ప్రేమంటే ఇంతే
ప్రేమంటే ఇంతే 2006 ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు రొమాంటిక్ చలనచిత్రం.[1] శ్రీ స్రవంతి మూవీస్పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మాణ సారథ్యంలో రమణ బివి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, పూనమ్ బజ్వా, రూపాలి నటించగా, కోటి సంగీతం అందించాడు. ఇది హిందీ చిత్రం సోచా నా థా సినిమా రీమేక్.[2][3]
ప్రేమంటే ఇంతే | |
---|---|
దర్శకత్వం | రమణ బివి |
నిర్మాత | స్రవంతి రవికిషోర్ |
తారాగణం | నవదీప్ పూనమ్ బజ్వా రూపాలి |
ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 14 ఏప్రిల్ 2006 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా నేపథ్యం
మార్చువీరు (నవదీప్) లిజీ (రూపాలి)ని ప్రేమిస్తుంటాడు. కానీ, ఆ ప్రేమ విషయం చెప్పడానికి అతనికి ధైర్యం లేదు. అదే సమయంలో పావని ( పూనమ్ బజ్వా ) ను వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. కానీ ఆమెకు కూడా వివాహం ఇష్టం ఉండదు. కాబట్టి వీరు, పావని కలిసి పథకం వేసి పెళ్ళి చెడగొడుతారు. దాంతో ఇరు కుటుంబాల మధ్య కొంత గొడవ జరుగుతుంది. ఆ తరువాత వీరు, పావని మంచి స్నేహితులు అవుతారు. అప్పుడు తన ప్రేమ విషయాన్ని లిజీకి చెపుతాడు. ఆమె క్రైస్తవ కుటుంబానికి చెందినది కావడంతో మొదట్లో అతని కుటుంబం వీరి ప్రేమను వ్యతిరేకిస్తుంది. చివరికి వారు కూడా వివాహానికి అంగీకరిస్తారు. కానీ వివాహం రోజున, తాను నిజంగా పావనిని ప్రేమిస్తున్నానని వీరు తెలుసుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందన్నది మిగతా కథ.[4]
నటవర్గం
మార్చు- నవదీప్ (వీరు)
- పూనమ్ బజ్వా (పావని)
- జాకీ
- రూపాలి (లిజీ)
- నరేష్
- శరత్ బాబు
- అన్నపూర్ణ
- ఐశ్వర్య
- సత్య కృష్ణన్
పాటలు
మార్చుఈ చిత్రానికి కోటి సంగీతం అందించాడు.[5][6][7]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "ప్రేమంటే ఇంతే" | హేమచంద్ర, చైత్ర హెచ్.జి | 4:44 |
2. | "మనసుని కొంచెం" | దేవన్, అనుపమ దేశ్ పాండే | |
3. | "నీ మౌనం" | సందీప్, చైత్ర హెచ్.జి | |
4. | "నిదురలో నీవెంటే" | సందీప్ | |
5. | "ముందే ముడిపడి" | హేమచంద్ర, చైత్ర హెచ్.జి |
మూలాలు
మార్చు- ↑ "Premante Inthe movie overview, wiki, cast and crew, reviews". filmytoday.com. Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
- ↑ "Premante Inthe (2006)". FilmiBeat. Retrieved 29 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Premante Inthe (2006) Cast - Actor, Actress, Director, Producer, Music Director". Cinestaan. Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
- ↑ "Premante Inthe review. Premante Inthe Telugu movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 29 April 2021.
- ↑ "JioSaavn". www.jiosaavn.com. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 29 April 2021.
- ↑ "premante-inthe". www.gaana.com. Retrieved 29 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Premante Inthe Songs Download". Naa Songs. 2015-11-17. Retrieved 29 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)