దళం (2013 సినిమా)

ఎం. జీవన్ రెడ్డి దర్శకత్వంలో 2013లో విడుదలైన తెలుగు చలనచిత్రం

దళం 2013, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు బి. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, పియా వాజ్‌పాయ్, నాజర్, అభిమన్యు సింగ్, కిషోర్ నటించగా జేమ్స్ వసంతన్ సంగీతం అందించాడు. ది మామోత్ మీడియా, ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం. సుమంత్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2014, ఏప్రిల్ 4న కూట్టం పేరుతో తమిళంలో విడుదలైంది. జైలు నుండి విడుదలైవచ్చిన మాజీ నక్సలైట్ల బృందం కొత్తగా తమ జీవితాలను ప్రారంభించి పోలీసులు, రాజకీయ నాయకులపై వారు చేసిన పోరాట నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.[1]

దళం
Dalam 2013 Movie Poster.jpg
దళం సినిమా పోస్టర్
దర్శకత్వంబి. జీవన్ రెడ్డి
రచనశంకర్ దేవరాజ్
స్క్రీన్‌ప్లేబి. జీవన్
కథబి. జీవన్
నిర్మాతఎం. సుమంత్ కుమార్ రెడ్డి
నటవర్గంనవీన్ చంద్ర
పియా వాజ్‌పాయ్
నాజర్
కిషోర్
అభిమన్యు సింగ్
కూర్పుమధు
సంగీతంజేమ్స్ వసంతన్
నిర్మాణ
సంస్థలు
ది మామోత్ మీడియా, ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీలు
2013 ఆగస్టు 15 (2013-08-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాంశంసవరించు

నక్సలైట్లు ఉన్న ప్రాంతంలో చిత్రకథ ప్రారంభమవుతుంది. అక్కడ రాష్ట్ర పోలీసు, నక్సలైట్లకు మధ్య కాల్పుల పోరాటం జరుగుతోంది. ఆ పోరాటంలో చాలామంది నక్సలైట్లు చనిపోతారు. నక్సలైట్లు పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకొని ప్రభుత్వానికి లొంగిపోతారు. జైలులో ఉన్న సమయంలో వారు చాలా హింసకు గురవుతారు. అప్పుడు జైలు అధికారి వారిని మార్చి పోలీసు సానుభూతిపరులుగా మారడానికి, ఉద్యోగాలు రావడానికి సహాయం అందిస్తాడు.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి. జీవన్ రెడ్డి
  • నిర్మాత: ఎం. సుమంత్ కుమార్ రెడ్డి
  • రచన: శంకర్ దేవరాజ్
  • సినిమాటోగ్రాఫర్‌ : సుధాకర్ రెడ్డి యక్కంటి
  • సంగీతం: జేమ్స్ వసంతన్
  • కూర్పు: మధు
  • నిర్మాణ సంస్థ: ది మామోత్ మీడియా, ఎంటర్టైన్మెంట్

నిర్మాణంసవరించు

2012 ప్రారంభంలో పియా వాజ్‌పాయ్‌తో ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభమయింది. అప్పటికే నవీన్ చంద్రతో తమిళంలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో నటులు కిషోర్, నాజర్, సాయికుమార్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. జేమ్స్ వసంతన్ సంగీతం అందించాడు. ప్రతి సన్నివేశాన్ని తమిళ, తెలుగు భాషల కోసం రెండుసార్లు చిత్రీకరించారు.[2]

పాటలుసవరించు

దళం
జేమ్స్ వసంతన్ స్వరపరచిన పాటలు
విడుదల2013
రికార్డింగు2013
సంగీత ప్రక్రియపాటలు
నిడివి22:31
భాషతెలుగు
రికార్డింగ్ లేబుల్వేగ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతజేమ్స్ వసంతన్

ఈ చిత్రానికి జేమ్స్ వసంతన్ సంగీతం అందించాడు.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఎటెల్లినా అరణ్యమే (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రివిజయ్ యేసుదాస్3:09
2."తయ్యా తయ్యా (రచన: కృష్ణ చైతన్య)"కృష్ణ చైతన్యధనుంజయ్, బెల్లీ రాజ్, రఘు, సోమసుందర్, ప్రసాద్4:44
3."ఇక్కడి నుండి ఎక్కడి దాకా (రచన: అనంత శ్రీరామ్)"అనంత శ్రీరామ్హరిచరణ్, శ్వేత మోహన్5:26
4."అద్దిరబన్నా (రచన: సాహితి)"సాహితిప్రియ సుబ్రహ్మణ్యం4:48
5."ఎక్ బార్ ఏసుకోరా తీన్ మార్ (రచన: కృష్ణ చైతన్య)"కృష్ణ చైతన్యధనుంజయ్, సుందరన్, శ్రీనివాస్, పూజా4:24
Total length:22:31

విడుదలసవరించు

2013, ఆగస్టు 15లో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలు అందుకుంది. "సామాజిక అంశాల నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం మనలోని ఆలోచనలను కలిగిస్తుందని" పేర్కొనబడింది.[3]

మూలాలుసవరించు

  1. Times of India, Movie Review (15 August 2013). "Dalam Movie Review". Archived from the original on 27 March 2016. Retrieved 18 September 2020.
  2. "'Dalam is an intelligent film'". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2020-09-18.
  3. Fully Hyderabad (2013-08-15). "Dalam Movie Review". Fully Hyderabad. Retrieved 2020-09-18.{{cite web}}: CS1 maint: url-status (link)