బావ బావమరిది
బావ బావమరిది 1993 లో శరత్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. కృష్ణంరాజు, జయసుధ, సుమన్, మాలాశ్రీ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఎడిటర్ మోహన్ గా పిలవబడే ఆకుల మోహన్, సి. ఎం. కృష్ణ కలిసి ఎం. ఎం. ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ - కోటి ఈ చిత్రానికి సంగీన్నందించారు. 1992 లో వచ్చిన తమిళ సినిమా పండితురై కి ఇది పునర్నిర్మాణం. ఇదే సినిమా 1998 లో బంధన్ అనే పేరుతో, కన్నడంలో 2001 లో బావ బామైద అనే పేరుతో పునర్నిర్మాణం అయింది. ఒక వేశ్య వలలో పడిన బావను మార్చి తన అక్క కాపురాన్ని చక్కదిద్దే బావమరిది కథ ఇది.
బావ బావమరిది (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శరత్ |
---|---|
తారాగణం | కృష్ణంరాజు, జయసుధ, సుమన్, మాలాశ్రీ |
సంగీతం | రాజ్ కోటి |
నిర్మాణ సంస్థ | ఎం.ఎం.మూవీ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రాఘవరావు గా కృష్ణంరాజు
- జానకి గా జయసుధ
- రాజు గా సుమన్
- గీత గా మాలాశ్రీ
- పెద్దాపురం పెదరాయుడు గా కోట శ్రీనివాసరావు
- పిఠాపురం పిల్ల జమీందారు గా బాబు మోహన్
- చింతామణి గా సిల్క్ స్మిత
- రాజు తల్లి గా నిర్మలమ్మ
- రాజు తండ్రి గా పి. ఎల్. నారాయణ
- భూపతి గా ఆనంద్ రాజ్
పాటలు
మార్చు- బావలు సయ్యా మరదలు సయ్యా , రచన: ఎం ఎం ఆర్ట్స్ గానం. రాధిక
- గజ్జె ఘల్లు, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- ఉత్తరాన నీలి, రచన:, వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- జయమస్తు,సాంప్రదాయం , గానం కె ఎస్ చిత్ర
- కొంటె కొనంగి , రచన: భువనచంద్ర,గానం. కె ఎస్ చిత్ర
- మాయదారి తేనెటీగ, రచన: డీ. నారాయణ వర్మ గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.