ప్రేమ 1952, మార్చి 21న విడుదలైన తెలుగు సినిమా. భరణీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించబడిన ఈ సినిమాకు పి.భానుమతి కథను సమకూర్చింది. ఇదే సినిమా తమిళంలో కాదల్ పేరుతో విడుదలయ్యింది.

ప్రేమ
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎస్.రామకృష్ణారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
పి.భానుమతి
సంగీతం సి.ఆర్.సుబ్బరామన్
నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ మార్చు

రాజా అనే ధనిక యువకుడు, మోతీ అనే లంబాడీ పిల్ల పరస్పరం ప్రేమించుకుంటారు. మోతీని పరశురాం అనే లంబాడీ యువకుడు, రాజాను లత అనే ధనిక యువతి ప్రేమిస్తారు. దానితో రాజా మోతీల ప్రేమవాహినిలో కల్లోలం చెలరేగుతుంది. లత ప్రేమకు అడ్డు రాకుండా ఉండేందుకు మోతీ రాజాను విడిచి వెళ్లిపోతుంది. రాజా మోతీని వెంబడిస్తాడు. రాజాపై పగబట్టిన పరశురాం అతని మీదకు బాకు విసురుతాడు. అది ప్రమాదవశాత్తు మోతీకి తగిలి ఆమె మరణిస్తుంది. కథ దుఃఖాంతమవుతుంది[1].

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

 • ఆగవోయి మారాజా పిలిచినానోయి వలచినానోయి - పి.భానుమతి బృందం
 • ఈ లోకమంతా నీలీల దేవా నీ న్యాయమింతేనా - పి. భానుమతి
 • ఓహో ఇదిగదా వియోగి ఇదికదా కలలు నిజములైపోయె గదా - ఎ.పి.కోమల
 • ఓ ఓ ఓ హాయిగా ఓ ఓ ఓ తీయగా ఓ ఓ ఓ పాడనా అనురాగాల - పి. భానుమతి
 • దివ్య ప్రేమకు సాటి ఔ నే స్వర్గమే ఐనా - ఘంటసాల ,పి. భానుమతి , రచన: గోపాల రాయ శర్మ
 • నా ప్రేమ నావ ఈరీతిగా నడియేటి పాలైపోయెనే దరి చక్కగా - ఘంటసాల, భానుమతి, రచన: గోపాల రాయ శర్మ
 • నీతిలేని లోకమా వలపే మహా అపరాధమా మగవారి మాటలు - పి. భానుమతి
 • ప్రపంచమంతా ఝాటా ఏనాటికిదే మాట ఈ రోజులలో వంచనకే కదా - పిఠాపురం
 • పెళ్ళియంట మా పెళ్ళియంట ఈ రాజారాణి పెళ్ళేపెళ్ళి పెత్తనము - పి.భానుమతి
 • ప్రియునిబాసి బ్రతుకే భారమైపోయేనేమో ప్రేమ సుమమే వాడిపోయి - పి. భానుమతి
 • మహిళల రాజ్యము మంచిమంచి రాజ్యము బోలోజి బోలియే జై జైజై - రేలంగి బృందం
 • ముంత పెరుగోయి బాబు ముంతపెరుగండి - రావు బాలసరస్వతీదేవి,రేలంగి,కె.శివరావు
 • రోజుకు రోజు మరింత మోజు ప్రేమ డింగ్ డాంగ్ బెల్ - ఘంటసాల,పి.భానుమతి , రచన: గోపాల రాయ శర్మ
 • హాయీ జీవితమే హాయిలే జగమే ప్రేమసీమైపోతే హాయీ జీవనమే - పి.భానుమతి
 • ఓహో రాజా రావో రాజా అందాల చందాల రాజా - పి.భానుమతి
 • ఓహో ఇదిగదా బ్యూటి యిదిగదా కలలు నిజములైపోయే -
 • తళ తళ తళుక్ తళ తళ తళుక్ తళుకుల మిటారి ప్రపంచం -

మూలాలు మార్చు

 1. సంపాదకుడు (30 March 1952). "భరణీ వారి "ప్రేమ"". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 38 సంచిక 352. Retrieved 14 February 2018.[permanent dead link]

బయటి లింకులు మార్చు