రవివర్మ పోతేదార్
రవివర్మ పోతేదార్ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు, ఒక సంగీత దర్శకుడు. పాటల రచయితగా, నటుడిగా, వ్యాఖ్యాతగా పనిచేసిన రవివర్మ చిత్రం సినిమాలో తొలిసారిగా ఢిల్లీ నుంచి గల్లీ దాక అనే పాటతో సినిమారంగానికి పరిచయమై ఇప్పటివరకు 200పైగా తెలుగు సినిమాల్లో పాటలు పాడాడు.[1]
రవివర్మ పోతేదార్ | |
---|---|
జననం | 1978 జూన్ 10 |
మూలం | దుద్యాల్, కొడంగల్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం |
వృత్తి | నేపథ్య గాయకుడు |
వాయిద్యాలు | గాత్రం |
క్రియాశీల కాలం | 2000 - ఇప్పటివరకు |
జననం
మార్చురవివర్మ 1978, జూన్ 10న నారాయణాచారి, సరోజినమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లా, కొడంగల్ మండలం, దుద్యాల్ గ్రామంలో జన్మించాడు.[2]
సినిమారంగ ప్రస్థానం
మార్చుచిన్నప్పటి నుండి పాటలు పాడడంపై అసక్తివున్న రవివర్మ గాయకుడిగా ఎదగాలని కలలు కనేవాడు. తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమాలో తొలిసారిగా ఢిల్లీ నుంచి గల్లీ దాక అనే పాటను పాడాడు.
పాడిన పాటలు
మార్చు- ఢిల్లీ నుంచి గల్లి దాకా - (చిత్రం)
- చెలియా చెలియా - (ఇడియట్)
- నూజీవీడు సోనియా (అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు)
- ఓ మై బ్రదర్ (ఆర్య)
- బండి బండి రైలు బండి (జయం)
- మా మా మాస్ (మాస్)
- చుమ్మా చమ్మా దే చుమ్మా (అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి)
- స్టైల్ స్టైల్ (స్టైల్)
- ఓ మనసా ఓ మనసా (భద్ర)
- రుక్మిణి రుక్మిణి (అల్లరి రాముడు - 2002)
- అమ్మాది యమ్మారే యమ్మ యమ్మారే (వీడే)
- పిలిచిన పలకదు ప్రేమ (సత్యం)
- మాస్కా మేరీ జాన్ (మస్కా)
- అడదానికి ఆస్తులంటే (ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు - 2004)
- గోలా గోలా రంగోలా (అశోక్)
- అట్టాంటోడే ఇట్టాంటోడే (దేశముదురు)
- గోరువంక గోదారివంక (కబడ్డీ కబడ్డీ)
- సై సై మోనాలిసా (వీర కన్నడిగ)
- అయ్యా బాబోయి (నువ్వు నేను)
- గోల్డ్ రంగు పెదవులు (శివమణి)
- ఓ కిస్ ఇస్తావా (అల్లరి)
- ఓరోరి దేవుడా (143)
సంగీతం వహించిన చిత్రాలు
మార్చు- 6 (సిక్స్) (2012) - జగపతి బాబు, గాయత్రి
- సరదాగా అమ్మాయితో (2013) - వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్[3]
- అర్థనారి (2016) - అర్జున్ యజత్, అంజనా మీనన్
బహుమతులు
మార్చు- అలాపన మ్యూజిక్ అవార్డు - ఢిల్లీ నుంచి గల్లీదాక (చిత్రం)
- వంశీ స్పెషల్ జ్యూరీ అవార్డు (2004)- ఓ మై బ్రదరూ (ఆర్య)
- సంగమం సుశీల యూత్ అవార్డు (2006)
- సినిగోర్ అవార్డు - మస్కా (2008)
- ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ - రెడ్ అలెర్టు (2015)
మూలాలు
మార్చు- ↑ ప్రజాశక్తి (11 June 2016). "మాస్ + క్లాస్ పాటగాడు". గంగాధర్ వీర్ల. Archived from the original on 15 January 2019. Retrieved 15 January 2019.
- ↑ తెలంగాణ గళాలు బ్లాగు, తెలంగాణ గళాలు. "రవి వర్మ (సినీ గాయకులు)". www.telanganagalalu.blogspot.com. Archived from the original on 15 January 2019. Retrieved 15 January 2019.
- ↑ విశాలాంధ్ర (6 May 2013). "'సరదాగా అమ్మాయితో' ఆడియో". Archived from the original on 15 January 2019. Retrieved 15 January 2019.