బలూచిస్తాన్‌లో హిందూమతం

పాకిస్తాన్ లో హిందు మత ప్రభావం,బలూచిస్తాన్‌లో అతిపెద్ద మైనారిటీ మతం

బలూచిస్తాన్‌లో హిందూ మతం మైనారిటీ మతంగా ఉంది.మొత్తం జనాభాలో 0.4% మంది హిందువులు ఉన్నారు.బలూచిస్తాన్‌లో అతిపెద్ద మైనారిటీ మతంగా పేరుగాంచింది.హిందువుల పవిత్ర దేవాలయమైన శ్రీ హింగ్లాజ్ మాత దేవాలయం బలూచిస్తాన్‌లో ఉంది.అత్యంత పవిత్రమైన హిందూ దేవాలయాలలో ఒకటి.[1][2]

బలూచిస్తాన్‌లో హిందూమతం
శ్రీ హింగ్లాజ్ మాత దేవాలయం
మొత్తం జనాభా
49,133 0.4%
మతాలు
హిందువులు
గ్రంథాలు
భగవద్గీత
భాషలు
సంస్కృతం, బలోచి భాష

చరిత్ర మార్చు

బలూచిస్తాన్‌లోని బ్రాహుయ్ ప్రజలుకు,దక్షిణ భారతదేశంలోని ద్రావిడ మాట్లాడే ప్రజలతో దగ్గరి సంబంధం ఉంది.బ్రాహుయ్ ప్రజలు మొదట హిందు మతం బౌద్ధ మతన్ని స్వీకరించేవారు.[3] బలూచిస్తాన్ ను హిందూ రాజవంశలు 7వ శతాబ్దం వరకు పాలించాయి.7వ శతాబ్దం అరబ్బు దండయాత్ర వలన బలూచిస్తాన్ లో ఉన్నా హిందువులు ఇస్లాం మతంలోకి మత మార్పిడులు జరిగాయి.[4][5]

జనాభా మార్చు

1998 జనాభా లెక్కలు ప్రకారం బలూచిస్తాన్ లో 39,000 హిందువులు ఉన్నారు. జనాభాలో 0.59%గా ఉంది.[6] 2017 హిందువుల 49,000 కు పెరిగింది.[7] అయితే, పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ అంచనా ప్రకారం బలూచిస్తాన్‌లో 117,345 మంది హిందువులు ఉన్నారు.[8]

బలూచిస్తాన్ జనాభా  
(1911) (1911) (1941)[9]: 18  (1941) (1998)[6] (1998) (2017)[7] (2017)
38,326 4.59% 54,394 6.34% 39,000 0.59% 49,133 0.40%

ప్రజల జీవన విధానం మార్చు

బలూచిస్థాన్ లో మైనారిటీలుగా హిందువులే ఎక్కువా ఉన్నారు.[10] బుగ్తీ, బెజెంజో, మర్రి, రిండ్ తెగలతో పాటు హిందూ బలూచ్‌లు ఉన్నారు.[11]పాకిస్థాన్లో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని హిందువులు సురక్షితంగా ఉన్నారు.తక్కువ మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారు.లాస్బెలా జిల్లాలోని నివసిస్తున్న 5,000 మంది హిందువులకు 18 దేవాలయాలు ఉన్నాయి.అయితే,ఖుజ్దార్ జిల్లాలో కలాత్ జిల్లా హిందువులు వివక్షను ఎదుర్కొంటున్నారు.[12][13] బలూచిస్తాన్ రాష్ట్ర అసెంబ్లీలో మూడు సీట్లను మైనారిటీలకు రిజర్వు ఉన్నాయి.హిందువులు సాధారణంగా 1 లేదా 2 స్థానాలకు ఎన్నికవుతారు[14][15][16][17]

హిందు చట్టాలు మార్చు

హిందూ వివాహ చట్టం 2017 పేరుతో మార్చి 19 న పాక్ ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. ఈ చట్టం ప్రకారం హిందూ మహిళల వివాహాలకు న్యాయపరంగా గుర్తింపు లభిస్తుంది. అంతేకాదు వారిని బలవంతంగా గానీ, అపహరించిగానీ వివాహాం చేసుకుంటే శిక్షార్హులవుతారు. ఇప్పటి వరకు ఆ దేశంలోని హిందువుల వివాహాలకు ఎలాంటి చట్టబద్ధత లేదు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం వివాహాలకు చట్టబద్ధత కల్పించడమే కాదు, సర్టిఫికెట్‌ను కూడా జారీ చేస్తుంది.పాక్‌లో మైనార్టీలైన హిందువులపై దాడులకు ఎక్కువగా ఉండేవి.మెజార్టీ మతస్థులై ముస్లింలు హిందూ మహిళలను అపహరించి బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతుంటారు. ఈ చట్టం అమల్లోకి రావడంపై హిందువులు తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.

హింగ్లజ్ మాత మందిరం మార్చు

కరాచీ నగరానికి పశ్చిమాన దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలో, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ హిందూ దేవత హింగ్లాజ్ మందిరం ఉంది. హింగ్లజ్ మాత, హింగ్లజ్ దేవి లేదా హింగుళాదేవి మందిరం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇది.ఈ ఆలయం హింగోల్ నదీతీరంలోని ఒక కొండగుహలో ఉంది. పాకిస్తానీయులు ఈ ఆలయాన్ని నానీమందిరంగా పిలుస్తారు.ప్రతియేటా ఏప్రిల్ మాసంలో నాలుగు రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో సాధువులు, హఠయోగులు ఈ దేవిని కొలుస్తారు. అనేక మంది భక్తులు ఉత్సవాల సందర్భంగా ఈ దేవతను కొలిచి మొక్కుబడులు చెల్లించుకుంటారు. స్థానికి ముస్లీములు ఈ దేవతను బీబీ నానీగా కొలుస్తారు. ఈ ఉత్సవాలను నానీకీ హజ్ అని పిలుస్తారు.హింగ్లాజ్ దేవి ఆలయం కథనాంశంగా, టి.గోపిచంద్ కథానాయకుడిగా సాహసం అనే తెలుగు చిత్రం, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చింది. భారత్-పాకిస్తాన్ విభజన అనంతరం, భారతదేశానికి వచ్చిన హిందువుల, కుటుంబంలో పుట్టిన కథానాయకుడు, తన వారసత్వ ఆస్తికోసం, పాకిస్తాన్ కి వెళ్ళే నేపథ్యంలో, సినిమా కథ సాగుతుంది.

మూలాలు మార్చు

  1. Schaflechner, Jürgen (2018). Hinglaj Devi : identity, change, and solidification at a Hindu temple in Pakistan. New York, NY: Oxford University Press. pp. 66. ISBN 9780190850555. The worship of the Hinglaj Mata in Balochistan has been one of the most important tourist and religious pilgrimage for the Hindus of Pakistan and the trends has place in history from Medieval India.
  2. Being in the World Productions (2011), OnBecoming Gods, Pakistan, event occurs at 44 min, retrieved 2018-08-07{{citation}}: CS1 maint: location missing publisher (link)
  3. Dictionary of Languages: The Definitive Reference to More Than 400 Languages. Columbia University Press. ISBN 9780231115698. Retrieved 24 May 2021.
  4. Skutsch, Carl, ed. (2005). Encyclopedia of the World's Minorities. New York: Routledge. p. 178. ISBN 1-57958-468-3.
  5. Dashti, Naseer (2012). The Baloch and Balochistan: A Historical Account from the Beginning to the Fall of the Baloch State. Trafford Publishing. pp. 63–67.
  6. 6.0 6.1 "Population Distribution by Religion, 1998 Census" (PDF). Pakistan Bureau of Statistics. Archived (PDF) from the original on 24 May 2021. Retrieved 24 May 2021. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 26 డిసెంబరు 2016 suggested (help)
  7. 7.0 7.1 "SALIENT FEATURES OF FINAL RESULTS CENSUS-2017" (PDF). Archived from the original (PDF) on 7 ఏప్రిల్ 2022. Retrieved 24 May 2021.
  8. "Hindu Population (PK) – Pakistan Hindu Council" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 24 May 2021. Retrieved 24 May 2021. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 15 మార్చి 2018 suggested (help)
  9. "CENSUS OF INDIA, 1941 VOLUME XIV BALUCHISTAN". Retrieved 23 September 2021.
  10. Kamal Siddiqi (30 July 2009). "Hingol Temple Symbolises Baloch Secularism". Hindustan Times. Retrieved 24 May 2021.
  11. "Over 100 Hindu Families In Pak Want To Migrate To India". Hindustan Times. 3 January 2011. Retrieved 24 May 2021.
  12. Tarar, Akhlaq Ullah (31 March 2019), Forced conversions, retrieved 24 May 2021
  13. Javaid, Maham (18 August 2016), State of fear, retrieved 24 May 2021
  14. "Pakistan Senate passes landmark Hindu marriage bill". The Hindu. 18 February 2017. Retrieved 24 May 2021.
  15. Kalbe Ali (27 September 2016). "NA finally passes Hindu marriage bill". Dawn. Retrieved 24 May 2021.
  16. Aqeel, Asif (1 July 2018), Problems with the electoral representation of non-Muslims, retrieved 21 May 2021
  17. "General Elections 2018 - Reserved Seats Returned Candidates Notifications - National Assembly and Provincial Assemblies". Election Commission of Pakistan. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 17 నవంబరు 2021.

వెలుపలి లింకులు మార్చు