ఫరియా అబ్దుల్లా

ఫరియా అబ్దుల్లా తెలుగు సినిమా నటి. 2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది.[1]'నక్షత్ర' అనే వెబ్ సిరీస్‌లో నటించింది.[2]

ఫరియా అబ్దుల్లా

వ్యక్తిగత వివరాలు

జననం మే 28, 1998
బంజారాహిల్స్, హైదరాబాద్
జాతీయత భారతీయురాలు
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం ముస్లిం

జీవిత విశేషాలుసవరించు

ఫరియా అబ్దుల్లా 1998, మే 28న హైదరాబాదులోని బంజారాహిల్స్ లో జన్మించింది. తండ్రి సంజయ్ అబ్దుల్లా, తల్లి కౌసర్ సుల్తానా. ఆమె తన పదవ తరగతి వరకు మెరిడియాన్ & భవనస్ లో పూర్తి చేసింది. హైదరాబాదు లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతుంది.[3]

సినిమారంగంసవరించు

2021లో వచ్చిన జాతిరత్నాలు సినిమాలో తొలిసారిగా నటించింది.

నటించిన సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ (27 March 2021). "హైదరాబాదీ 'చిట్టి'గుమ్మ". Namasthe Telangana. Archived from the original on 31 March 2021. Retrieved 31 March 2021.
  2. Andhrajyothi (26 April 2021). "ఓపెనింగ్స్‌తోనే బాగా సంపాదిస్తోందా..?". Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.
  3. news18 telugu (30 March 2021). "Faria Abdullah: క్యూట్ స్మైల్‌తో కుర్రాళ్ల ప్రాణాలు తీస్తోన్న జాతిర‌త్నాలు బ్యూటీ". News18 Telugu. Archived from the original on 31 March 2021. Retrieved 31 March 2021.