గువ్వ గోరింక

మోహన్ బమ్మిడి దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు సినిమా.

గువ్వ గోరింక, 2020 డిసెంబరు 17న విడుదలైన తెలుగు సినిమా. మ్యాంగో మాస్ మీడియా, అకర్ వర్క్స్ బ్యానర్లపై బి. జీవన్ రెడ్డి, దాము రెడ్డి కోసనం నిర్మించిన ఈ సినిమాకు మోహన్ బమ్మిడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సత్యదేవ్ కంచరాన, ప్రియ లాల్, ప్రియదర్శి పులికొండ, చైతన్య, మధుమిత, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించగా,[1][2] సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చాడు. ఇది 2020, డిసెంబరు 17న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.[3][4]

గువ్వ గోరింక
గువ్వ గోరింక సినిమా పోస్టర్
దర్శకత్వంమోహన్ బమ్మిడి
రచనమోహన్ బమ్మిడి
బమ్మిడి జగదీశ్వర రెడ్డి (మాటలు)
నిర్మాతబి. జీవన్ రెడ్డి
కోసనం దామురెడ్డి
తారాగణంసత్యదేవ్ కంచరాన
ప్రియ లాల్
ఛాయాగ్రహణంమైలేసన్ రంగస్వామి
కూర్పుప్రణవ్ మిస్త్రీ
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థలు
మ్యాంగో మాస్ మీడియా
అకర్ వర్క్స్
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ
17 డిసెంబరు 2020
సినిమా నిడివి
121 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం సవరించు

సదానంద్ (సత్యదేవ్) మెకానికల్ ఇంజనీర్, అతను శబ్దం లేని వాహనాన్ని కనిపెట్టాలనుకుంటున్నాడు. శిరీష (ప్రియ లాల్) ఒక సంగీత విద్వాంసురాలు, ఆమె మాస్టర్స్ చేయడానికి హైదరాబాదు నగరానికి వస్తుంది. వారు పక్కపక్క ఫ్లాట్లలో నివసిస్తున్నారు. వారు ఒకరినొకరు చూసుకోకుండా మాట్లాడుకుంటారు. ఇలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. చివరికి వారు ప్రేమలో పడతారు. ఆ తరువాత ఏం జరిగిందనే మిగతా కథ.

నటవర్గం సవరించు

నిర్మాణం సవరించు

2017లో ఈ సినిమా ప్రారంభించబడింది, కానీ వివిధ కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యం అయింది.[5] ఈ చిత్రం 2020లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.[6]

పాటలు సవరించు

సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.[7]

 1. ప్రేమ తొలిగా తెలిసేను (రచన: కృష్ణ కాంత్, గానం: సాయి చరణ్, నూతన మోహన్)
 2. తినగా తినగా (రచన: సురేందర్ మిట్టపల్లి, గానం: విల్సన్ హెరాల్డ్)
 3. కళ్ళు కళ్ళు కలిసే (రచన: కందికొండ, గానం: స్వీకర్ అగస్తి, మనీషా ఈరబత్తిని, వినయ్ కుమార్, శ్రీకావ్య)
 4. కనులే మునిగే (రచన: కృష్ణ కాంత్, గానం: అపర్ణ నందన్, రవి ప్రకాష్ చోడిమల్లా)
 5. పుటుక్కు జర జర (రచన: అభినయ శ్రీనివాస్, గానం: రాహుల్ రామకృష్ణ సురేష్ బొబ్బిలి, ప్రియదర్శి పులికొండ)

స్పందన సవరించు

"ఒకరినొకరు కలవకుండా ప్రేమలో పడటం అనేది టాలీవుడ్‌కు కొత్తేమీ కాదు" అని ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు చెందిన తధాగత్ పాతి వ్రాశాడు.[8] ఇండియాగిల్ట్జ్ కూడా విమర్శ రాసింది.[9] "మోహన్ బమ్మిడి దర్శకత్వం వహించిన గువ్వ గోరింక సినిమా, 90ల సినిమాలను తలపిస్తోంది" అని ఫిల్మ్ కంపానియన్ కి చెందిన కార్తీక్ కేరమలు వ్రాశాడు. [10]

మూలాలు సవరించు

 1. Uddagiri, Nikisha. "I'm not the hero, story is: Satyadev". Telangana Today. Retrieved 2021-02-11.
 2. S, Varalakshmi. "గువ్వా గోరింక అంటూ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన సత్యదేవ్". TeluguStop.com. Retrieved 2021-02-11.
 3. "Satyadev's 'Guvva Gorinka' to premiere on OTT from THIS date - Telugu News". IndiaGlitz.com. 2020-11-14. Retrieved 2021-02-11.
 4. Buzz, Tollywood (2020-11-16). "Middle Class Melodies & Guvva Gorinka To Have Direct OTT Release". Tollywood Buzz. Retrieved 2021-02-11.
 5. Goud, Nagaraj (2017-02-21). "Satyadev on a roll". www.thehansindia.com. Retrieved 2021-02-11.
 6. Nanda Gopal (2017-02-11). "Satyadev in Guvva Gorinka | Satyadev Guvva Gorinka Movie | Guvva Gorinka". Telugu Filmnagar. Retrieved 2021-02-11.[permanent dead link]
 7. "Guvva Gorinka 2020 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-02-11.{{cite web}}: CS1 maint: url-status (link)
 8. Guvva Gorinka Movie Review: With nothing fresh to offer, this never-ending drama tests your patience, retrieved 2021-02-11
 9. "Guvva Gorinka review. Guvva Gorinka Telugu movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 2021-02-11.
 10. Keramalu, Karthik (21 December 2020). "Guvva Gorinka Movie Review". Film Companion. Retrieved 2021-02-11.

బయటి లింకులు సవరించు