ప్రాణం (సినిమా)
ప్రాణం మల్లి దర్శకత్వంలో పునర్జన్మల ప్రేమకథ నేపథ్యంగా 2003 లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో అల్లరి నరేష్, సదా ప్రధాన పాత్రల్లో నటించారు.[1] మాగంటి బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా కమలాకర్ సంగీత దర్శకత్వం వహించాడు.
ప్రాణం | |
---|---|
దర్శకత్వం | మల్లి |
రచన | సుబ్బారావు మాస్టర్ |
నిర్మాత | మాగంటి బాబు |
తారాగణం | అల్లరి నరేష్ సదా సీత రాజన్ పి. దేవ్ షఫి |
ఛాయాగ్రహణం | భరణి దరన్ |
కూర్పు | బస్వా పైడిరెడ్డి |
సంగీతం | కమలాకర్ |
పంపిణీదార్లు | GMRC |
విడుదల తేదీ | జూలై 25, 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుకోస్తా ప్రాంతంలోని ఓ కుగ్రామంలో శివుడు (అల్లరి నరేష్) ఒక తక్కువ కులానికి చెందిన వాడు. పాటలు బాగా పాడగలడు. నాటకాలు వేయగలడు. తన స్నేహ బృందంతో కలిసి ఎప్పుడూ సరదాగా తిరుగుతుంటాడు. కాత్యాయని (సదా) ఒక శుద్ధ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. అల్లరి పిల్ల. శివుడిలో కళను చూసి కాత్యాయని అతన్ని ప్రేమిస్తుంది. శివుడు కూడా గ్రామంలో ఉండే కులం కట్టుబాట్లు మరిచి ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఎవరికీ తెలియకుండా చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంటారు. సనాతన వాదియైన ఆమె తండ్రి, గ్రామం యొక్క పూజారి, ఎక్కువ కులం వాళ్ళు తక్కువ కులం వాడితో ప్రేమలో పడి గ్రామ కట్టుబాట్లు ఉల్లంఘించారనే నేరంతో వారిద్దరినీ ఆ గ్రామదేవత ఉన్న చెట్టుకు ఉరి తీస్తారు. శివుడి తల్లి నిస్సహాయం అలా చూస్తూ ఉండిపోతుంది. అలా మరణించిన వారిద్దరూ మళ్ళీ పుడతారు. కాత్యాయని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు (బెనర్జీ) చెల్లెలు ఉమగా జన్మిస్తే, శివుడు కాశీ అనే పేరుతో అమెరికాలో పెరిగిన ఓ అనాథగా జన్మిస్తాడు. కాశీ ఓ వీడియో ఆల్బం తయారు చేయడానికి భారతదేశానికి వస్తాడు. తన వీడియోకు కావలసిన అచ్చమైన తెలుగమ్మాయి కోసం వెతుకుతూ ఉమను కనుగొంటాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ ప్రేమలో పడతారు. కానీ ఆమె అన్న మాత్రం ఆమెను తన అక్క కొడుక్కిచ్చి (షఫీ) పెళ్ళి చేయాలని చేస్తుంటాడు.
ఉమ, కాశీ ఇద్దరూ వైజాగ్ నుంచి తప్పించుకుని ఆశ్చర్యంగా తమ పూర్వ జన్మలో గ్రామాన్ని చేరుకుంటారు. కొన్ని ఆధారాలను బట్టి ఆ ఊర్లో వాళ్ళు వాళ్ళను శివుడు, కాత్యాయనిగా గుర్తిస్తారు. అక్కడికి వచ్చిన తమ పెద్దలను ఎదిరించి ఉమ, కాశీ ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ.
తారాగణం
మార్చు- శివుడుగా అల్లరి నరేష్
- కాత్యాయనిగా సదా
- శివుడి తల్లిగా సీత
- బెనర్జీ
- రాజన్ పి. దేవ్
- రాళ్ళపల్లి
- నటశిక్షకుడిగా ఎం. ఎస్. నారాయణ
- కోవై సరళ
పాటలు
మార్చుఈ సినిమాకు కమలాకర్ సంగీత దర్శకత్వం వహించగా, సాయి శ్రీహర్ష, సుద్దాల అశోక్ తేజ, ఇ. ఎస్. మూర్తి పాటలు రాశారు. నిండు నూరేళ్ళ సావాసం అనే పాటతో గాయని గోపిక పూర్ణిమకు మంచి పేరు వచ్చింది.
పాట | గాయకులు | రచయితలు |
---|---|---|
నిండు నూరేళ్ళ సావాసం | సోనూ నిగం, మహాలక్ష్మి అయ్యర్ | సాయి శ్రీహర్ష |
సయ్యారి నా ఎంకి | బాలు | సాయి శ్రీహర్ష |
స్నేహమా స్వప్నమా | హరిహరన్, కె. ఎస్. చిత్ర | సాయి శ్రీహర్ష |
వాతాపి | కె. ఎస్. చిత్ర | ఇ. ఎస్. మూర్తి |
బ్రహ్మాండం | బాలు | సాయి శ్రీహర్ష |
నిండు నూరేళ్ళ – 2 | కమలాకర్, గోపిక పూర్ణిమ | సాయి శ్రీహర్ష |
ధిం ధిం ధిం | శంకర్ మహదేవన్, కల్పన | సుద్ధాల అశోక్ తేజ |
మూలాలు
మార్చు- ↑ భాష్యం, అజయ్. "ప్రాణం సినిమా సమీక్ష". movies.fullhyderabad.com. Archived from the original on 13 మే 2017. Retrieved 17 November 2016.