ప్రియాంక త్రివేది

ప్రియాంక త్రివేది (జననం 1977 నవంబరు 12) ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా కన్నడ భాషా చిత్రాలలో కనిపిస్తుంది. ఆమె కన్నడ దర్శకుడు, కథా రచయిత, నటుడు అయిన ఉపేంద్ర సతీమణి. ఆమె తమిళం, తెలుగు, బెంగాలీ, హిందీ సినిమాలలో కూడా నటించింది.

ప్రియాంక త్రివేది
2019లో ప్రియాంక ఉపేంద్ర
జననం (1977-11-12) 1977 నవంబరు 12 (వయసు 46)
వృత్తినటి, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1997–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలుఐశ్వర్య ఉపేంద్ర,
ఆయుష్ ఉపేంద్ర

2022లో ప్రియాంక ఉపేంద్ర టైటిల్‌ పాత్రతో తన 50వ చిత్రం డిటెక్టివ్‌ తీక్ష సినిమా ఏడు భాషల్లో రూపొందుతోంది.[1]

కెరీర్

మార్చు

ప్రియాంక త్రివేది కలకత్తాలో 1977 నవంబరు 12న జన్మించింది. ఆమె తల్లి పశ్చిమ బెంగాల్‌కు చెందినది, కాగా తండ్రి ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు. కోల్‌కతాలోని కళాశాల నుండి కామర్స్ పట్టా పొందింది. దీనికి ముందు ఆమె పాఠశాల విద్యను అమెరికాలో, సింగపూర్‌లో పూర్తిచేసింది. ఆమె 1990ల చివరలో బ్రిటానియా, ఓరియంట్ ఎలక్ట్రిక్, పిల్స్‌బరీ వంటి బ్రాండ్‌ల ప్రచారంలో భాగంగా టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో కనిపించింది. ఆ సమయంలో, ఆమెను దర్శకుడు బసు ఛటర్జీ తన మొదటి బెంగాలీ చిత్రం హోతాత్ బ్రిష్టి (1998) కోసం ఎంపిక చేశాడు.[2] ఆ తరువాత మరో రెండు సినిమాలు చుపి చుపి (2001), తక్ ఝల్ మిష్టి (2002) కూడా ఆయన దర్శకత్వంలో చేసింది.[3]

ఆ తరువాత ప్రియాంక త్రివేది బాలీవుడ్ లో అడుగుపెట్టి హిందీ చిత్రం ముఝే మేరీ బీవీ సే బచావో (2001)లో నటించింది. ఆమె నిర్మాతగా మారి తెలుగులో సూరి, రా చిత్రాలను నిర్మించింది. సూరిలో ఆమె జె. డి. చక్రవర్తితో పాటు ముఖ్య పాత్రల్లో నటించింది. దీన్ని హిందీలో దుర్గాగా రీమేక్ చేసారు. ఆమె కన్నడలో H2O, కోటిగొబ్బ చిత్రాలు; తమిళంలో రాజియం, రాజా, కాదల్ సడుగుడు, జననం చిత్రాలలో నటించింది.[3]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర(లు) భాష(లు) గమనికలు రెఫ్(లు)
1997 జోద్ధ బెంగాలీ
1998 హోతత్ బ్రిష్టి దీప బెంగాలీ
రాక్టర్ దోషే బెంగాలీ
బడా దిన్ హిందీ
1999 సౌతేలా హిందీ
కథా కహిబ మో మాత సిందూరా పింకీ ఒడియా
2001 ముఝే మేరీ బీవీ సే బచావో సోనియా మల్కానీ హిందీ
చూపి చూపి బెంగాలీ
సూరి గాయత్రి తెలుగు తెలుగు సినిమా
రా శాంతి తెలుగు తెలుగు సినిమా
కోటిగొబ్బా ప్రియా కన్నడ
2002 H2O కావేరి కన్నడ ప్రియాంక ఉపేంద్రగా గుర్తింపు పొందింది
దుర్గ గాయత్రి హిందీ
రాజ్జియం అనురాధ తమిళం
సతి సోనాలి బెంగాలీ
రాజా ప్రియా తమిళం
తక్ ఝల్ మిష్టి దీపాంతిక బెంగాలీ
గురు మహాగురువు హిందీ
2003 కాదల్ సడుగుడు కౌసల్య తమిళం
ఐస్ అంజలి తమిళం
సంగీ రూపా బెంగాలీ
2004 రౌడీ అలియా రాణి కన్నడ
మల్లా ప్రియా కన్నడ
జననం శృతి తమిళం
2006 అగ్నిపరీక్ష కబితా బెంగాలీ
2008 అమర్ ప్రతిజ్ఞ రినా సేన్ బెంగాలీ
గోల్‌మాల్ చాందిని బెంగాలీ
2009 అపరాధి నందిని బెంగాలీ
2010 పంచరంగి ఆమెనే కన్నడ
2011 శ్రీమతి ప్రియా కన్నడ
నమస్కారం మెమ్సాహెబ్ మితా బెంగాలీ
2013 ఎనిమీ ఏకలవ్య భార్య హిందీ
2014 క్రేజీ స్టార్ రవి భార్య కన్నడ
2015 ఉప్పి 2 ఆమెనే కన్నడ నిర్మాత కూడా
2016 ప్రియాంక ప్రియాంక కన్నడ
మమ్మీ ప్రియా కన్నడ
2018 2వ హాఫ్ అనురాధ కన్నడ
2019 దేవకి దేవకి కన్నడ
2021 1980 ప్రియా కన్నడ ప్రత్యక్ష OTT విడుదల - నమ్మ ఫ్లిక్స్
2023 మాస్టర్ అన్షుమాన్ మాధబి సేన్ బెంగాలీ
2023 డిటెక్టివ్ తీక్షణ తీక్షణ కన్నడ ప్రియాంక ఉపేంద్ర 50వ సినిమా

మూలాలు

మార్చు
  1. "తెరపైకి డిటెక్టివ్‌ తీక్ష". web.archive.org. 2022-11-26. Archived from the original on 2022-11-26. Retrieved 2022-11-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Priyanka Upendra remembers her mentor Basu Chatterjee - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 14 December 2020.
  3. 3.0 3.1 Srinivasa, Srikanth (21 September 2003). "Sandalwood calling". Deccan Herald. Archived from the original on 13 April 2005. Retrieved 23 September 2020.