బికనీర్ జిల్లా
రాజస్థాన్ రాష్ట్రంలోని జిల్లాలలో బికనీర్ జిల్లా (హిందీ: ज़िला बिकाणो), (ఉర్దూ: ضِلع بِيكانير) ఒకటి. బికనీర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. బికనీర్ రాజస్థాన్ విభాగాలలో ఒకటి. బికనీర్ విభాగంలో చురు, శ్రీ గంగానగర్, హనుమాన్‌గఢ్ జిల్లాలు భాగంగా ఉన్నాయి.
బికనీర్
बिकाणो | |
---|---|
జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | బికనీర్ |
Founded by | రావు బికాజీ |
Government | |
• Body | నగరపాలక సంస్థ |
విస్తీర్ణం | |
• Total | 28,466 కి.మీ2 (10,991 చ. మై) |
Elevation | 242 మీ (794 అ.) |
జనాభా (2011) | |
• Total | 6,47,804 |
• జనసాంద్రత | 3,887.8/కి.మీ2 (10,069/చ. మై.) |
భాష | |
Time zone | UTC+5:30 |
పిన్‌కోడ్ | 3340XX |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | +91 151 |
Vehicle registration | RJ-07 |
భౌగోళికం
మార్చుచిత్తౌర్గఢ్, బికనీర్ జిల్లాకు దగ్గరగా, థార్ ఎడారి గుండా ప్రవహిస్తున్న రాజస్థాన్ కాలువ (ఇందిరా గాంధీ కాలువ) జిల్లా సరిహద్దులో ఉత్తర శ్రీ గంగానగర్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో హనుమాన్‌గఢ్ జిల్లా, తూర్పు సరిహద్దులో చురు జిల్లా, ఆగ్నేయసరిహద్దులో నాగౌర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో జోధ్‌పూర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో జైసల్మేర్ జిల్లా, సరిహద్దులో పాకిస్థాన్ లోని పంజాబు ఉన్నాయి. బికనీర్ జిల్లా థార్ ఎడారిలో ఉంది. ఇందిరా గాంధీ కాలువ జిల్లాలో వ్యవసాయ భూములకు అవసరమైన నీటిని అందిస్తుంది. బికనీర్ సమీపంలో దెష్నొక్ వద్ద ఉన్న ప్రపంచ పసిద్ధి చెందిన కర్ణి మాతా ఆలయం ఉంది.
జనాభా గణాంకాలు
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 2,16,478 | — |
1911 | 2,36,708 | +0.90% |
1921 | 2,28,562 | −0.35% |
1931 | 2,71,449 | +1.73% |
1941 | 3,60,968 | +2.89% |
1951 | 3,95,462 | +0.92% |
1961 | 5,11,317 | +2.60% |
1971 | 6,65,439 | +2.67% |
1981 | 9,73,800 | +3.88% |
1991 | 13,81,201 | +3.56% |
2001 | 19,02,110 | +3.25% |
2011 | 23,63,937 | +2.20% |
Source:[1] |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో మొత్తం జనాభా 2,363,937. వీరిలో 1,240,801 మంది పురుషులు కాగా, 1,123,136 మంది మహిళలు ఉన్నారు. 2011 లో బికనీర్ జిల్లాలో మొత్తం 384,944 కుటుంబాలు నివసిస్తున్నాయి. బికనీర్ జిల్లా సగటు సెక్స్ నిష్పత్తి 905. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 33.9% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా 66.1% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 78% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 58.1%గా ఉంది. బికనీర్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల సెక్స్ నిష్పత్తి 909 కాగా, గ్రామీణ ప్రాంతాలు 903గా ఉంది.జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 400554, ఇది మొత్తం జనాభాలో 17%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 209952 మగ పిల్లలు, 190602 ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బికనీర్ చైల్డ్ సెక్స్ నిష్పత్తి 908, ఇది బికనీర్ జిల్లాలోని సగటు సెక్స్ రేషియో (905) కంటే ఎక్కువ.జిల్లా మొత్తం అక్షరాస్యత 65.13%. బికనీర్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 63.06%, స్లత్రీ అక్షరాస్యత రేటు 44.2%గా ఉంది.[2]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా మొత్తం జనాభాలో 95.94% మంది హిందీ మాట్లాడేవారు ఉండగా,1.59% మంది పంజాబీ మాట్లాడేవారు ఉన్నారు.ఇతర భాషలు మాట్లాడవారు 2.47%మంది ఉన్నారు.[3]
విభాగాలు
మార్చు- బికనీర్ జిల్లాలో 5 ఉప విభాగాలు ఉన్నాయి: బికనీర్, నోఖా, లూంకరంసర్, ఖజువాలా, దుంగర్‌పూర్.
- బికనీర్ ఉపవిభాగంలో జిల్లాలో 2 తాలూకాలు ఉన్నాయి: బికనీర్, కొలయత్.
- ఖజువాలా ఉపవిభాగంలో 2, తాలూకాలు ఉన్నాయి: ఖజువాలా, చత్తౌర్‌గర్, పూగల్.
- నోఖా, లూంకరంసర్, దుంగర్‌గర్ లలో అదే పేరుతో తాలూకాలుగా ఉన్నాయి.
- జిల్లాలో 923 గ్రామాలు, 219 గ్రామపంచాయితీలు ఉన్నాయి.
- జిల్లాలో ఒక మునిసిపల్ కార్పొరేషన్, 6 మునిసిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి: డెష్నోక్, నోఖా, దుంగర్గర్హ్, ఖజువల, లూంకరన్సర్, నపసర్.
2001 గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,367,745, [4] |
ఇది దాదాపు. | లాటివా దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 190వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 78 |
వైశాల్యం | 30247.90sq.km.[4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 41.42%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 903:1000 [4] |
జాతీయ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 65.92%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
వాతావరణం
మార్చుశీతోష్ణస్థితి డేటా - Bikaner | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 23.0 (73.4) |
25.5 (77.9) |
31.8 (89.2) |
38.2 (100.8) |
41.7 (107.1) |
41.6 (106.9) |
37.8 (100.0) |
36.6 (97.9) |
36.7 (98.1) |
36.2 (97.2) |
30.7 (87.3) |
25.3 (77.5) |
33.8 (92.8) |
సగటు అల్ప °C (°F) | 5.6 (42.1) |
8.8 (47.8) |
15.0 (59.0) |
22.1 (71.8) |
26.8 (80.2) |
28.8 (83.8) |
27.7 (81.9) |
26.8 (80.2) |
24.7 (76.5) |
19.1 (66.4) |
12.1 (53.8) |
6.9 (44.4) |
18.7 (65.7) |
సగటు అవపాతం mm (inches) | 5 (0.2) |
7 (0.3) |
10 (0.4) |
7 (0.3) |
31 (1.2) |
46 (1.8) |
106 (4.2) |
71 (2.8) |
34 (1.3) |
4 (0.2) |
3 (0.1) |
1 (0.0) |
325 (12.8) |
సగటు అవపాతపు రోజులు | 0.8 | 1.0 | 1.5 | 0.9 | 2.6 | 3.2 | 6.6 | 5.6 | 3.0 | 0.6 | 0.3 | 0.5 | 26.6 |
Source: HKO |
మూలాలు
మార్చు- ↑ Decadal Variation In Population Since 1901
- ↑ "Bikaner District Population Religion - Rajasthan, Bikaner Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-05-11. Retrieved 2021-02-23.
- ↑ 2011 Census of India, Population By Mother Tongue
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Latvia 2,204,708 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179