బందోబస్త్‌ 2019లో విడుదలైన తమిళ సినిమా 'కాప్పాన్' తెలుగులో 'బందోబస్త్' పేరుతో విడుదల చేశారు.[1] లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లి రాజా సుభాష్ కరణ్ నిర్మించిన ఈ సినిమాకు కె.వి. ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. సూర్య, మోహన్‌లాల్‌, సయ్యేషా, ఆర్య, బొమన్‌ ఇరాని, చిరాగ్‌ జాని, సముద్రఖని, పూర్ణ, తలైవాసల్‌ విజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 20, 2019న విడుదలైంది.

బందోబస్త్‌
దర్శకత్వంకె.వి.ఆనంద్‌
రచనపట్టుకొట్టై ప్రభాకర్
స్క్రీన్ ప్లేకె.వి.ఆనంద్‌
పట్టుకొట్టై ప్రభాకర్
కథకె.వి.ఆనంద్‌
పట్టుకొట్టై ప్రభాకర్
నిర్మాతఅల్లి రాజా సుభాష్ కరణ్
ఛాయాగ్రహణంఎం.ఎస్‌. ప్రభు
అబినందన్ రామానుజన్
కూర్పుఆంథోనీ
సంగీతంహ్యారిస్ జైరాజ్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
20 సెప్టెంబర్‌ 2019
సినిమా నిడివి
163 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

భారత ప్రధాని అయిన చంద్రకాంత్ వర్మ( మోహన్ లాల్) ఇంగ్లాండ్ పర్యటనకు వెళతాడు. అక్కడ ఆయన మీద జరిగిన దాడి నుండి రక్షించిన మిలిటరీ ఆఫీసర్ రవి ట్రాక్ రికార్డ్ నచ్చి అతన్ని తన సెక్యూరిటీ వింగ్ ఎస్పీజీకి హెడ్‌గా నియమించుకుంటాడు. ప్రధానిని చంపాలనుకున్న ఓ టెర్రరిస్ట్ పథకం ప్రకారం కాశ్మీర్ లో ప్రధాని చంద్రకాంత్ చంపేస్తారు. దాంతో దాన్ని కారణంగా చూపి రవిని ఎస్పీజీ నుండి సస్పెండ్ చేస్తారు. అస‌లు ప్ర‌ధాని చంద్రకాంత్‌ను చంపిందెవరు? ఎందుకు చంపుతారు? వారి ప‌థ‌క‌మేంటి? వాళ్ళని రవి ఎలా కనిపెట్టాడు? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: లైకా ప్రొడక్షన్స్‌
  • నిర్మాత: అల్లి రాజా సుభాష్ కరణ్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.వి.ఆనంద్‌
  • సంగీతం: హ్యారిస్ జైరాజ్
  • సినిమాటోగ్రఫీ:ఎం.ఎస్‌. ప్రభు

మూలాలు మార్చు

  1. The Times of India (28 June 2019). "Suriya's 'Kaappaan' renamed as 'Bandobast' in Telugu - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  2. Zee News Telugu (20 September 2019). "'బందోబస్త్' జబర్దస్త్; మూవీ రివ్యూ మీ కోసం". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  3. News18 Telugu (20 September 2019). "రివ్యూ: బందోబస్త్.. యావరేజ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్." Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)