బంగ్లా భాష
(బాంగ్లా భాష నుండి దారిమార్పు చెందింది)
బంగ్లా లేదా బెంగాలీ భారత ఉపఖండములోని తూర్పు భాగమునకు చెందిన ఒక ఇండో-ఆర్యన్ భాష. బంగ్లా మాగధీ పాకృతం, పాలీ, సంస్కృతముల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి, స్థాయి ఉన్నాయి.
బెంగాలీ বাংলা baṅgla | ||||
---|---|---|---|---|
మాట్లాడే దేశాలు: | బంగ్లాదేశ్, భారతదేశం తదితర | |||
ప్రాంతం: | తూర్పు దక్షిణ ఆసియా | |||
మాట్లాడేవారి సంఖ్య: | 23 కోట్లు (18.9 కోట్లు మాతృభాషగా) | |||
ర్యాంకు: | 6,[1] 5,[2] | |||
భాషా కుటుంబము: | Indo-European ఇండో-ఇరానియన్ ఇండో-ఆర్యన్ తూర్పు వర్గము బెంగాలీ-అస్సామీ బెంగాలీ | |||
వ్రాసే పద్ధతి: | బెంగాలీ లిపి | |||
అధికారిక స్థాయి | ||||
అధికార భాష: | బంగ్లాదేశ్, భారతదేశం (పశ్చిమ బెంగాల్ , త్రిపుర) | |||
నియంత్రణ: | బాంగ్లా అకాడమీ (బాంగ్లాదేశ్) పశ్చిమ్‌బంగ బాంగ్లా అకాడమీ (పశ్చిమ బెంగాల్) | |||
భాషా సంజ్ఞలు | ||||
ISO 639-1: | bn | |||
ISO 639-2: | ben | |||
ISO 639-3: | ben | |||
|
బెంగాలీని స్థానికంగా దక్షిణ ఆసియాలోని తూర్పు ప్రాంతమైన బెంగాల్లో మాట్లాడుతారు (ప్రస్తుత బంగ్లాదేశ్, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. 23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. (ప్రపంచ భాషలలో 5వ[2] లేదా 6వ[1] స్థానములో ఉన్నది). బంగ్లాదేశ్ లో బంగ్లా ప్రాథమిక భాష, భారతదేశములో అత్యంత విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.[3][4]. అస్సామీతో పాటు బెంగాలీ, ఇండో-ఇరానియన్ భాషలలో భౌగోళికముగా అత్యంత తూర్పునకు వ్యాపించి ఉన్న భాష.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Languages spoken by more than 10 million people". Encarta Encyclopedia. Archived from the original on 2007-12-03. Retrieved 2007-03-03.
- ↑ 2.0 2.1 "Statistical Summaries". Ethnologue. Retrieved 2007-03-03.
- ↑ Gordon, Raymond G., Jr. (2005). "Languages of India". Ethnologue: Languages of the World, Fifteenth edition. SIL International. Retrieved 2006-11-17.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Languages in Descending Order of Strength - India, States and Union Territories - 1991 Census" (PDF). Census Data Online. Office of the Registrar General, India. p. 1. Archived from the original (PDF) on 2007-06-14. Retrieved 2006-11-19.