బి. జీవన్ రెడ్డి
తెలుగు చలనచిత్ర దర్శకుడు
బి. జీవన్ రెడ్డి భారతీయ చలనచిత్ర దర్శకుడు. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి, 2013లో విడుదలైన దళం సినిమాలకు దర్శకత్వం వహించాడు.
బి. జీవన్ రెడ్డి | |
---|---|
![]() | |
జననం | డిసెంబరు 6 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2008 - ప్రస్తుతం |
జీవిత విషయాలు సవరించు
జీవన్ రెడ్డి డిసెంబరు 6న సిద్ధిపేట జిల్లాలో జన్మించాడు.
సినిమారంగం సవరించు
2008లో వచ్చిన రక్ష, 2011లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు సినిమాలకు జీవన్ రెడ్డి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 2013లో తొలిసారిగా దళం సినిమాకు దర్శకత్వం వహించాడు.[1] ఈ చిత్రం ఏకకాలంలో తమిళంలో కూట్టంగా రూపొందించబడి, 2014లో విడుదలైంది.[2] ఈ చిత్రం విడుదలైన తరువాత మిశ్రమ స్పందనలను అందుకుంది.[3] తరువాత 2019లో జార్జ్ రెడ్డి సినిమా తీశాడు. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించబడింది. జీవన్ ఈ చిత్రంకోసం జార్జ్ రెడ్డి జీవితం గురించి ఒకటిన్నర సంవత్సరాలు పరిశోధన చేశాడు.[4]
సినిమాలు సవరించు
సంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | రచయిత | ఇతర వివరాలు | Ref. |
---|---|---|---|---|---|
2008 | రక్ష | మాటల రచయిత, సహాయ దర్శకుడు | |||
2013 | దళం | ద్విభాషా చిత్రం (తెలుగులో దళం, తమిళంలో కూట్టం) | |||
2019 | జార్జ్ రెడ్డి |
- నిర్మాతగా
- గువ్వ గోరింక (2020)
మూలాలు సవరించు
- ↑ "Piaa Bajpai in Jeevan Reddy's Dhalam - Times of India". The Times of India.
- ↑ Dundoo, Sangeetha Devi (October 28, 2019). "George Reddy: Story of a rebel". The Hindu.
- ↑ "Dalam Movie Review {2.5/5}: Critic Review of Dalam by Times of India". The Times of India.
- ↑ "I'm satisfied with how I have introduced George Reddy onscreen: Jeevan Reddy - Times of India". The Times of India.