బనిహాల్ ఖాజీగుండ్ రహదారి సొరంగం

జమ్మూ కాశ్మీరులో జాతీయ రహదారి 44 పై ఉన్న రహదారి సొరంగం

బనిహాల్ ఖాజీగుండ్ రహదారి సొరంగం, సముద్ర మట్టం నుండి 1,790 మీ. (5,870 అ.) ఎత్తున ఉన్న రోడ్డు సొరంగం. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో, దిగువ హిమాలయాల్లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణిలోని బనిహాల్ కనుమ క్రింద, జాతీయ రహదారి 44 పై ఉంది. దీని నిర్మాణం 2011లో ప్రారంభమై 2021లో పూర్తయింది. 8.45 కి.మీ. (5.25 మై.) పొడవుతో ఇది భారతదేశంలోని పొడవైన సొరంగాలలో ఒకటి. ఈ సొరంగం వలన శ్రీనగర్ జమ్మూ నగరాల మధ్య దూరాన్ని 16 కి.మీ. తగ్గుతుంది.[1] ప్రయాణ సమయం 6 గంటల నుండి 5.5 గంటలకు తగ్గుతుంది.[2]

బనిహాల్ ఖాజీగుండ్ రోడ్ టన్నెల్
అవలోకనం
ప్రదేశంజమ్మూ కాశ్మీరు India
స్థితిActive
మార్గముC2 ఎన్‌హెచ్ 44
మొదలుఖాజీగుండ్
చివరబనిహాల్
నిర్వహణ వివరాలు
ప్రారంభ తేదీ2011
ప్రారంభం2021 ఆగస్టు 4
యజమనిభారత జాతీయ రహదారుల అధికార సంస్థ
నిర్వాహకుడుభారత జాతీయ రహదారుల అధికార సంస్థ
ట్రాఫిక్మోటారు వాహన యోగ్యం
టోల్ఖాజీగుండ్ సుంకం కేంద్రం
సాంకేతిక వివరాలు
పొడవు8.45 కి.మీ. (27,700 అ.)
సందుల సం.ఒక్కో గొట్టంలో రెండు వరుసలు
(మొత్తం 4 వరుసలు)
కార్యాచరణ వేగం70 km/h (43 mph)
అత్యధిక ఎత్తు1,790 మీ. (5,870 అ.)
వెడల్పు7 మీటర్లు (23 అ.)

సొరంగంలో ఒక్కో దిశకు ఒక్కొక్కటి చొప్పున రెండు సమాంతర గొట్టాలున్నాయి. ఒక్కో సొరంగం 7 మీ. (23 అ.) వెడల్పు, రెండు వరుసాల రహదారిని కలిగి ఉంటుంది. నిర్వహణ కోసం, అత్యవసర సమయాల్లో తరలింపు కోసం- రెండు సొరంగాలు ప్రతి 500 మీ. (1,600 అ.) ఒకదానితో ఒకటి కలపబడి ఉంటాయి. సొరంగంలో పొగను, పాత గాలిని తొలగించి, స్వచ్ఛమైన గాలిని నింపడానికి వెంటిలేషన్‌ వ్యవస్థ ఉంది. భద్రత కోసం అత్యాధునిక పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థలున్నాయి. ₹2,100 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ సొరంగాన్ని ఉపయోగించేందుకు పౌరులు టోల్ చెల్లించాలి.[3]

2011లో ఎన్‌హెచ్ 44ను (గతంలో దీన్ని ఎన్‌హెచ్ 1A అనేవారు) నాలుగు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టుతో పాటు సొరంగం నిర్మాణం కూడా ప్రారంభించారు. బనిహాల్ కనుమకు దిగువన అప్పటికే ఉన్న జవహర్ రహదారి సొరంగం 2,194 మీ. (7,198 అ.) ఎత్తులో ఉన్నందున, ట్రాఫిక్ సామర్థ్యం పరిమితంగా ఉండేది. కొత్త సొరంగం సగటు ఎత్తు 1,790 మీటర్లతో ఇప్పటికే ఉన్న జవహర్ సొరంగం ఎత్తు కంటే 400 మీటర్లు దిగువన ఉంటుంది. దీనివలన ఇక్కడ హిమపాతాలకు తక్కువ అవకాశం ఉంది. సొరంగం వలన బనిహాల్, ఖాజిగుండ్ ల మధ్య రహదారి దూరం 16 కి.మీ. తగ్గుతుంది.

  • 2016 మే నాటికి, మొత్తం 8.5 కి.మీలలో 7.2 కిమీ తవ్వకాలు జరిగాయి.[4]
  • 2017 ఫిబ్రవరి నాటికి, సొరంగం తవ్వకం ముగింపు దశకు చేరుకుంది.[5]
  • 2018 ఫిబ్రవరి: ఒక సొరంగం తవ్వకం పని పూర్తయింది.[6]
  • 2018 మే: మొత్తం 8.5 కి.మీ. సొరంగం 2018 మే 20న పూర్తయింది. [7]
  • 2019 జనవరి: మార్చి 2020 నాటికి సొరంగం ట్రాఫిక్ కోసం తెరవబడుతుంది [8]
  • 2019 నవంబరు: పని నెమ్మదిగా సాగుతోంది; సొరంగం మార్చి 2021లో ట్రాఫిక్ కోసం తెరవబడుతుంది [9]
  • 2021 ఫిబ్రవరి 25: 2021 ఏప్రిల్‌లో సొరంగం ప్రారంభం[10]
  • 2021 ఏప్రిల్ 5: ప్రారంభం 2021 ఏప్రిల్ చివరి వరకు ఆలస్యం అవుతుంది.[11]
  • 2021 జూలై: స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొరంగం‌ను ప్రారంభించవచ్చు.[12]
  • 2021 ఆగస్టు: సొరంగాన్ని రోడ్డు రవాణా రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించాడు.[13]

స్థానం

మార్చు

సొరంగం దక్షిణ ప్రవేశం 33°29′22″N 75°10′22″E / 33.4895°N 75.1729°E / 33.4895; 75.1729 వద్ద, ఉత్తర ప్రవేశం కొన 33°33′53″N 75°11′12″E / 33.5646°N 75.1867°E / 33.5646; 75.1867 వద్ద ఉన్నాయి.

భద్రతా చర్యలు

మార్చు

సొరంగం బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన నిర్మించారు. వెలువడ్డ వాయువులను తొలగించడానికి, స్వచ్ఛమైన గాలిని తీసుకురావడానికి దీనిలో ఎగ్జాస్ట్ వ్యవస్థ ఉంది. ఇందులో 126 జెట్ ఫ్యాన్లు, 234 సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేశారు.[14]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "All-weather tunnel linking Jammu and Srinagar to open soon. All you must know". Retrieved 10 June 2021.
  2. "J-K: 8.5 Km Qazigund-Banihal tunnel in final stage of construction, to open soon". ANI News (in ఇంగ్లీష్). Retrieved 2021-08-05.
  3. "NHAI in race to get crucial J&K tunnel ready ahead of avalanches" (in Indian English). The Hindu. PTI. 2018-05-20. ISSN 0971-751X. Retrieved 2021-08-08.
  4. "Tunnels of Hope in Valley, Governance Now". Retrieved 19 February 2017.
  5. "Tunnel openings". Retrieved 4 March 2017.
  6. "Tube 1 of Banihal-Qazigund four-lane tunnel completed | Greater Kashmir".
  7. "Banihal-Qazigund road tunnel opening likely next year: NHAI - Kashmir Times". www.kashmirtimes.in.
  8. "CONCERN: 8 years on, work on Qazigund-Banihal tunnel far from over | Greater Kashmir".
  9. Excelsior, Daily (24 November 2019). "Qazigund-Banihal tunnel to miss 5th deadline".
  10. "'Qazigund-Banihal tunnel being thrown open in March'".
  11. "Opening of Qazigund-Banihal tunnel delayed from March end to April end". Kashmir Reader. Archived from the original on 22 April 2021. Retrieved 22 April 2021.
  12. "8.5 km all-weather Qazigund-Banihal hi-tech tunnel likely to be operational in coming weeks".
  13. "Auto News India, Car and Bikes News, Launch, Price, Features, Reviews". Hindustan Times Auto News (in ఇంగ్లీష్). Retrieved 2021-08-05.
  14. "8.5 km all-weather Qazi Gund-Banihal tunnel to open for public in days".