ఎస్.వి.రంగారావు (సామర్ల వెంకట రంగారావు) స్వంతంగా యస్.వి. ఆర్. ఫిలిమ్స్ బ్యానర్‌పై బడేటి సత్యనారాయణ, పుట్టా వెంకట్రావులతో కలిసి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించాడు. అనుబంధాలకు, అన్యోన్యతకు, బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తూ, క్రమశిక్షణతో సున్నితమైన అంశాలను ఎలా పరిష్కరించాలో తెలియచేసే చక్కని కుటుంబ కథాచిత్రం బాంధవ్యాలు. 1967లో కమల్ బ్రదర్స్‌వారు తమిళంలో నిర్మించిన ‘కన్‌కండ దైవమ్’ అనే సినిమా దీనికి మాతృక.

బాంధవ్యాలు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్వీ. రంగారావు
నిర్మాణం బడేటి సత్యనారాయణ,
పుట్టా వెంకట్రావు
తారాగణం ఎస్వీ. రంగారావు ,
సావిత్రి,
ధూళిపాళ,
హరనాధ్,
రాజనాల,
నాగయ్య,
చంద్రమోహన్,
లక్ష్మి(తొలి పరిచయం)
సంగీతం సాలూరి హనుమంతరావు
నిర్మాణ సంస్థ ఎస్.వి.ఆర్. ఫిల్మ్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం మార్చు

  1. కథ-కె.ఎస్‌.గోపాలకృష్ణన్‌
  2. మాటలు- డి.వి.నరసరాజు
  3. కళ-వి.బి.రాజు
  4. కూర్పు-ఎన్.ఎస్. ప్రకాశం
  5. నృత్యం-డి.వేణుగోపాల్
  6. సంగీతం-సాలూరి హనుమంతరావు
  7. దర్శకత్వం- ఎస్.వి.రంగారావు
  8. నిర్మాతలు- బడేటి సత్యనారాయణ, పుట్టా వెంకట్రావు

పాత్రలు -పాత్రధారులు మార్చు

చిత్రకథ మార్చు

రామయ్య (ఎస్.వి.రంగారావు) ఆ గ్రామంలో మోతుబరి రైతు. అతనికొక కుమారుడు చంద్రం (ఏడిద నాగేశ్వరరావు) కళ్ళులేకపోయినా చాపలు అల్లటం అతని నేర్పు. రామయ్య తమ్ముడు లక్ష్మయ్య (ధూళిపాళ) మరదలు అన్నపూర్ణ (సావిత్రి), వారి కూతురు లక్ష్మి(లక్ష్మి) కుమారులు ముగ్గురు, రామేశం (మోదుకూరి సత్యం), కామేశం, సోమేశం (సారధి). మగపిల్లలు పట్నంలో చదువుతూ, విలాసాల్లో గడుపుతూ, పరీక్షల్లో ఫెయిలవుతూంటారు. వారి ఎదురింటి వ్యక్తి పానకాలస్వామి (రాజనాల), అతని తమ్ముడు సూర్యం (చంద్రమోహన్) బుద్ధిమంతుడు. అన్నగారు చేసే అక్రమ వ్యాపారాలు, వ్యవహారాలు నచ్చక, రామయ్యవద్ద పాలేరుగా పనిచేస్తుంటాడు. లక్ష్మి, సూర్యం ప్రేమించుకుంటారు. లక్ష్మయ్యకు ఇది నచ్చదు. కొడుకులు అప్రయోజకులయినా వారిపట్ల ప్రేమ ఎక్కువ. ఇది అలుసుగా తీసికొని పానకాలు, ఈ అన్నదమ్ములచేత ఒక కారు కొనిపించి, అలాగే ఆస్తి హామీ సంతకం 2 లక్షలకు పెట్టించి వారిని అందులో ఇరికించి, పోలీసులచే అరెస్ట్‌చేయిస్తాడు. పిల్లల కారణంగా, రామయ్య ఆస్తిని పంచి కొడుకుతో వేరుగా వుంటాడు. తన పిల్లలు అరెస్ట్‌కాగానే లక్ష్మయ్య అన్నగారిని తిరిగి ఇంటికి తీసుకువస్తాడు. రామయ్య సాయంతో, చదువుకున్న పాలేరు భూషయ్య కొడుకు గోపాలం (హరనాథ్) వకీలు కావటంతో ఈ రెండు కేసులను సమర్ధవంతంగా వాదించి, రామేశం వగైరాలను నిర్దోషులుగా విడుదల చేయిస్తాడు. వారికి బుద్ధిరావటం, లక్ష్మి, సూర్యంల వివాహం నిశ్చయం కావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].

పురస్కారాలు మార్చు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
1968 నంది పురస్కారాలు ఉత్తమ చిత్రం బడేటి సత్యనారాయణ,
పుట్టా వెంకట్రావు
గెలుపు

పాటలు మార్చు

  1. అటు గంటల మోతలు గణగణ ఇటు గాజుల సవ్వడి- ఘంటసాల, బి. వసంత - రచన: డా॥ సినారె
  2. ఎన్నెలనక ఎండననక కన్నుగీటె చిన్నికొండయ్య - ఎల్.ఆర్.ఈశ్వరి, ఎ.వి.ఎన్.మూర్తి బృందం
  3. కనులే కలుపుదాం వలపే తెలుపుదాం కలిసి ఆడుదాం ఆడుదాం - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
  4. తువ్వాయి తువ్వాయి అవ్వాయి తువ్వాయి చెప్పవే నువైనా - సుశీల, ఘంటసాల - రచన: డా॥ సినారె
  5. మంచితనానికి ఫలితం వంచన మనిషికి మిగిలేది ఏమిటి - ఘంటసాల - రచన: డా॥ సినారె
  6. మా రైతు బాబయా మామంచివోడయా - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు