జాతిరత్నాలు (2021 సినిమా)

జాతిరత్నాలు, 2021 మార్చి 11న విడుదలైన తెలుగు కామెడీ సినిమా.[4] స్వప్న సినిమా బ్యానరులో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకి కె.వి. అనుదీప్ దర్శకత్వం వహించాడు. ఇందులో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, మురళి శర్మ, నరేష్ తదితరులు నటించగా, రధన్ సంగీతం అందించాడు. ముగ్గురు హ్యాపీ-గో-లక్కీ యువకుల చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో రూపొందించబడిన ఈ సినిమా మంచి సమీక్షలను అందుకుంది, సినిమాలోని కామెడీతో, ముఖ్య నటుల నటనతో ప్రసంశలు పొందింది.

జాతిరత్నాలు
జాతిరత్నాలు సినిమా పోస్టర్
దర్శకత్వంఅనుదీప్ కెవి
రచనకె.వి. అనుదీప్
నిర్మాతనాగ్ అశ్విన్
తారాగణంనవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, మురళి శర్మ, నరేష్
ఛాయాగ్రహణంసిద్ధం మనోహర్
కూర్పుఅభినవ్ రెడ్డి దండ
సంగీతంరధన్
నిర్మాణ
సంస్థ
స్వప్న సినిమా
విడుదల తేదీs
11 మార్చి, 2021[1]
సినిమా నిడివి
148 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్రూ. 4 కోట్లు[2]
బాక్సాఫీసుఅంచనా రూ. 75 కోట్లు (13 రోజులు)[3]

నటవర్గం మార్చు

కథ మార్చు

జోగిపేట టౌన్‌లో శ్రీకాంత్‌ (నవీన్‌ పొలిశెట్టి) తన నాన్న (తనికెళ్ళ భరణి) తో కలిసి లేడీస్‌ ఎంపోరియమ్‌ నడిపిస్తుంటాడు. తన ఇద్దరు మిత్రులు శివ(రాహుల్‌ రామకృష్ణ), శేఖర్‌ (ప్రియదర్శి)తో కలిసి అల్లరిచిల్లర పనులతో సరదాగా కాలం గడుపుతుంటాడు. సొంత ఊళ్లో లేడీస్‌ ఎంపోరియమ్‌ నడపటం అవమానంగా భావించి హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగం వెతుక్కొని స్థిరపడాలనుకుంటాడు. ఉద్యోగ వేటలో హైదరాబాద్‌కు వచ్చిన ముగ్గురు మిత్రులు మంత్రి చాణక్య(మురళీ శర్మ)పై జరిగిన హత్యాయత్నంలో చిక్కుకొని అరెస్ట్‌ అవుతారు. ఈ కేసు నుంచి వారు ఎలా భయటపడ్డారు? వీరికి చిట్టి (ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సహాయం చేసింది? ఆ ముగ్గురూ ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా సినిమా కథ.[5]

నిర్మాణం మార్చు

2019, అక్టోబరులో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన చేసి నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని, నాగ్ అశ్విన్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడని తెలియజేసారు.[6][7][8]

పాటలు మార్చు

2015లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి సంగీతం సమకూర్చిన రధన్, ఈ సినిమాకి కూడా సంగీతం సమకూర్చాడు. రామజోగయ్య శాస్త్రి రాయగా, రామ్ మిరియాల పాడిన చిట్టి సాంగ్ పాట 2021, జనవరి 29న విడుదలయింది. కాసర్ల శ్యామ్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్ పాడిన మన జాతి రత్నాలు పాట2021, ఫిబ్రవరి 19న విడుదలయింది.[9][10]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."చిట్టి సాంగ్"రామజోగయ్య శాస్త్రిరామ్ మిరియాల3:06
2."మన జాతి రత్నాలు"కాసర్ల శ్యామ్రాహుల్ సిప్లిగంజ్4:16
3."చెంచల్ గూడా జైల్ లో"కాసర్ల శ్యామ్యోగి శేఖర్2:46
మొత్తం నిడివి:10:08

స్పందన మార్చు

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకి చెందిన నీషిత న్యాపతి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చింది. ఇది సిల్లీ ఫూల్స్ నటించిన పిచ్చి కామెడీ సినిమా. కామెడీ, నటన కోసం దీనిని చూడొచ్చు" అని అని పేర్కొన్నది.[11] ఫస్ట్ పోస్ట్ కు చెందిన హేమంత్ కుమార్ ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చాడు. సినిమా స్క్రిప్ట్ మొత్తం ఫన్నీ హాస్యోక్తులతో నిండిపోయింది. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రామకృష్ణ కామెడీ టైమింగ్‌ బాగుంది అని రాశాడు.[12] "ఈ సినిమా నాన్సెన్సికల్ లాఫ్ అల్లర్, ప్రధాన తారాగణం నటన, చివర్లో న్యాయస్థాన దృశ్యాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి అని ది హిందూ పత్రికకి చెందిన సంగీత దేవి దుండూ పెన్నింగ్ పేర్కొన్నది.[13] "ఈ సినిమాలోని ప్రతి డైలాగ్ నవ్విస్తుంది. నవీన్ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్స్ కు, కెమిస్ట్రీకి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కెమిస్ట్రీ అద్భుతంగా పనిచేసింది. ఈ చిత్రం చాలాకాలం తరువాత టాలీవుడ్ లో వచ్చిన అత్యుత్తమ హాస్యపాత్రలలో ఒకటిగా నిలిచింది" అని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికకు చెందిన గబ్బేట రంజిత్ కుమార్ పేర్కొన్నాడు.[14]

బాక్సాఫీస్ మార్చు

ఈ సినిమా తొలిరోజు రూ. 5 కోట్లు వసూలు చేసింది.[15] రెండవ రోజు రూ 6.5 కోట్ల షేర్ ను అందుకుంది.[16] ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయల గ్రాస్ ను తీసుకుంది. యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రారంభ వారాంతంలో $470,000 వసూలు చేసింది.[17]

మూలాలు మార్చు

 1. Jeevi. "Jathi Ratnalu review". Idlebrain.com. Retrieved 24 March 2021.
 2. "Jathi Ratnalu Day 4 Collections: Naveen Polishetty Movie Creates All Time Industry Record". Sakshi Post. 15 March 2021. Retrieved 24 March 2021.
 3. "Jathi Ratnalu Day 13 Collections: Naveen Polishetty Film Beats Baahubali, Maharshi". Sakshi Post. 24 March 2021.
 4. "'Jathi Ratnalu' Trailer: Naveen Polishetty starrer is a hilarious entertainer". Times of India. 4 March 2021. Retrieved 11 March 2021.
 5. Eenadu (11 March 2021). "రివ్యూ: జాతి రత్నాలు". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
 6. "Naveen Polishetty, Rahul Ramakrishna and Priyadarshi are 'Jathi Ratnalu'". The Times of India. 2019-10-24. Retrieved 11 March 2021.
 7. "'Mahanati' director Nag Ashwin turns producer". The Hindu. 2019-10-24. Retrieved 11 March 2021.
 8. "First look poster of Naveen Polishetty starrer Telugu film 'Jathi Ratnalu' out!". The Statesman. 24 October 2019.
 9. "Mana JathiRatnalu song info". Gaana. Retrieved 11 March 2021.[permanent dead link]
 10. "Chitti song info". Gaana. Retrieved 11 March 2021.[permanent dead link]
 11. Nyayapati, Neeshita (11 March 2021). "Jathi Ratnalu Movie Review: A madcap comedy featuring 'silly fools'". Times of India.
 12. Kumar, Hemanth (11 March 2021). "Jathi Ratnalu movie review: Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna dazzle in an unapologetic madcap entertainer". Firstpost.
 13. Dundoo, Sangeetha Devi (11 March 2021). "'Jathi Ratnalu' movie review: Nonsensical laugh riot". The Hindu.
 14. Ranjith Kumar, Gabbeta (11 March 2021). "Jathi Ratnalu movie review: Naveen Polishetty film is one of the finest comedies of the year". The Indian Express. Retrieved 24 March 2021.
 15. "Telugu film 'Jathi Ratnalu' adds to south India's movie recovery". mint. 13 March 2021. Retrieved 24 March 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 16. "Jathi Rathnalu Second Day Collection: Naveen Polishetty Movie Unstopabble At Box Office". Sakhi Post. 13 March 2021. Retrieved 24 March 2021.
 17. "Domestic 2021 Weekend 11". Box Office Mojo. Retrieved 24 March 2021.

బయటి లంకెలు మార్చు