బన్నీ అండ్ చెర్రీ

2013, డిసెంబరు 14న విడుదలైన తెలుగు చలనచిత్రం

బన్నీ అండ్ చెర్రీ 2013, డిసెంబరు 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. హారున్ గని ఆర్ట్స్ పతాకంపై హారున్ గని నిర్మాణ సారథ్యంలో రాజేష్ పులి దర్శకత్వం వహించిన ఈ చత్రంలో ప్రిన్స్, మహత్ రాఘవేంద్ర, కృతి, సభా తదితరులు నటించగా, శ్రీవసంత్ సంగీతం అందించాడు.[1]

బన్నీ అండ్ చెర్రీ
Bunny n Cherry Telugu Movie Poster.jpg
బన్నీ అండ్ చెర్రీ సినిమా పోస్టర్
దర్శకత్వంరాజేష్ పులి
కథా రచయితతిరుమలశెట్టి గిరీష్ కిరణ్ (మాటలు)
నిర్మాతహారున్ గని, రజత్ పార్థసారధి
తారాగణంప్రిన్స్, మహత్ రాఘవేంద్ర, కృతి, సభా
ఛాయాగ్రహణంరవికుమార్
కూర్పుమోహన్-రామారావు
సంగీతంశ్రీవసంత్
నిర్మాణ
సంస్థ
హారున్ గని ఆర్ట్స్
విడుదల తేదీ
2013 డిసెంబరు 14 (2013-12-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బన్నీ (ప్రిన్స్), ఉద్యోగంలేని బిటెక్ గ్రాడ్యుయేట్ చెర్రీ (మహాత్ రాఘవేంద్ర) ఇద్దరు వేర్వేరు జీవితాలను గడుపుతుంటారు. బన్నీకి వితంతువు తల్లి (సీత), చెర్రీకి టాక్సీ డ్రైవర్ తండ్రి (పోసాని కృష్ణ మురళి) ఉంటారు. బన్నీ ప్రియురాలు కావ్య (సభ), చెర్రీ ప్రియురాలు పింకీ (క్రాంతి). ఒకరోజు ప్రమాదంలో బన్నీ, చెర్రీ గాయపడతారు. ఒకరోజు ప్రమాదంలో, బన్నీ, చెర్రీ గాయపడతారు. రక్తం గడ్డకట్టడం వల్ల శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని భావించిన న్యూరోసర్జన్ (యండమూరి వీరేంద్రనాథ్) న్యూరాన్ల మార్పిడికోసం డాక్టర్ సక్సేనా (సుమన్) ను సంప్రదించి, వారి జ్ఞాపకాలను మార్పిస్తాడు. ఆ తర్వాత వారిద్దరి జీవితంతో ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: రాజేష్ పులి
 • నిర్మాత: హారున్ గని, రజత్ పార్థసారధి
 • మాటలు: తిరుమలశెట్టి గిరీష్ కిరణ్
 • నటులు: ప్రిన్స్, మహత్ రాఘవేంద్ర, కృతి, సభా
 • సంగీతం: శ్రీవసంత్
 • ఛాయాగ్రహణం: రవికుమార్
 • కూర్పు: మోహన్-రామారావు
 • పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, పోతుల రవికిరణ్, కరుణాకర్
 • నృత్యం: భాను
 • నిర్మాణ సంస్థ: హారున్ గని ఆర్ట్స్
 • విడుదల: 14 డిసెంబరు 2013

మార్కెటింగ్సవరించు

2013, ఆగస్టు 7వ తేదీన సినీ దర్శకనిర్మాత మారుతి చిత్ర లోగోను ఆవిష్కరించగా, సినీ దర్శకనిర్మాత తేజ ఈ చిత్ర టీజర్ విడుదలచేశాడు.[1]

ఇతర వివరాలుసవరించు

 1. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[2]
 2. దర్శకుడిగా రాజేష్ కు, హీరోయిన్స్ గా కృతి, సభాలను తొలిచిత్రమిది.[3]
 3. చిత్ర ప్రచారంకోసం అల్లు అర్జున్ (బన్నీ), రామ్ చరణ్ (చెర్రీ) ముద్దుపేర్లతో సినిమా పేరు పెట్టారు.[3]
 4. చిత్రానికి ప్రతికూల సమీక్షలు వచ్చాయి.[3]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 సాక్షి, సినిమా (17 August 2013). "'బన్నీ ఎన్ చెర్రీ' స్టిల్స్". Sakshi. Archived from the original on 1 మే 2020. Retrieved 1 May 2020. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 2. Seshagiri, Sangeetha (17 December 2013). "Box Office Report: Ajith's 'Aata Arrambam', Sundeep's 'Venkatadri Express' and Other Films". International Business Times, India Edition.
 3. 3.0 3.1 3.2 "Bunny N Cherry Movie Review {2/5}: Critic Review of Bunny N Cherry by Times of India" – via timesofindia.indiatimes.com.