
  • L – ఓడిపోయిన మ్యాచ్‌ల సంఖ్య
  • T – టై అయిన మ్యాచ్‌ల సంఖ్య
  • D – డ్రాగా ముగిసిన మ్యాచ్‌ల సంఖ్య
  • NR – ఫలితం లేకుండా ముగిసిన మ్యాచ్‌ల సంఖ్య
  • టై+డబ్ల్యూ – బౌల్ అవుట్ లేదా సూపర్ ఓవర్ వంటి టైబ్రేకర్‌లో టై అయిన తర్వాత గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య
  • టై+ఎల్ – బౌల్ అవుట్ లేదా సూపర్ ఓవర్ వంటి టైబ్రేకర్‌లో టై అయిన తర్వాత ఓడిపోయిన మ్యాచ్‌ల సంఖ్య
  • విన్% – ఆడిన వాటికి గెలిచిన ఆటల శాతం [n 1]
  • నష్టం% – ఆడిన వాటితో కోల్పోయిన ఆటల శాతం [n 1]
  • డ్రా% – ఆడిన వాటికి డ్రా చేసిన గేమ్‌ల శాతం [n 1]
  • మొదటిది - దేశంతో మొదటి మ్యాచ్ జరిగిన సంవత్సరం
  • చివరి - దేశంతో జరిగిన చివరి మ్యాచ్ సంవత్సరం

టెస్టు క్రికెట్

మార్చు

ఆడిన మ్యాచ్‌లు (దేశం వారీగా)

మార్చు
ప్రత్యర్థి తొలి టెస్టు చివరి టెస్టు మ్యాచ్‌లు గెలుపు ఓటమి డ్రా టైలు గెలుపు %
  ఆఫ్ఘనిస్తాన్ 0 0 0 0 0
  ఆస్ట్రేలియా 1946 మార్చి 29 2020 జనవరి 3 60 8 34 18 0 13.33
  బంగ్లాదేశ్ 2001 డిసెంబరు 26 2022 జనవరి 9 17 13 1 3 0 80
  ఇంగ్లాండు 1930 జనవరి 10 2023 ఫిబ్రవరి 24 112 13 52 47 0 11.60
  భారతదేశం 1956 జనవరి 6 2021 డిసెంబరు 3 62 13 22 27 0 20.97
  ఐర్లాండ్ 0 0 0 0 0
  పాకిస్తాన్ 1955 నవంబరు 7 2023 జనవరి 2 62 14 25 21 0 22.58
  దక్షిణాఫ్రికా 1932 ఫిబ్రవరి 27 2022 ఫిబ్రవరి 25 45 5 26 16 0 10.63
  శ్రీలంక 1983 మార్చి 11 2019 ఆగస్టు 22 36 16 9 11 0 44.44
  వెస్ట్ ఇండీస్ 1952 ఫిబ్రవరి 8 2020 డిసెంబరు 11 49 17 13 19 0 34.69
  జింబాబ్వే 1992 నవంబరు 7 2016 ఆగస్టు 6 17 11 0 6 0 64.70
సారాంశం 1930 2023 462 110 182 170 0 23.81
మూలం: Cricinfo[permanent dead link] . చివరిగా అప్‌డేట్ చేయబడింది: 2023 మార్చి 2

వన్ డే ఇంటర్నేషనల్

మార్చు

ఆడిన మ్యాచ్‌లు (దేశం వారీగా)

మార్చు
ప్రత్యర్థి 1st వన్‌డే Last వన్‌డే Matches Won Lost Tied No result % Won
  ఆఫ్ఘనిస్తాన్ 2015 మార్చి 8 2019 జూన్ 8 2 2 0 0 0 100.00
  ఆస్ట్రేలియా 1974 మార్చి 30 2022 సెప్టెంబరు 11 141 39 95 0 7 29.10
  బంగ్లాదేశ్ 1990 ఏప్రిల్ 28 2019 జూన్ 5 38 28 10 0 0 73.68
  కెనడా 2003 మార్చి 3 2011 మార్చి 13 3 3 0 0 0 100.00
  East Africa 1975 జూన్ 7 1 1 0 0 0 100.00
  ఇంగ్లాండు 1973 జూలై 18 2019 జూలై 14 91 43 41 3 4 51.14
  భారతదేశం 1975 జూన్ 14 2023 జనవరి 24 116 50 58 1 7 46.33
  ఐర్లాండ్ 2008 జూలై 1 2022 జూలై 15 7 7 0 0 0 100.00
  కెన్యా 2003 ఫిబ్రవరి 21 2011 ఫిబ్రవరి 20 2 2 0 0 0 100.00
  నెదర్లాండ్స్ 1996 ఫిబ్రవరి 17 2022 ఏప్రిల్ 4 4 4 0 0 0 100.00
  పాకిస్తాన్ 1973 ఫిబ్రవరి 11 2023 జనవరి 13 110 50 56 1 3 47.19
  స్కాట్‌లాండ్ 1999 మే 31 2015 ఫిబ్రవరి 17 3 3 0 0 0 100.00
  దక్షిణాఫ్రికా 1992 ఫిబ్రవరి 29 2019 జూన్ 19 71 25 41 0 5 37.87
  శ్రీలంక 1979 జూన్ 9 2019 జూన్ 1 99 49 41 1 8 54.39
  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1996 ఫిబ్రవరి 27 1 1 0 0 0 100.00
  యు.ఎస్.ఏ 2004 సెప్టెంబరు 10 1 1 0 0 0 100.00
  వెస్ట్ ఇండీస్ 1975 జూన్ 18 2022 ఆగస్టు 21 68 30 31 0 7 49.18
  జింబాబ్వే 1987 అక్టోబరు 10 2015 ఆగస్టు 7 38 27 9 1 1 74.32
Summary 1973 2021 775 357 374 7 40 48.63
Source: Cricinfo. Last updated: 2 March 2023.

ట్వంటీ20 ఇంటర్నేషనల్

మార్చు

ఆడిన మ్యాచ్‌లు (దేశం వారీగా)

మార్చు
ప్రత్యర్థి 1st T20I Last T20I Matches Won Lost Tied No result Win %
  ఆఫ్ఘనిస్తాన్ 2021 నవంబరు 7 1 1 0 0 0 100.00
  ఆస్ట్రేలియా 2005 ఫిబ్రవరి 17 2022 అక్టోబరు 22 16 5 10 1 0 34.37
  బంగ్లాదేశ్ 2010 ఫిబ్రవరి 3 2022 అక్టోబరు 12 17 14 3 0 0 82.35
  ఇంగ్లాండు 2007 సెప్టెంబరు 18 2022 నవంబరు 1 23 8 13 1 1 38.63
  భారతదేశం 2007 సెప్టెంబరు 16 2023 ఫిబ్రవరి 1 25 10 12 3 0 46.00
  ఐర్లాండ్ 2009 జూన్ 11 2022 నవంబరు 4 5 5 0 0 0 100.00
  కెన్యా 2007 సెప్టెంబరు 12 1 1 0 0 0 100.00
  నమీబియా 2021 నవంబరు 5 1 1 0 0 0 100.00
  నెదర్లాండ్స్ 2014 మార్చి 29 2022 ఆగస్టు 5 3 3 0 0 0 100.00
  పాకిస్తాన్ 2007 సెప్టెంబరు 22 2022 నవంబరు 9 29 11 18 0 0 37.93
  స్కాట్‌లాండ్ 2009 జూన్ 6 2022 జూలై 29 4 4 0 0 0 100.00
  దక్షిణాఫ్రికా 2005 అక్టోబరు 21 2017 ఫిబ్రవరి 17 15 4 11 0 0 26.66
  శ్రీలంక 2006 డిసెంబరు 22 2022 అక్టోబరు 29 20 11 7 1 1 60.52
  వెస్ట్ ఇండీస్ 2006 ఫిబ్రవరి 16 2022 ఆగస్టు 14 19 10 4 3 2 67.64
  జింబాబ్వే 2010 మే 4 2015 ఆగస్టు 9 6 6 0 0 0 100.00
Summary 2005 2023 185 94 78 9 4 53.24
Source: Cricinfo. Last updated: 2 March 2023

గమనికలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Games that did not have a result are not taken into consideration while calculating the result percentage. Ties are counted as half a win.

మూలాలు

మార్చు
  1. "ICC Members Countries". International Cricket Council (ICC). Archived from the original on 16 January 2013. Retrieved 14 April 2013.
  2. Frindall, Bill (2009). Ask Bearders. BBC Books. p. 163. ISBN 978-1-84607-880-4.
  3. "Records / Test matches / Team records / Results summary". ESPNcricinfo. Retrieved 10 September 2013.
  4. "Records / One-Day Internationals / Team records / Results summary". ESPNcricinfo. Retrieved 10 September 2013.
  5. "Records / Twenty20 Internationals / Team records / Results summary". ESPNcricinfo. Retrieved 10 September 2013.
  6. 6.0 6.1 "Records / New Zealand / Test matches / Result summary". ESPNcricinfo. Retrieved 10 September 2013.
  7. 7.0 7.1 "Records / New Zealand / One-Day Internationals / Result summary". ESPNcricinfo. Retrieved 10 September 2013.
  8. "Records / New Zealand / Twenty20 Internationals / Result summary". ESPNcricinfo. Retrieved 30 March 2013.