ప్రాణవాయు పట్టణ అటవీ పార్కు

తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలంలోని గాజులరామారంలో ఏర్పాటుచేసిన పార్

ప్రాణవాయు పట్టణ అటవీ పార్కు అనేది తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలంలోని గాజులరామారంలో ఏర్పాటుచేసిన పార్కు.[1] గాజులరామారంలోని 142 ఎక‌రాల విస్తీర్ణంలో 60 ఎకరాలలో 16 కోట్ల‌ రూపాయలతో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ హైదరాబాదు మహానగర పాటక సంస్థ ఈ పార్కును అభివృద్ధి చేసింది.[2]

ప్రాణవాయు పట్టణ అటవీ పార్కు
పార్కు ప్రవేశ ద్వారం
రకంపట్టణ పార్కు
స్థానంగాజులరామారం, కుత్బుల్లాపూర్‌ మండలం, మేడ్చల్ జిల్లా, తెలంగాణ
సమీప పట్టణంహైదరాబాదు
విస్తీర్ణంఎకరాలు
నవీకరణ2022
నిర్వహిస్తుందితెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ
స్థితివాడులో ఉంది

ప్రారంభం

మార్చు

2022 జనవరి 25న రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ పార్కును ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, కార్మిక శాఖామంత్రి సిహెచ్. మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంబీపూర్‌ రాజు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[3]

సదుపాయాలు

మార్చు

పార్కు ప్ర‌ధాన ద్వారంతోపాటు కంపౌండ్ వాల్‌పై జంతువుల ప్ర‌తిరూపాల‌ను చిత్రీక‌రించడంతోపాటు అక్కడక్కడ హంస‌, సింహం, పులి, జింక వంటి బొమ్మలను ఏర్పాటుచేశారు. వ‌న భోజ‌నాల‌కు వీలుగా న‌ర్స‌రీ, వాచ్ ట‌వ‌ర్, విశ్రాంతి గ‌దులతోపాటు ఇత‌ర స‌దుపాయాలు కల్పించబడ్డాయి.[4]

వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, వాష్ రూమ్స్, యోగ షెడ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, రెండు ఓపెన్ క్లాస్ రూలు, పిక్నిక్ ఏరియా, పాఠశాలలు-కళాశాలల నుంచి వచ్చే విద్యార్థులకు పార్కు ప్రత్యేకతను వివరించేలా ఓపెన్‌ క్లాస్‌ రూంలు, ఏర్పాటుచేయబడ్డాయి.[5]

మూలాలు

మార్చు
  1. telugu, NT News (2022-01-22). "హైద‌రాబాద్‌లో ప్రాణ‌వాయు అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్". www.ntnews.com. Archived from the original on 2022-01-22. Retrieved 2023-04-26.
  2. ABN (2022-01-30). "ప్రాణవాయు పార్కులు". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-04-26. Retrieved 2023-04-26.
  3. "Pranavayu Urban Forest Park to boost lung space". The New Indian Express. Archived from the original on 2022-01-25. Retrieved 2023-04-26.
  4. telugu, NT News (2021-11-01). "హైద‌రాబాద్‌లో త్వ‌ర‌లోనే ప్రాణ‌వాయు పార్కు ప్రారంభం". www.ntnews.com. Archived from the original on 2021-11-01. Retrieved 2023-04-26.
  5. krishna (2022-01-29). "జీవన ప్రమాణాలే లక్ష్యంగా పార్కుల ఏర్పాటు". Mana Telangana. Archived from the original on 2022-01-31. Retrieved 2023-04-26.