ప్రహ్లాద రామారావు

భారతీయ క్షిపణి శాస్త్రవేత్త

ప్రహ్లాద రామారావు భారతీయ క్షిపణి శాస్త్రవేత్త, డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి మాజీ వైస్ ఛాన్సలర్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ మాజీ డైరెక్టరు. భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆయన చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు.[1][2][3] 2015 లో భారత ప్రభుత్వం ఆయనను నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది.[4]

డా. ప్రహ్లాద రామారావు
జననం1947 ఫిబ్రవరి 5
బెంగళూరు
విద్యUVCE, IISc
వృత్తిక్షిపణి శాస్త్రవేత్త
క్రియాశీలక సంవత్సరాలు1971-2015
ప్రసిద్ధిక్షిపణి శాస్త్రం
పురస్కారాలుపద్మశ్రీ
UVCE లో ప్రహ్లాద రామారావు

జీవిత చరిత్ర

మార్చు

ప్రహ్లాద 1947 ఫిబ్రవరి 5 న బెంగళూరులో [5] [6] జన్మించాడు. అతను 1969లో బెంగుళూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (UVCE) నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.[7] ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి రాకెట్లు, క్షిపణి వ్యవస్థలు ప్రధాన సబ్జెక్టులుగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.[8][5][6] అతను హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీలో [9] తన పరిశోధనను కొనసాగించాడు, అక్కడి నుండి డాక్టరల్ డిగ్రీ (PhD) పొందాడు. [8] [5] అతను 1971 లో తన కెరీర్ మొదలుపెట్టి, తిరువనంతపురం లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), బెంగళూరు లోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE),[7] డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ) వంటి అనేక అంతరిక్ష, రక్షణ సంస్థలలో పనిచేసాడు. 1997 లో హైదరాబాదులో డిఆర్‌డిఎల్ డైరెక్టర్‌గా చేరి, 2005 వరకు ఆ పదవిలో కొనసాగాడు.[8][5][6] ఈ సమయంలో, అతను సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి (IGDMP) ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు.[5][6]

2005 లో ప్రహ్లాద, సంస్థ లోని ఏరోనాటికల్ క్లస్టర్ ఆఫ్ లేబొరేటరీస్‌కి చీఫ్ కంట్రోలరుగా అదనపు బాధ్యతతో చీఫ్ కంట్రోలర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌గా DRDO ప్రధాన కార్యాలయానికి మారాడు.[6] అతను 2011లో డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి వైస్ ఛాన్సలర్‌గా నియమితుడయ్యాడు.[7][10] 2015 ఫిబ్రవరిలో అతని పదవీ విరమణ వరకు అక్కడ పనిచేశాడు.[11] అతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఏరోస్పేస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో అనుబంధ ప్రొఫెసర్‌గా ఉన్నాడు.[8][6]

పదవులు

మార్చు

ప్రహ్లాద 2003-04లో హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇండియా - మై డ్రీమ్ పేరుతో ఒక సంవత్సరం సుదీర్ఘ ఉపన్యాస సిరీస్‌ని నిర్వహించాడు. ఇందులో భాగంగా ప్రముఖ వ్యక్తులు కీలక ఉపన్యాసాలు ఇచ్చేవారు.[8] అతను 2008, 2010 లలో రెండు సందర్భాలలో విపత్తు నిర్వహణపై ప్రపంచ కాంగ్రెస్ [12] అధ్యక్షుడిగా ఉన్నాడు.[8] ఇండియన్ సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ (ISAMPE), [13] ఇండియన్ సొసైటీ ఫర్ నాన్‌డ్‌స్ట్రక్టివ్ టెస్టింగ్ (ISNT),[14] ఇండియన్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ (INAE) హైదరాబాద్ అధ్యాయాలకు ఛైర్మన్ గా పనిచేసాడు. సొసైటీ ఫర్ ఏరోస్పేస్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీ [15] (SAQR) అధ్యక్షుడు.[8] [5] ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యుడు. ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ ఏరోడైనమిక్స్ ఆఫ్ ఇండియాకు మేనేజింగ్ ట్రస్టీ. [8] [5] అతను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) నేషనల్ కమిటీ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్, MHRD టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్స్టిట్యూషన్ మెకానిజం, సెక్టార్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) జాతీయ కమిటీ సభ్యుడు కూడా. ఇండియన్ స్ట్రాటజిక్ అనే సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్ [8] [5] సంపాదకీయ బోర్డులో సభ్యుడు.[7]

వారసత్వం

మార్చు
 
బ్రహ్మోస్ క్షిపణి
 
ఆకాష్ క్షిపణి

సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ప్రహ్లాద, భారతీయ అంతరిక్ష కార్యక్రమం కోసం రాకెట్ ప్రొపల్షన్, ఆన్‌బోర్డ్ ఏవియానిక్స్, క్షిపణి వ్యవస్థలు, రాడార్ సిస్టమ్స్, హైపర్‌సోనిక్ ఫ్లైట్ వెహికల్స్‌కు సంబంధించిన అనేక కీలక సాంకేతికతలను అభివృద్ధిలో తోడ్పడ్డాడు.[5][6] కాంపాక్ట్ యాంటెన్నా టెస్ట్ రేంజ్, స్ట్రక్చరల్ డైనమిక్ టెస్ట్ సెంటర్, సూపర్‌సోనిక్ రామ్‌జెట్ ఇంజన్ టెస్ట్ సదుపాయం, సబ్‌సోనిక్ రామ్‌జెట్ ఇంజిన్ టెస్ట్ సదుపాయం, 6 కాంపోనెంట్ రాకెట్ మోటార్ టెస్ట్ సౌకర్యం, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ టోమోగ్రఫీ, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సెంటర్, షాక్ ట్యూబ్ సౌకర్యం, హై టెంపరేచర్ మెటీరియల్ క్యారెక్టరైజేషన్ ఫెసిలిటీ, హై టెంపరేచర్ స్ట్రక్చరల్ టెస్టింగ్, ఇస్రో కోసం మిస్సైల్ సిస్టమ్ సిమ్యులేషన్ సెంటర్ వంటి వాటి స్థాపనకు కూడా అతను దోహదపడ్డాడు.[8][6] ఉపరితలం నుండి గాలి లోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ అయిన ఆకాశ్‌ క్షిపణి ప్రాజెక్టుకు అతను నేతృత్వం వహించాడు.[9] పృథ్వీ, అగ్ని, నాగ్ వంటి అనేక ఇతర భారతీయ క్షిపణి వ్యవస్థలకు ప్రధాన రూపకర్తగా పనిచేసాడు.[8][5][6]

ఇది ప్రహ్లాద డైరెక్టర్‌గా ఉన్న సమయంలో, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ నావికా అప్లికేషన్ కోసం ఆస్ట్రా ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్, లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించింది.[5] ప్రోగ్రాం డైరెక్టర్‌గా బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ, జలాంతర్గామి నుండి ప్రయోగించే సుదూర పరిధి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థకు ప్రాజెక్ట్ ఫార్ములేషన్, మేనేజ్‌మెంట్, ట్రయల్స్‌లో అతను పాల్గొన్నాడు.[8][6][9] 2006, 2008 లలో డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ పద్ధతుల సూత్రీకరణలో అతను తోడ్పడ్డాడు.[8] DRDOలో అతని పదవీకాలం కూడా FICCI సహాయంతో DRDO తన సాంకేతికతలను వాణిజ్యీకరించింది.[8][5] [6] డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (DIAT) వైస్ ఛాన్సలర్‌గా ఉండగా అతను కొత్తగా ఏర్పాటైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోసైన్స్ అండ్ టెక్నాలజీ క్రింద టెక్నాలజీ మేనేజ్‌మెంట్, బయోసైన్సెస్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ వంటి సబ్జెక్టులలో కోర్సులను ప్రవేశపెట్టడంలో పాత్ర వహించాడు.[8][5][9][10] అతని పదవీకాలంలో DIAT, క్యాటగిరీ యూనివర్సిటీగా పదోన్నతి పొందింది.[8]

పురస్కారాలు, గుర్తింపులు

మార్చు

ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్, సొసైటీ ఫర్ షాక్ వేవ్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, [16] సిస్టమ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, వంటి అనేక భారతీయ సంస్థలు, వృత్తిపరమైన సంస్థలలో ప్రహ్లాద సభ్యుడు.[17][8] 2006లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 2012 లో అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ లు ఆయనకు డాక్టరల్ పట్టా అందించాయి.[8][5][6] అతను DRDO సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్, HMA – మెంబర్ ఆఫ్ ది ఇయర్, IISc విశిష్ట పూర్వ విద్యార్ధి అవార్డు, శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు, హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వంటి పురస్కారాలు, గౌరవాలను అందుకున్నాడు.[8][5][6] అతను నేషనల్ ఏరోనాటికల్ ప్రైజ్, 2008 DRDO అవార్డు, ఎమినెంట్ ఇంజనీర్స్ అవార్డును కూడా అందుకున్నాడు. భారత ప్రభుత్వం 2015 లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది.[18][7]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "NIAS" (PDF). NIAS. 2015. Retrieved 1 March 2015.[permanent dead link]
  2. "IISc". Indian Institute of Science. 2015. Archived from the original on 2015-05-29. Retrieved 1 March 2015.
  3. "DRDO". DRDO. 2015. Retrieved 1 March 2015.
  4. "Padma Awards". Padma Awards. 2015. Archived from the original on 28 January 2015. Retrieved 16 February 2015.
  5. 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 5.13 5.14 "IISc". Indian Institute of Science. 2015. Archived from the original on 2015-05-29. Retrieved 1 March 2015.
  6. 6.00 6.01 6.02 6.03 6.04 6.05 6.06 6.07 6.08 6.09 6.10 6.11 6.12 "DRDO". DRDO. 2015. Retrieved 1 March 2015.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 "India Strategic". India Strategic. 2015. Archived from the original on 15 మార్చి 2015. Retrieved 1 March 2015.
  8. 8.00 8.01 8.02 8.03 8.04 8.05 8.06 8.07 8.08 8.09 8.10 8.11 8.12 8.13 8.14 8.15 8.16 8.17 8.18 "NIAS" (PDF). NIAS. 2015. Retrieved 1 March 2015.[permanent dead link]
  9. 9.0 9.1 9.2 9.3 "Prahlada takes over as DIAT Vice-Chancellor". The Hindu. 16 August 2011. Retrieved 29 December 2018.
  10. 10.0 10.1 "Press Infirmation Bureau". Press Infirmation Bureau. 11 August 2011. Retrieved 1 March 2015.
  11. "DIAT". DIAT. 2015. Retrieved 2 March 2015.
  12. "World Congress on Disaster Management". World Congress on Disaster Management. 2015. Retrieved 2 March 2015.
  13. "ISAMPE". ISAMPE. 2015. Archived from the original on 8 September 2013. Retrieved 2 March 2015.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  14. "ISNT". ISNT. 2015. Archived from the original on 2015-04-02. Retrieved 2 March 2015.
  15. "SAQR". SAQR. 2015. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 2 March 2015.
  16. "Astronautical Society of India". Astronautical Society of India. 2015. Retrieved 2 March 2015.
  17. "Systems Society of India". Systems Society of India. 2015. Retrieved 2 March 2015.
  18. "Padma Awards". Padma Awards. 2015. Archived from the original on 28 January 2015. Retrieved 16 February 2015.