బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్

బాలానగర్, హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. ఫతేనగర్ సిగ్నల్ నుండి బాలానగర్ సిగ్నల్ మీదుగా నూతనంగా బాలానగర్ ఫ్లైఓవర్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.[1]

శంకుస్థాపన మార్చు

హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ కి 21 ఆగస్టు 2017న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశాడు.[2][3]

నిర్మాణ వివరాలు మార్చు

బాలానగర్ ఫ్లైఓవర్ ను 1.13 కిలోమీటర్ల పొడవున 26 పిల్లర్లతో ఆరు లైన్లతో స్టాటిజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) సౌజన్యంతో రూ.387 కోట్ల వ్యయంతో హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్మించింది.[4] ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని బీఎస్‌సీపీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ దక్కించుకుంది.[5] ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆస్తుల సేకరణకు రూ.265 కోట్లు, నిర్మాణానికి రూ.122 కోట్లు వ్యయం అయ్యింది.[6] ఈ ఫ్లైఓవ‌ర్‌ నిర్మాణంతో బోయిన్​పల్లి నుంచి కూకట్​పల్లి వైపు, కుత్బుల్లాపూర్, జీడీమెట్ల, నర్సాపూర్ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్య తీరుతుంది.[7][8]బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్‌ 13 ఏప్రిల్ 2020న,[9] 6 జులై 2020న పశుసంర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి పరిశీలించారు.[10]ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అక్టోబర్‌ 2020 నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా, కరోనా కారణంగా కొంతకాలం నిలిచి పోయి, నిర్మాణం పూర్తవడానికి మూడున్నరేళ్లు సమయం పట్టింది.[11][12]

 
బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ నిర్మాణం సమయంలో

ప్రారంభం మార్చు

హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ ను 6 జులై 2021న రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించి, ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో సెంట్రింగ్‌ కార్మికురాలుగా పనిచేసిన వనపర్తి జిల్లా మణిగిల్లకు చెందిన శివమ్మ అనే మహిళా కార్మికురాలి చేత రిబ్బన్ కట్ చేయించాడు.[13][14] ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కె.పి. వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు కె. నవీన్ రావు, సురభి వాణి దేవి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, కార్పొరేట‌ర్లు పండాల సతీష్ గౌడ్ (ఫతేనగర్), ఆవుల రవీందర్‌రెడ్డి (బాలానగర్) పాల్గొన్నారు.[15]బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ ఫ్లై ఓవ‌ర్‌గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపాడు.[16][17][18]

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (30 June 2021). "బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ : సాయంకాలం.. సుంద‌ర దృశ్యం". Namasthe Telangana. Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
  2. The Indian Express (13 April 2021). "Balanagar flyover works expedited as KTR assures completion by May". The New Indian Express. Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
  3. Namasthe Telangana (6 July 2021). "బాలానగర్‌.. బేఫికర్‌!". Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  4. Namasthe Telangana (10 May 2021). "బాలానగర్‌ ఫ్లైఓవర్‌ ర్యాంపులు రెడీ". Namasthe Telangana. Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
  5. Deccan Chronicle, Coreena (14 September 2017). "Andhra Pradesh firm bags Balanagar flyover project". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
  6. The Hans India (5 November 2019). "Major hurdle cleared for Balanagar flyover" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
  7. Jun 24, Times of India: (24 June 2021). "Hyderabad:Balanagar flyover to tackle decades-old traffic issues | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.{{cite news}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  8. TV9 Telugu, TV9 (26 June 2021). "Hyderabad : హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి.. బాలానగర్ వాసులకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు". Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Telangana Today (13 April 2020). "KTR inspects Balanagar flyover works". Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
  10. HMTV (6 July 2020). "నవంబర్ నాటికి బాలనగర్‌ ఫ్లైఓవర్‌ పూర్తి". Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
  11. Sakshi (7 August 2020). "బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పనులకు బ్రేక్‌". Sakshi. Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
  12. నమస్తే తెలంగాణ (5 June 2021). "ఏనాటి స్వప్నం సాకారం". Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  13. TV9 Telugu (6 July 2021). "Balanagar Flyover: అందుబాటులోకి వచ్చిన బాలానగర్‌ ప్లై ఓవర్‌.. మున్సిపల్ కార్మికురాలితో రిబ్బన్ కట్ చేయించిన మంత్రి కేటీఆర్". Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  14. Namasthe Telangana (6 July 2021). "బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ రిబ్బ‌న్ క‌ట్టింగ్ చేసిందేవ‌రో తెలుసా?". Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  15. Namasthe Telangana (6 July 2021). "బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  16. నమస్తే తెలంగాణ (6 July 2021). "బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ పేరు : మంత్రి కేటీఆర్". Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  17. నమస్తే తెలంగాణ (3 July 2021). "బాలానగర్‌ ఫ్లై ఓవర్‌కు బాబూ జగ్జీవన్‌రాం పేరు". Namasthe Telangana. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
  18. Namasthe Telangana (7 July 2023). "బాలానగర్ ఫ్లైఓవర్‌కు బాబు జగ్జీవన్ రామ్ పేరు.. ఉత్తర్వులు జారీ". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.