ప్రేమకానుక
"ప్రేమకానుక" తెలుగు చలన చిత్రం,1969 సెప్టెంబర్ 11 న విడుదల.పి.శోభనాద్రిరావు దర్శకత్వంలో హరనాథ్ రాజు, విజయనిర్మల,జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం , టి.చలపతిరావు అందించారు.
ప్రేమకానుక (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శోభనాద్రిరావు |
---|---|
తారాగణం | హరనాధ్, విజయనిర్మల |
నిర్మాణ సంస్థ | ది.సిటడెల్ స్టూడియో |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- సంగీతం: టి.చలపతిరావు
- కథ, మాటలు: జూనియర్ సముద్రాల
- పాటలు: సి.నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు, జూనియర్ సముద్రాల
- ఛాయాగ్రహణం: ఎం.కె.రాజు
- కూర్పు: శ్రీహరి
- కళ: చలం
- నృత్యాలు: హీరాలాల్, చిన్న సంపత్
- దర్శకత్వం: శోభనాద్రిరావు
- నిర్మాతలు: జయశంకర్, రత్నం
సంక్షిప్త కథ
మార్చుప్రసాద్ (హరనాథ్) లలిత (విజయనిర్మల) ప్రేమించుకుంటారు. పై చదువులకై ప్రసాద్ అమెరికా వెళ్తాడు. లలిత గర్భవతి ఔతుంది. ప్రసాద్ అమెరికా నుంచి లలితకు వ్రాసే ఉత్తరాలు అతని తండ్రి (మిక్కిలినేని) లలితకివ్వకుండా చించివేస్తుంటాడు. లలితకు కొడుకు పుడ్తాడు. లలిత ఇరుగూపొరుగుకు కుట్టుపనులు నేర్పిస్తూ, కుటుంబం నిర్వహిస్తుంటుంది. ప్రసాద్ అమెరికానుంచి ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు, ప్రసాద్ తండ్రి ప్రసాద్ కు లలిత, మధుల (రామకృష్ణ) అక్రమసంబంధ ఫలితమే ఆమె సంతానమని చెప్పి ప్రసాద్ మనసు విరుస్తాడు. మధు వచ్చి ప్రసాద్ ను కలిసి అసలేమి జరిగిందో చెప్తాడు. ఇద్దరూ కలిసి లలిత ఇంటికి వెళ్తారు. ఆమెను ప్రసాద్ తండ్రి అపరిహించి, ప్రసాద్ పెళ్ళికి ఆడ్డురావద్దని, ఊరువిడిచి వెళ్ళాలని హెచ్చరిస్తాడు. ప్రసాద్, మధు లలిత ఉన్న చోటుకి చేరుకుంటారు. అక్కడ జరిగిన ఘర్షణలో ప్రసాద్ తండ్రి జరిపిన తుపాకి కాల్పులో మధు చనిపోతాడు. ప్రసాద్ కు లలితకు తను చేసిన అన్యాయం తెలిసొస్తుంది. అపోహలు తొలుగుతాయి. లలిత ప్రసాద్ ల వివాహం జరుగుతుంది.
పాటలు
మార్చు- ఇదే నా కానుక నవదంపతులకు నా కానుక - ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
- ఏటి దాపుల తోట లోపల తేటతేనియలొలుకు పలుకులు - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- ఒక్క చెలి చూచిన చూపే నవ్విన నవ్వే జీవితమంతా - పి.బి. శ్రీనివాస్ బృందం - రచన: దాశరథి
- ఒకటే కోరిక ఒకటే వేడుక నా మనసులోని మధుర - పి.సుశీల, టి.ఆర్. జయదేవ్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
- ఓ..పడచు సిగ్గుల చినవాడా పక్కచూపుల పసివాడా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సి.నారాయణరెడ్డి
- చిన్నదాని చూసి కనుసైగ చేసి మనసంతా దోచి మాయచేసి - ఎస్. జానకి - రచన: దాశరధి
- నిదురపో నిదురపో నిదురలో నీ నవ్వులు పువ్వుల - టి.ఆర్. జయదేవ్ - రచన: టి. చలపతిరావు
- సుబ్బీ నా సుబ్బీ మన దెబ్బ చూడవే సుబ్బీ నా - మాధవపెద్ది, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
బయటి లింకులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)